ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ (పిబిడి) 15వ సంచిక యొక్క స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని వారాణ‌సీ లోని దీన్‌ద‌యాళ్ హ‌స్త్ క‌ళ సంకుల్ లో నేడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

 

మారిష‌స్ ప్ర‌ధాని శ్రీ ప్ర‌వింద్ జ‌గ‌న్నాథ్ పిబిడి 2019 కి ముఖ్య అతిథి గా విచ్చేశారు.  ఈ కార్య‌క్ర‌మాని కి హాజ‌రైన వారిలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాం నాయ‌క్‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మ‌తి సుష్మ స్వ‌రాజ్ ల తో పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్‌, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింహ్ రావత్, విదేశాల లో భార‌తీయుల వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి జ‌న‌ర‌ల్ (రిటైర్డ్‌) వి.కె. సింహ్‌, ఇంకా ప‌లువురు ఇత‌ర ప్ర‌ముఖులు కూడా ఉన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ప్ర‌సంగం లో ప్ర‌వాసుల కు వారి యొక్క పూర్వికుల దేశం ప‌ట్ల వారి లో ఉన్నటువంటి ప్రేమానురాగాలే వారిని భార‌త‌దేశాని కి తీసుకువ‌చ్చాయ‌న్నారు.  ఒక ‘న్యూ ఇండియా’ నిర్మాణం కోసం ప్ర‌వాసీయ భార‌తీయ స‌ముదాయం చేతులు క‌ల‌పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

  ‘‘వసుధైవ కుటుంబకమ్’’ సంప్ర‌దాయాన్ని స‌జీవంగా నిల‌బెట్ట‌డం లో భార‌తీయ ప్ర‌వాసుల భూమిక ను ప్ర‌ధాన మంత్రి హ‌ర్షించారు.  ప్రవాస భార‌తీయులు భార‌తదేశాని కి ప్ర‌చార దూత‌లు గా మాత్ర‌మే కాక భార‌త‌దేశం యొక్క బ‌లం, సామ‌ర్ధ్యాలు, ఇంకా స్వ‌భావాల‌ కు కూడా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.  ప్రత్యేకించి ప‌రిశోధ‌న పరం గా, నూత‌న ఆవిష్క‌ర‌ణ పరం గా ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించ‌డం లో పాలుపంచుకోవ‌ల‌సింద‌ని ప్ర‌వాసుల‌ను ఆయ‌న కోరారు.

భార‌త‌దేశం సాధించిన స‌త్వ‌ర పురోగ‌తి కారణం గా ఇండియా ను ప్ర‌పంచం లో కెల్లా ఉన్న‌త‌మైన పీఠం పై నిల‌చినట్లు భావిస్తున్నరు; మరి ప్ర‌పంచ స‌ముదాయానికి నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల స్థాయి లో భార‌త‌దేశం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  అంత‌ర్జాతీయ సౌర కూట‌మి దీనికి ఒక ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న అన్నారు.  స్థానికం గా ప‌రిష్కారాన్ని అన్వేషించడం, దాని ని ప్ర‌పంచ స్థాయి లో వ‌ర్తింప చేయ‌డం మ‌న మంత్రం అని శ్రీ మోదీ వివ‌రించారు.  అంత‌ర్జాతీయ సౌర కూట‌మి ని ‘ఒక ప్ర‌పంచం, ఒక సూర్యుడు, ఒకే గ్రిడ్’ దిశ గా వేసిన‌టువంటి ఒక అడుగు గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ప్ర‌పంచం లో ఆర్థిక శ‌క్తి నిల‌యాల లో ఒక‌టి గా రూపొందే మార్గం లో భార‌త‌దేశం ప‌య‌నిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశం లో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకో సిస్ట‌మ్స్ లో ఒక‌టి గా ప‌ని చేస్తోంద‌ని, ప్ర‌పంచం లో అత్యంత భారీ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కం కూడా ఇండియా లో అమ‌లు లో ఉంద‌ని చెప్పారు.  ‘మేక్ ఇన్ ఇండియా’ లో మేము పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తున్నామ‌ని తెలిపారు.  స‌మృద్ధ‌మైన పంట‌ల ఉత్ప‌త్తి మ‌న ప్ర‌ధాన కార్య‌సాధ‌న గా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

