అజ్ మేర్ శరీఫ్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క దర్ గాహ్ లో సమర్పించేందుకుగాను ఉద్దేశించినటువంటి ఒక చాదర్ ను అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అప్పగించారు.
ప్రపంచమంతటా విస్తరించివున్న ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క అనుయాయులకు వార్షిక ఉర్స్ సందర్భంగా ప్రధాన మంత్రి అభినందనలను మరియు శుభాకాంక్షలను తెలిపారు.