ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రవాండా ప్రభుత్వం యొక్క ‘గిరింక’ కార్యక్రమం లో భాగంగా ఇప్పటి వరకు గోవులు లేనటువంటి పల్లె వాసులకు 200 ఆవులను ఈ రోజు బహూకరించారు. గోవులను అప్పగించే కార్యక్రమాన్ని రవాండా అధ్యక్షుడు శ్రీ పాల్ కగామే సమక్షంలో ఆదర్శ గ్రామం రువేరు లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, గిరింక కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో అధ్యక్షుడు శ్రీ పాల్ కగామే తీసుకొన్న చొరవను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. సుదూరాన ఉన్నటువంటి రవాండాలో పల్లెలలో ఆర్థిక సాధికారితకు ఒక సాధనంగా గోవు కు ఇంతటి ప్రాముఖ్యాన్ని కట్టబెడుతూ ఉండడాన్ని చూసి భారతదేశంలోని ప్రజలు ఒక ఆనందభరితమైనటువంటి ఆశ్చర్యానికి లోనవుతారని ఆయన అన్నారు. రెండు దేశాలలో గ్రామీణ జీవనంలోని పోలిక ను గురించి ఆయన వివరించారు. రవాండా లోని గ్రామాలు పరివర్తనకు లోనవడానికి గిరింక కార్యక్రమం తోడ్పడగలదని ఆయన అన్నారు.
పూర్వరంగం
గిరింక అనే పదానికి మీరు ఒక గోవును కలిగివుంటారా అనే భావాన్ని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి గౌరవాన్ని, కృతజ్ఞతను చాటిచెప్పేందుకు ఒక గోవును ఇవ్వడం అనే శతాబ్దాల నాటి సాంస్కృతిక సంప్రదాయాన్ని గిరింక సూచిస్తుంది.
చిన్నారులలో పోషకాహార లోపం సమస్య అంతకంతకు పెచ్చుపెరిగిపోతుండగా ఆ సమస్య నివారణ దిశగా అధ్యక్షుడు శ్రీ పాల్ కగామే చొరవ తీసుకొని ప్రారంభించిన కార్యక్రమమే గిరింక. పేదరికాన్ని శీఘ్ర గతిన తగ్గించడం తో పాటు పశుగణాన్ని, ఇంకా పంట నాట్లను సమ్మిళితపరచేందుకు ఒక మార్గంగా దీనిని ఎంచుకోవడం జరిగింది. పేద కుటుంబానికి ఒక పాడియావు ను అందిస్తే- పేడను ఎరువుగా వాడడం వల్ల నేల నాణ్యత మెరుగై, గడ్డి ఇంకా మొక్కలను పెంచడంతో భూమి కోత తగ్గి వ్యవసాయోత్పాదకత హెచ్చి- జీవనోపాధులలో మార్పు చోటు చేసుకొంటుందని సముదాయాలు బాగుపడుతాయన్న సిద్ధాంతం పైన ఈ కార్యక్రమం ఆధారపడింది.
ఈ కార్యక్రమం అమలును 2006 లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంతవరకు లక్షలాది ఆవులను గిరింక కార్యక్రమంలో భాగంగా అందుకోవడమైంది. 2016 జూన్ కల్లా, పేద కుటుంబాలకు 2,48,566 గోవులను సమకూర్చడం జరిగింది.
ఈ కార్యక్రమం రవాండా లో వ్యవసాయ ఉత్పత్తి అధికం కావడానికి తోడ్పడింది. ప్రత్యేకించి, పాల ఉత్పత్తి, ఇంకా పాడి ఉత్పత్తులు పెరిగాయి. పోషకాహార లోపం తగ్గుముఖం పట్టింది. ఆదాయాలు వృద్ధి చెందాయి. ఒక వ్యక్తి మరొకరికి ఒక గోవును ఇచ్చిన పక్షంలో అది దాతకు, లబ్ధిదారుకు మధ్య విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచి పోషిస్తుందన్న సాంస్కృతిక సిద్ధాంతం పైన ఆధారపడినటువంటి ఈ కార్యక్రమం ఏకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు రవాండా పౌరుల లో సమన్వయానికి బాట పరచాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశ్యం. ఇది గిరింక పరమార్థం కాకపోయినప్పటికీ, ఈ కార్యక్రమం తాలూకు ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. లబ్ధిదారులుగా ఎవరు ఉండాలో ఎంపిక చేయడంలో ఈ కార్యక్రమం ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని అనుసరిస్తుంది. రవాండా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పిన దాని ప్రకారం గోవు ను సమకూర్చడం కోసం- నిరుపేద కుటుంబాలు ఎవరి వద్ద అయితే గడ్డి ని పెంచేందుకు భూమి ఉండి ఆవు మాత్రం లేదో- అటువంటి కుటుంబాన్ని ఈ పథకం కోసం ఎంచుకోవడం జరుగుతుంది. ఆ భూమిలో పెంచే గడ్డిని ఆవుల పోషణకు వినియోగిస్తారు. లబ్ధిదారు పశువుల కోసం ఒక పాక ను నిర్మించే స్తోమతను కలిగివుండాలి; లేదా ఇతరులతో కలసి ఒక సాముదాయిక ఆవుల పాక ను నిర్మించేందుకు సుముఖతను వ్యక్తం చేసే వారై ఉండాలి.
Being part of a transformative project towards economic development of Rwanda! PM @narendramodi donates 200 cows under #Girinka - One Cow per Poor Family Programme at Rweru village. Girinka is an ambitious projects that provides both nutritional & financial security to the poor. pic.twitter.com/bXOKbOnd9g
— Raveesh Kumar (@MEAIndia) July 24, 2018
Transforming lives in rural areas! More images of cow donation function under Rwanda's Girinka programme. Rwandan President @PaulKagame joined PM @narendramodi at the event. pic.twitter.com/xlVGYmrXNT
— Raveesh Kumar (@MEAIndia) July 24, 2018