ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లోని సాబర్‌మతీ నది తీరం లో ఏర్పాటైన అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్-2019 ని ప్రారంభించారు. ఇందులో తమ ఉత్పత్తుల ను ప్రదర్శన కు ఉంచి, వాటి కి సంబంధించిన వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసం గుజరాత్ నలుమూలల నుండి వీధుల లో వస్తువుల ను అమ్ముకునే విక్రేత ల మొదలుకొని శాపింగ్ మాల్స్ వరకు, మరి అలాగే నిపుణులైన పనివారు మొదలుకొని హోటళ్ళు, రెస్టరాంట్ లకు సంబంధించిన వ్యాపార సంస్థ ల వరకు ఇక్కడ కు విచ్చేశాయి. ఈ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది వైబ్రంట్ గుజరాత్ సమిట్ తో పాటు అదే కాలం లో ఏర్పాటైంది.
ఈ సందర్భం గా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. ‘‘సాధారణం గా మనం ఈ తరహా పెద్ద వ్యాపార సంబంధ శిఖర సమ్మేళనాన్ని కేవలం విదేశాల లోనే చూస్తుంటా. ప్రస్తుతం వైబ్రంట్ గుజరాత్ తో పాటు అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్ కూడా ఆరంభం కావడం అంటే అది ఒక అభినందనీయమైనటువంటి కార్యక్రమం’’ అంటూ ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.
‘‘ప్రభుత్వం దేశం లో వ్యాపారానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం అదే పని గా కృషి చేస్తూ వస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల లో పాత చట్టాల ను రద్దు చేయడమే కాక వందలాది నియమాల ను సులభతరం చేయడమైంది. ఇటువంటి ప్రయత్నాల కారణం గానే మనం వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం తాలూకు స్థానాల లో 142 వ స్థానం నుండి 77 వ స్థానాని కి మెరుగు పడ్డాం. చిన్న, నవ పారిశ్రామికుల కోసం ప్రక్రియల ను సరళతరం చేయాలనేది మా నిరంతర ప్రయత్నం గా ఉంది. జిఎస్‌టి, ఇంకా ఇతర రిటర్నుల ప్రాతిపదిక న చిన్న నవ పారిశ్రామికుల కు బ్యాంకులు పరపతి ని సమకూర్చగలిగే వ్యవస్థ దిశ గా మనం పయనిస్తున్నాం. ఒక కోటి రూపాయల వరకు రుణాల ను 59 నిమిషాల లో మేం పరిష్కరిస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో వివరించారు.
అంతక్రితం ప్రధాన మంత్రి గాంధీనగర్ లో గల మహాత్మ మందిర్ ఎగ్జిబిశన్ కమ్ కన్వెన్శన్ సెంటర్ లో ఏర్పాటైన ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ శో’ను ప్రారంభించారు. దీనితో గాంధీనగర్ లో జనవరి 18-20 తేదీ ల మధ్య కాలం లో జరుగవలసి ఉన్న వైబ్రంట్ గుజరాత్ సమిట్ తొమ్మిదో సంచిక కు రంగం సిద్ధమైంది. ఈ శిఖర సమ్మేళనం లో దేశాధినేతలు ప్రపంచ పరిశ్రమ రంగ సారథుల తో పాటు మేధావులు కూడా పాలుపంచుకోనున్నారు. రేపు శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
आमतौर पर बड़ी बिजनेस समिट के साथ इस प्रकार के आयोजन हम विदेश में ही देखते थे।
— PMO India (@PMOIndia) January 17, 2019
अब वाइब्रेंट गुजरात के साथ ही अहमदाबाद शॉपिंग फेस्टिवल की शुरुआत, एक सराहनीय पहल है: PM
मुझे बताया गया है कि गुजरात के अलग-अलग हिस्सों से स्ट्रीट वेंडर से लेकर शॉपिंग मॉल तक के व्यापारी इस फेस्टिवल में शामिल हुए हैं।
— PMO India (@PMOIndia) January 17, 2019
हस्तशिल्पियों से लेकर इलेक्ट्रॉनिक्स और होटल-रेस्तरां से जुड़े कारोबारी अपने उत्पादों का प्रचार प्रसार करने यहां आए हैं: PM
देश में व्यापार के लिए अनुकूल माहौल बनाने के लिए सरकार लगातार काम कर रही है। बीते 4 वर्ष में सैकड़ों नियमों को आसान बनाया गया है, पुराने कानूनों को समाप्त किया गया है।
— PMO India (@PMOIndia) January 17, 2019
इन्हीं का नतीजा है कि 4 वर्ष पहले जहां हम Ease of Doing Business में 142 नंबर पर थे, आज 77 रैंक पर हैं: PM
सरकार का प्रयास है कि छोटे उद्यमियों के लिए प्रक्रियाओं को आसान किया जाए।
— PMO India (@PMOIndia) January 17, 2019
हम उस व्यवस्था की तरफ बढ़ रहे हैं जब GST और जो दूसरे रिटर्न हैं, उन्हीं के आधार पर बैंक छोटे उद्यमियों को ऋण की सुविधा दें।
59 मिनट में एक करोड़ रुपए तक के ऋण की सैधांतिक मंजूरी मिल रही है: PM