మునుప‌టి ప్ర‌భుత్వం హ‌యాం లో సంకల్ప శ‌క్తి లోపం మ‌రియు స‌ముచిత విధానాల కొర‌త ల కార‌ణం గా ల‌బ్దిదారుల‌ కు ఉద్దేశించిన నిధుల భారీ రాశి వారి కి ల‌భ్యం కాలేద‌ని ప్ర‌ధాన మంత్రి విమ‌ర్శించారు.  అయితే,  ప్ర‌స్తుతం వ్య‌వ‌స్థ లోని లోటు పాటుల‌ ను సాంకేతిక విజ్ఞానం స‌హాయం తో మేం అధిగ‌మించామ‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌జా ధ‌నాన్ని దోచుకోవ‌డాన్ని ఆపివేయ‌డ‌మైంద‌ని, కోల్పోయిన ధ‌నం లో 85 శాతం ధ‌నాన్ని అందుబాటు లోకి తీసుకు రావ‌డమైంద‌ని, దానిని ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల లోకి నేరుగా బ‌ద‌లాయించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. గ‌త నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలుగా 5,80,000 కోట్ల రూపాయ‌ల ను నేరు గా ప్ర‌జ‌ల ఖాతాల లోకి బ‌దిలీ చేయ‌డ‌మైంద‌న్నారు.  ల‌బ్దిదారుల జాబితా లో నుండి 7 కోట్ల బోగ‌స్ పేర్ల‌ ను ఏ విధంగా తొల‌గించిందీ ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, ఈ సంఖ్య బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌ మ‌రియు ఇట‌లీ ల జ‌నాభా కు దాదాపు స‌మాన‌మ‌న్నారు.

త‌న ప్ర‌భుత్వం తెచ్చిన మార్పుల లో ఇవి కొన్ని అని ఆయ‌న చెబుతూ, ఇది ఒక ‘న్యూ ఇండియా’ తాలూకు నూత‌న విశ్వాసాన్ని ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు.

ఒక ‘న్యూ ఇండియా’ సాధ‌న కు గాను, మ‌నం చేసుకున్న తీర్మానం లో ప్ర‌వాసుల‌ కు స‌మాన‌మైన ప్రాముఖ్యం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  వారి భ‌ద్ర‌త ను కూడా మ‌నం ప‌ట్టించుకోవ‌ల‌సి ఉంద‌ని, ఘ‌ర్ష‌ణ మండ‌లాల లో చిక్కుకు పోయిన రెండు ల‌క్ష‌ల మంది కి పైగా భార‌తీయుల ను త‌ర‌లించే స‌వాలు ను ప్ర‌భుత్వం ఏ విధంగా స్వీక‌రించిందీ ఆయ‌న ఈ సంద‌ర్భం గా ఉదాహ‌రించారు.

 

విదేశాల లో నివ‌సిస్తున్న భార‌తీయు ల సంక్షేమాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ,ప్ర‌యాణానుమ‌తి ప‌త్రాలు, ఇంకా వీజా నియ‌మాల‌ ను స‌ర‌ళ‌త‌రం చేయ‌డ‌మైంద‌ని, అంతే కాక ఇ–  వీజా సదుపాయం వారి కి ప్ర‌యాణాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం గా మార్చి వేసిందన్నారు. ప్ర‌వాస భార‌తీయులంద‌రినీ ప్ర‌స్తుతం పాస్‌పోర్ట్ సేవ కు ముడిపెట్ట‌డం జ‌రుగుతోంద‌ని, చిప్ ఆధారితమైన ఇ- పాస్‌పోర్ట్ ను జారీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.

 

ప్ర‌వాసీ తీర్థ్ ద‌ర్శ‌న్ యోజ‌న కు రూపక‌ల్ప‌న చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  విదేశాల లో ఉంటున్న భార‌తీయులు ఒక్కొక్క‌రు భార‌త్ కు చెంద‌ని 5 కుటుంబాల‌ ను ఇండియా సంద‌ర్శ‌న‌ కు ఆహ్వానించాల‌ని ఆయ‌న కోరారు.  అలాగే, గాంధీ జీ మ‌రియు గురు నాన‌క్ దేవ్ జీ ల విలువ‌ల‌ ను వ్యాప్తి చేయ‌వ‌ల‌సింద‌ని, వారి స్మ‌ర‌ణోత్స‌వాల‌ లో పాలుపంచుకోవ‌ల‌సింద‌ని కూడా ఆయ‌న అభ్య‌ర్ధించారు.  బాపూ జీ కి న‌చ్చిన భ‌జ‌న గీతం ‘వైష్ణ‌వ జ‌న్’ సంక‌ల‌నం లో ప్ర‌పంచ స‌ముదాయం మ‌న‌ తో క‌ల‌సి రావ‌డం మ‌న‌ కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

 

