India is in a unique position where our rapid growth enables us to cater to diverse demand: PM
If you want to Make in India, for India and for the world, come to India: PM Modi
Today there is a government in India that respects the business world, respects wealth creation: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ యార్క్ లో నేడు బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ లో ప్రధానోప‌న్యాసం చేశారు.  

సభికుల లో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా భాగం గా ఉన్న ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, తాను ఈ అవ‌కాశాన్ని భార‌త‌దేశ వృద్ధి గాథ తాలూకు భావి దిశ ను వివ‌రించేందుకు వినియోగించుకొంటున్నానన్నారు.  భార‌త‌దేశం యొక్క వృద్ధి గాథ ప్ర‌జాస్వామ్యం, జనసంఖ్య, గిరాకీ మ‌రియు నిర్ణ‌యాత్మ‌క‌త అనే నాలుగు స్తంభాల పై నిర్మితమైంద‌ని ఆయ‌న చెప్పారు.

భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దేశం లో నెలకొన్న రాజ‌కీయ స్థిర‌త్వ వాతావ‌ర‌ణం నుండి ల‌బ్ధి ని పొందిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన విజ‌య‌వంత‌మైన సంస్క‌ర‌ణ‌ల కు ప్ర‌పంచ గుర్తింపు ల‌భించిన‌ట్లు కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్రస్తావించారు.  ఈ సంద‌ర్భం లో ఆయ‌న వరల్డ్ బ్యాంకు మదింపు చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ లో అరవై అయిదవ ర్యాంకు కు మెరుగవడం, లాజిస్టిక్స్ ప‌ర్ ఫార్మెన్స్ ఇండెక్స్ లో ప‌ది స్థానాల మేరకు ఎగబాకడం, గ్లోబ‌ల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ లో ప‌ద‌మూడు స్థానాల ఎదుగుద‌ల, ఇంకా గ్లోబ‌ల్ ఇన‌వేశ‌న్ ఇండెక్స్ లో ఇరవై నాలుగు స్థానాల వృద్ధి ని గురించి ప్ర‌స్తావించారు.  

ప్రపంచ పెట్టుబడుల ను ఆకర్షించడం లో ఆసియా లో అగ్ర‌శ్రేణి ప్రదర్శన ను కనబరచిన ఆర్థిక వ్యవస్థ గా భారతదేశాన్ని బ్లూంబ‌ర్గ్ నేశ‌న‌ల్ బ్రాండ్‌ ట్రాక‌ర్ 2018 స‌ర్వేక్ష‌ణ ఇటీవల పేర్కొన్న సంగ‌తి ని సైతం ప్ర‌ధాన మంత్రి చాటి చెప్పారు.  ఈ నివేదిక యొక్క 10 సూచకాల లో 7 సూచకాలు.. రాజ‌కీయ స్థిర‌త్వం, క‌రెన్సీ స్థిర‌త్వం, అధిక నాణ్య‌త తో కూడిన ఉత్ప‌త్తులు, అవినీతి నిరోధం, ఉత్ప‌త్తి ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉండ‌డం, వ్యూహాత్మ‌క స్థానం, ఇంకా ఐపిఆర్ లు.. ప‌రం గా భార‌త‌దేశం ఉన్న‌త స్థానం లో ఉంది.  

సాంకేతిక విజ్ఞానం మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, భార‌త‌దేశం లో పెట్టుబ‌డి పెట్ట‌డం కోసం త‌ర‌లి రావ‌ల‌సిందిగా ప్ర‌పంచ వ్యాపార స‌ముదాయాన్ని ప్ర‌ధాన మంత్రి ఆహ్వానించారు.  వారి యొక్క సాంకేతిక విజ్ఞానం మ‌రియు భార‌త‌దేశం యొక్క ప్ర‌తిభ క‌ల‌సిక‌ట్టుగా ప్ర‌పంచం లో మార్పు ను కొని తేగ‌ల‌వన్నారు.  వాటి వ్యాపార ప‌రిమాణాని కి భార‌త‌దేశం యొక్క నైపుణ్యాలు జత పడితే ప్ర‌పంచ ఆర్థిక వృద్ధి ని త్వరితం చేయ‌గ‌లుగుతాయన్నారు.

ప్ర‌ధాన మంత్రి కీల‌కోప‌న్యాసం అనంత‌రం బ్లూంబర్గ్ వ్య‌స్థాప‌కుడు శ్రీ మైకల్‌ బ్లూంబ‌ర్గ్ తో ముఖాముఖి స‌మావేశం ఏర్పాట‌యింది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage