If there is any creation made by man which is immortal its India’s constitution: PM Modi
It’s not easy to make a constitution which binds the country, says the PM
Constitution is not just a book but also contains social philosophy says, PM Modi
Our constitution has kept us on the path democracy, says PM Modi
GST has unified the nation & dream of one tax one nation has been made possible, says PM Modi
Legislature should have the independence of making laws, the executive should have independence in taking decisions: PM
Nearly 18 lakh pre litigated and 22 lakh pending cases have been cleared: PM

నేష‌న‌ల్ లా డే – 2017 సూచ‌కంగా ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌రిగిన ముగింపు స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

రాజ్యాంగం మ‌న ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌కు ఆత్మ వంటిది అని ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ దినం రాజ్యాంగ రూపక‌ర్త‌ల‌కు స్మృత్యంజ‌లిని ఘటించ‌డానికి ఒక సంద‌ర్భం అని ఆయ‌న అన్నారు. రాజ్యాంగం కాల ప‌రీక్ష‌కు త‌ట్టుకొని నిల‌చింద‌ని, అంతే కాక విమ‌ర్శ‌కుల వాదాలు త‌ప్పు అని కూడా నిరూపించింద‌ని ఆయ‌న చెప్పారు.

డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేడ్క‌ర్‌, డాక్ట‌ర్ స‌చ్చిదానంద సిన్హా, డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్‌, డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ లతో స‌హా ప‌లువురు నాయ‌కుల మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగంలో త‌న ప్ర‌సంగంలో ప‌లుమార్లు ఉదాహ‌రించారు. ఈ ఉదాహ‌ర‌ణ‌లు రాజ్యాంగం యొక్క మ‌రియు ప‌రిపాల‌న యొక్క ముఖ్య‌మైన ల‌క్ష‌ణాల‌ను గురించి వివ‌రించ‌డానికి సంబంధించిన‌వే కాక రాజ్యాంగం యొక్క దీర్ఘ ఆయుర్దాయాన్ని (లేదా అమ‌ర‌త్వాన్ని), ఆచ‌ర‌ణీయ‌త్వాన్ని మ‌రియు సార‌ళ్య‌త‌ను సూచించేట‌టు వంటివి కూడాను.

రాజ్యాంగం మ‌న ఒక సంర‌క్ష‌కుని వ‌లె నిలచింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌నను సంర‌క్షిస్తున్న రాజ్యాంగం మ‌న పైన పెట్టుకొన్న ఆశ‌ల‌కు అనుగుణంగా మ‌నం తప్పక న‌డుచుకోవాలని ఆయ‌న నొక్కి చెప్పారు. దేశం యొక్క అవ‌స‌రాల‌తో పాటు, దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్ళ‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వంలోని వేరు వేరు సంస్థ‌లు ఒక‌దానికి మ‌రొక‌టి మ‌ద్ద‌తిస్తూ ప‌ర‌స్ప‌రం బలోపేతం కావాల‌ని ఆయ‌న అన్నారు. మ‌న స్వాతంత్య్ర యోధులు క‌ల‌లు గ‌న్న దేశం – న్యూ ఇండియా – నిర్మించ‌డానికి రానున్న అయిదు సంవ‌త్స‌రాల‌లో మ‌నం మ‌న బ‌లాల‌ను ఏకోన్ముఖం చేయాల‌ని ఆయ‌న చెప్పారు.

రాజ్యాంగాన్ని ఒక సామాజిక ద‌స్తావేజు గా కూడా అభివ‌ర్ణించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. మ‌న దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన స‌మ‌యంలో గుర్తించినటువంటి బ‌ల‌హీన‌త‌ల‌ను ఇప్ప‌టికీ ఇంకా పూర్తిగా నిర్మూలించలేక‌పోవ‌డం ఎంతో దుర‌దృష్ట‌క‌ర‌ం అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం సంపూర్ణ ఆత్మ‌విశ్వాసంతో తొణికిస‌లాడుతున్న ప్ర‌స్తుత కాలాన్ని ఒక స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఈ ఫ‌ల‌ప్ర‌ద వాతావ‌ర‌ణాన్ని ‘న్యూ ఇండియా’ అవ‌త‌ర‌ణ దిశ‌గా వేగంగా ముందుకు సాగేందుకు వినియోగించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

“సౌక‌ర్య‌వంతంగా జీవించ‌డానికి” ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి ఉద్ఘాటించారు. ప్ర‌భుత్వం యొక్క పాత్ర ఒక నియంత్ర‌ణ‌దారుగా క‌న్నా, ఒక స‌హ‌క‌రించే సంస్థ‌గా ఉండాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. “సౌక‌ర్య‌వంతంగా జీవించ‌డం” కోసం గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో అనేక అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. వీటిలో త్వ‌రిత‌ గ‌తిన ఆదాయ‌పు ప‌న్ను వాప‌సుల మంజూరు, శీఘ్ర‌ గ‌తిన పాస్‌పోర్టు అంద‌జేత ల వంటివి ఉన్నాయ‌ని ఆయన వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మాలు స‌మాజం లోని అన్ని వ‌ర్గాల వారి పైనా ఒక స‌కారాత్మ‌క ప్ర‌భావాన్ని క‌ల‌గ‌జేశాయ‌ని ఆయ‌న చెప్పారు. సుమారు 1200 పురాత‌న చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగిన‌ట్లు గుర్తుచేశారు. “సౌక‌ర్య‌వంతంగా జీవించ‌డం’’ అనేది ‘‘వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో సౌల‌భ్యం” మీద కూడా స‌కారాత్మ‌క ప్ర‌భావాన్ని చూపించిందని ఆయ‌న అన్నారు. న్యాయ శాఖ‌లో పేరుకు పోయిన కేసుల‌ను త‌గ్గించ‌డంలో లోక్ అదాల‌త్ లు ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించ‌గ‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. “న్యాయాన్ని సులభంగా అందుకోవ‌డాన్ని” మెరుగుపరచేందుకు అనేక ఇత‌ర చ‌ర్య‌ల‌ను కూడా తీసుకొంటున్నట్లు ఆయ‌న వివ‌రించారు.

త‌ర‌చగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌ల‌సి రావ‌డంతో అందుకు భారీఎత్తున వ్యయమవుతోందని, దీనితో పాటు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌రియు ప్ర‌భుత్వ సిబ్బంది మ‌ళ్ళింపు, ఇంకా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై పడుతున్న ప్ర‌భావం వంటి సంబంధిత అంశాలను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు ఉన్న అవ‌కాశం పై ఒక ఫ‌ల‌ప్ర‌దమైన చ‌ర్చ జ‌ర‌గాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.

కార్య‌నిర్వ‌హ‌ణ‌ శాఖ, చ‌ట్ట‌స‌భ‌లు మ‌రియు న్యాయ వ్య‌వ‌స్థ‌ ల‌కు మ‌ధ్య స‌మ‌తుల్య‌త అనేది రాజ్యాంగానికి ముఖ్యాధారంగా ఉంటూ వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు పాఠాల్లో నుండి కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 డిసెంబర్ 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance