PM Modi inaugurates the Arunachal Civil Secretariat in Itanagar, Arunachal Pradesh
I can tell you with great pride that ministers & officials from the Centre are visiting the Northeast very regularly: PM Modi
I am delighted to visit Arunachal Pradesh and be among the wonderful people of this state: PM Modi in Itanagar
For farmers, we are ensuring they get better access to markets, says PM Modi
#AyushmanBharat scheme will take the lead in providing quality and affordable healthcare: PM in Itanagar
PM Modi says that development will originate in Arunachal Pradesh in the coming days & this development will illuminate India

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించారు. ఈటాన‌గ‌ర్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో, దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్షన్ సెంట‌ర్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంట‌ర్ లో ఒక స‌భా భ‌వ‌నం, స‌మావేశ మందిరాలు, ఇంకా ఒక ప్ర‌ద‌ర్శ‌న మందిరం ఉన్నాయి.

స్టేట్ సివిల్ సెక్ర‌టేరియ‌ట్ బిల్డింగ్ ను కూడా ప్ర‌ధాన మంత్రి దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అలాగే, తోమొ రీబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ లో అకాడ‌మిక్ బ్లాక్ కు పునాది రాయిని వేశారు.

ఈ సందర్భంగా ఉత్సాహపూరితులై పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన స‌భికుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు తాను రావ‌డం మ‌రియు ఈ రాష్ట్రానికి చెందిన అపురూప‌మైన ప్ర‌జ‌ల మ‌ధ్య స‌మ‌యాన్ని వెచ్చించ‌డం త‌న‌కు సంతోషాన్ని ఇస్తున్నాయన్నారు.

కీల‌క‌మైన విభాగాలు చాలా వ‌ర‌కు నూత‌న స‌చివాల‌యం కేంద్రంగా ప‌ని చేస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఇది దూర గ్రామాల నుండి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఎంతో సులువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స‌మ‌న్వ‌యాన్ని మ‌రియు సౌక‌ర్యాన్ని పెంపొందించ‌డం జ‌రిగినట్లు ఆయన చెప్పారు.

ఈటాన‌గ‌ర్ లో కన్వెన్షన్ సెంట‌ర్ ప్రారంభం కావ‌డంపై ఆయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవ‌లం ఒక భ‌వ‌న‌ం మాత్రమే కాద‌ని, అంత‌కంటే ఎక్కువ‌ని చెప్తూ, ఇది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసే ఒక చైత‌న్య‌శీల‌ కేంద్రమని ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇక్క‌డ జ‌రిగే స‌మావేశాలు మ‌రియు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ప్ర‌భుత్వ అధికారుల‌ను మ‌రియు ప్రైవేటు కంపెనీల‌ను ఆక‌ర్షించగలవని పేర్కొన్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు వెళ్ళి అక్క‌డి కన్వెన్షన్ సెంట‌ర్ లో ముఖ్య‌మైన స‌మావేశాల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా తానే సూచిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ఒక ఈశాన్య ప్రాంత మండ‌లి స‌మావేశంలో పాల్గొన‌డానికి తాను శిలాంగ్ ను సంద‌ర్శించాన‌ని, అలాగే వ్య‌వ‌సాయానికి సంబంధించిన మ‌రొక ముఖ్య‌మైన స‌మావేశం సిక్కిం లో జ‌రిగింద‌ని ఆయ‌న గుర్తు చేసుకొన్నారు.

కేంద్ర మంత్రులు, కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు క్ర‌మం త‌ప్ప‌క ఈశాన్య ప్రాంతాన్ని సంద‌ర్శిస్తున్నారని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఆరోగ్య రంగం గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రంగంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకోవ‌డంపైన, మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌పైన, ఇంకా మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి పైన శ్ర‌ద్ధ తీసుకోవవసిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. దేశం లోని అన్ని ప్రాంతాల‌లో వైద్య క‌ళాశాల‌ల‌ను నిర్మించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఎవ‌రైనా ఫ‌లానా ప్రాంతంలో అధ్య‌య‌నం చేశారంటే అక్క‌డి స్థానిక ఆరోగ్య సంబంధిత స‌వాళ్ళను గురించి చ‌క్క‌ని అవ‌గాన‌ను వారు ఏర్ప‌ర‌చుకో గ‌లుగుతారు కాబట్టి ఇలా చేస్తున్నాం అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఆరోగ్య సంర‌క్ష‌ణ అనేది చ‌క్క‌ని నాణ్య‌త‌తోను, త‌క్కువ ఖ‌ర్చుతోను కూడుకొని ఉండాల‌ని ఆయ‌న అన్నారు. పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం చేకూరాలనే స్టెంట్ ల ధ‌ర‌ల‌ను త‌గ్గించామ‌ని ఆయన చెప్పారు. నాణ్య‌మైన మరియు త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన ఆరోగ్య సంర‌క్ష‌ణను సమ‌కూర్చ‌డంలో ‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కం మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో చ‌క్క‌ని ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్నందుకు గాను రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ పేమా ఖండూ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. 2027లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఏ విధంగా ఉండాల‌నే అంశం పై ఒక ఉన్న‌త‌మైన నాణ్య‌త‌తో కూడిన మార్గ‌ సూచీని ముఖ్య‌మంత్రి రూపొందించార‌ని ఆయ‌న చెప్పారు. ఈ ప్ర‌ణాళిక‌కు కావ‌ల‌సిన ఇన్‌పుట్స్ ను ఒక్క అధికారుల వద్ద నుండి మాత్రమే కాకుండా అన్ని రకాలైన జీవ‌న మార్గాల‌ను అనుస‌రిస్తున్నటువంటి ప్ర‌జ‌ల వ‌ద్ద నుండి కూడా సేక‌రించ‌డం జ‌రిగింద‌ని ప్రధాన మంత్రి వెల్లడించారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."