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ ను విజ‌య‌వంతం చేయ‌డం లో ఆప్యాయత తో, ఆతిథ్యం తో కాశీ నివాసులు పోషించిన పాత్ర‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు.  త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న స్కూల్ బోర్డ్ ప‌రీక్ష‌ల క‌న్నా ముందే – 2019 వ సంవ‌త్స‌రం జ‌న‌వరి 29 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు–NAMO App ద్వారా విద్యార్థుల తో, వారి త‌ల్లిదండ్రుల‌తో ప‌రీక్షా పే చ‌ర్చా లో తాను  ముఖాముఖి సంభాషించ‌నున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

పిబిడి-2019 కి ముఖ్య అతిథి గా విచ్చేసిన మారిష‌స్ ప్ర‌ధాని శ్రీ ప్ర‌వింద్ జ‌గ‌న్నాథ్ భార‌తీయ ప్ర‌వాసుల జ్ఞాపకాల‌ను గురించి, వారి పూర్వికుల గ‌డ్డ తో వారికి ఉన్న‌టువంటి సంధానాన్ని గురించి ప్ర‌స్తావించారు.  ఆయ‌న హిందీ భాష లో, ఇంగ్లీషు భాష లో మాట్లాడుతూ ఇటువంటి జ‌న స‌మూహం విదేశాల లో ఉంటున్న భార‌తీయులంతా ఒకే కుటుంబ స‌భ్యులు అనేటటువంటి గుర్తింపు ను ప్ర‌స్ఫుటం చేస్తుంద‌న్నారు.  భార‌త‌దేశం విశిష్ట‌మైన‌దైతే, భార‌తీయ‌త సార్వ‌జ‌నిక‌మైన‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  విద్యావంతులైన మ‌రియు స్వావ‌లంబ‌న ను క‌లిగివున్న ప్ర‌వాసీ స‌ముదాయం జాతి నిర్మాణం లో ఒక ప్ర‌ధాన‌మైన భూమిక ను పోషించ గ‌లుగుతుంద‌ని, అంతేగాక‌ బ‌హుళ పార్శ్విక వాదానికి వీరు సహాయ‌కారి కాగ‌లుగుతార‌ని మారిష‌స్ ప్ర‌ధాని చెప్పారు.

ఆయ‌న భోజ్‌పురి మాండ‌లికం లో మాట్లాడి, జ‌న సందోహాన్ని ఆకట్టుకొన్నారు.  తొలి అంత‌ర్జాతీయ భోజ్‌పురి ఉత్స‌వాన్ని మారిష‌స్ నిర్వ‌హిస్తుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమ‌తి సుష్మ స్వ‌రాజ్ త‌న ప్రారంభోప‌న్యాసం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ హుషారయిన నాయ‌క‌త్వం లో భార‌త‌దేశం ఇవాళ గ‌ర్వ‌ప‌డుతోంద‌న్నారు.  మాతృ భూమి తో బంధాల‌ను పెన‌వేసుకొన్నందుకు గాను ప్ర‌వాసీ భార‌తీయ స‌ముదాయానికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ,ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న‌ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ మ‌రియు కుంభ్ మేళా లు ‘ఏక్ భార‌త్ శ్రేష్ఠ్ భార‌త్’ కు అద్దం ప‌డుతున్నాయ‌న్నారు.

భార‌త్ ను గురించి తెలుసుకోండి పేరిట నిర్వ‌హించిన క్విజ్ పోటీ లో విజేత‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స‌త్క‌రించారు.  ఈ క్విజ్ పోటీ ప్ర‌వాసీ భార‌తీయ యువ‌జ‌నుల కు ఉద్దేశించింది.

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ ముగింపు కార్య‌క్ర‌మం 2019 వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 23వ తేదీ న జరుగ‌నుంది.  రాష్ట్రప‌తి శ్రీ రాంనాథ్ కోవింద్ ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసి, ఎంపిక చేసిన కొంత మంది ప్ర‌వాసీ భార‌తీయుల‌కు వారు అందించిన సేవ‌ల‌కు గాను ‘ప్ర‌వాసీ భార‌తీయ స‌మ్మాన్’ ను ప్ర‌దానం చేయనున్నారు.

 

స‌మ్మేళ‌నానంత‌రం జ‌న‌వ‌రి 24 వ తేదీ నాడు ప్ర‌వాసీ స‌ముదాయం ప్ర‌తినిధులు కుంభ్ మేళా లో పాలుపంచుకునేందుకు ప్ర‌యాగ్‌రాజ్ ను సంద‌ర్శించ‌నున్నారు.  వారు జ‌న‌వ‌రి 25 వ తేదీ నాడు ఢిల్లీ కి బయలుదేరి వెళ్తారు; న్యూ ఢిల్లీ లోని రాజ్‌ప‌థ్ లో జ‌రిగే గ‌ణ‌తంత్ర దిన క‌వాతు ను వారు తిల‌కిస్తారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi