PM flags off the first #UDAN flight under the regional connectivity scheme
PM Modi lays Foundation Stone of a Hydro Engineering College at Bilaspur, Himal Pradesh
The lives of the middle class are being transformed and their aspirations are rising. If given the right chance, they can do wonders: PM Modi
Aviation sector in India is filled with immense opportunity: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉడాన్ (UDAN – the Regional Connectivity Scheme for civil aviation)ను శిమ్ లా విమానాశ్రయం నుండి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా శిమ్ లా, నాందేడ్ మరియు కడప విమానాశ్రయాల నుండి విమాన యాత్రలు ఆరంభమయ్యాయి.

 

ప్రధాన మంత్రి హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పుర్ లో ఒక హైడ్రో ఇంజినీరింగ్ కాలేజి కి శంకుస్థాపన సూచకంగా ఇ-ప్లేక్ ను ఆవిష్కరించారు.

ప్రధాన మంత్రి వీడియో లింక్ ద్వారా శిమ్ లా విమానాశ్రయం లోను, ఇంకా నాందేడ్, కడప విమానాశ్రయాల లోనూ ఏర్పాటైన సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

మధ్య తరగతి ప్రజల జీవితాలు మార్పునకు లోనవుతున్నాయని, వారి అభిలాషలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వారికి సరైన అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలుగుతారని ఆయన చెప్పారు. భారతదేశంలో విమానయాన రంగం అవకాశాలతో నిండివుందని కూడా ఆయన వివరించారు. ప్రస్తుత పథకం ‘ఉడాన్’ పేరును గురించి ప్రస్తావించి, ఉడాన్ కు విస్తృత‌మైన‌ అర్థం ‘‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (దేశంలోని సామాన్య పౌరుడు ఆకాశయానం చేయుగాక) అని, ఒకప్పుడు విమానయానం అనేది ఎంపిక చేసిన కొద్ది మంది అధికార పరిధిగా పరిగణింపబడేదని, కానీ ఇప్పుడు ఈ స్థితి మారిందన్నారు. నూతన పౌర విమానయాన విధానం భారతదేశ ప్రజల ఆశలను నెరవేర్చడానికి ఒక అవకాశాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు. రెండో అంచె మరియు మూడో అంచె నగరాలు వృద్ధికి చోదక శక్తులుగా రూపుదాలుస్తున్నాయని, ఆయా నగరాల నడుమ గగనతల అనుసంధానం పెంపొందితే అది లాభదాయకం అవుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఉడాన్ పథకం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటక రంగానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi