On one hand, the Government is trying to make the Armed Forces stronger; and on the other hand, there are those who do not want our Armed Forces to be strong: PM Modi
When it comes to the country's security and the requirements of the Armed Forces, our Government keeps only the interest of the nation in mind: PM
Those who deal only in lies are casting aspersions on the defence ministry, on the Air Force, and even on a foreign government: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఒక రోజంతా ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌ లో భాగంగా ఆయన రాయ్ బ‌రేలీ లో మోడ‌ర్న్ కోచ్ ఫ్యాక్ట‌రీ ని సంద‌ర్శించారు. ఒక జన స‌భ లో ఆయన పాలుపంచుకొని 900వ కోచ్ కు మ‌రియు హ‌మ్ స‌ఫ‌ర్ రేక్ కు జెండాను చూపించారు. ఆయ‌న రాయ్ బ‌రేలీ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాలను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం ఇవ్వడ‌మో, ప్రారంభించ‌డ‌మో లేదా పునాదిరాయి ని వేయ‌డ‌మో చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజున దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేసిన, ప్రారంభించిన లేదా శంకు స్థాప‌న‌లు జ‌రిగిన ప‌థ‌కాల సంచిత విలువ 1000 కోట్ల రూపాయ‌లు గా ఉంద‌ని తెలిపారు.

మోడ‌ర్న్ కోచ్ ఫ్యాక్ట‌రీ యువ‌జ‌నుల‌ కు ఉద్యోగాల‌ను అందించగలదని, రాయ్ బ‌రేలీ ని రైలు పెట్టెల త‌యారీ కి ప్ర‌పంచం లో కేంద్ర స్థానం గా తీర్చిదిద్దగలదని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

భ‌య‌ం, క్రూర‌త్వ‌ం, ఇంకా అరాచ‌క‌త్వాలకు మారుపేరు గా నిల‌చిన వారి ని భార‌తీయ సైన్యం 1971వ సంవ‌త్స‌రం లో ఇదే రోజు న ఓడించిన సంగ‌తి ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఈ రోజు న ఒక వైపు సాయుధ బ‌ల‌గాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తూ ఉంటే, మ‌రొక వైపు మ‌న సాయుధ బ‌ల‌గాలు ప‌టిష్టం కాకుండా ఉండాల‌ని కోరుకొనే వారు నిల‌బ‌డ్డార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అబ‌ద్దాల తో మాత్రమే కాలక్షేపం చేసే వారు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ కు, వైమానిక ద‌ళాని కి, చివ‌ర‌కు ఒక విదేశీ ప్ర‌భుత్వాని కి సైతం ఉద్దేశాల‌ను అంట‌గ‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. 

అబ‌ద్దం ఆడే ప్రవృత్తి పైన నిజం ద్వారానే విజయాన్ని సాధించవ‌చ్చ‌ునని ఆయ‌న అన్నారు.

 దేశ భ‌ద్ర‌త, సాయుధ బ‌ల‌గాల అవ‌స‌రాల విష‌యానికి వ‌స్తే కేంద్ర ప్ర‌భుత్వం దేశ హితాన్ని మాత్రమే దృష్టి లో పెట్టుకొంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రైతుల ఆదాయాల‌ను పెంచ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 22 పంట‌ల‌కు ఎంఎస్‌పి ని పెంచినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ నిర్ణ‌య‌ం తో రైతు ల‌కు 60 వేల కోట్ల రూపాయ‌ల సొమ్ము అద‌నంగా స‌మ‌కూరగలదన్నారు.

 

ఆకస్మిక ప‌రిస్థితులలో నాశ‌న‌మైన పంట‌ల రైతుల‌ కు ‘ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ ద్వారా ప్ర‌యోజ‌నం క‌లుగుతుందని ఆయ‌న వివరించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ‘‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్‌’’ మంత్రాన్ని అనుసరిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 నవంబర్ 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South