ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు (డిసెంబరు 29,2018)వారణాశిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన వారణాశిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా సంస్థ క్యాంపస్‌ను జాతికి అంకితం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ప్రయోగశాలలను ప్రధానమంత్రి పరిశీలించారు.
వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద ప్రధానమంత్రి ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఒడిఒపి) ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
ప్రధానమంత్రి తన వారణాశి పర్యటన సందర్భంగా సమగ్ర పెన్షన్ మేనేజ్‌మెంట్ పథకాన్ని ఆవిష్కరించారు. అలాగే వారణాశిలో వివిధ పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలు , ఆవిష్కరణలకు గుర్తుగా నామ ఫలకాలను ప్రధాని ఆవిష్కరించారు.
ఈ రోజు ప్రారంభించిన వివిధ పథకాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఈ పథకాలన్నింటి ఉమ్మడి ఉద్దేశం సులభతర జీవనం, సులభతర వాణిజ్యమని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక జిల్లా, ఒక ఉత్పత్తి పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా పథకానికి కొనసాగింపుగా ప్రధాని అభివర్ణించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు సంప్రదాయంగా వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో భడోహిలో కార్పెట్ పరిశ్రమను , మేరట్‌లో క్రీడా ఉత్పత్తుల పరిశ్రమను, వారణాశిలో సిల్క్ పరిశ్రమ తదితరాలను ఆయన ప్రస్తావించారు. చేతివృత్తులు, కళా రూపాలకు వారణాశి , పూర్వాంచల్‌లు కేంద్రాలని ఆయన అభివర్ణించారు. వారణాశి, దాని పరిసర ప్రాంతాలలోని పది ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు లభించిందని ప్రధాని చెప్పారు.
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి పథకం కింద మంచి యంత్రాలు, తగినశిక్షణ, మార్కెటింగ్ మద్దతుతు కల్పించడంవల్ల ఈ కళారూపాలు లాభదాయక వ్యాపారం అవుతాయని ఆయన అన్నారు. ఈ ఈవెంట్ సందర్భంగా 2000 కోట్ల రూపాయల మేరకు రుణాలు పంపిణీ చేయనున్నట్టు తన దృష్టికి వచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉత్పత్తులు తయారు చేసే వారికి సమగ్ర పరిష్కారాలను చూపడంపై ఈ పథకం దృష్టిపెడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ ప్రస్తుతం తన అంతిమ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
సామాన్య ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు, సులభతర వాణిజ్యానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
సిస్టమ్ ఫర్ అధారిటీ అండ్‌మేనేజ్‌మెంట్ ఆఫ్ పెన్షన్- సంపన్న్‌ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఇది టెలికం విభాగానికి చెందిన పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా సకాలంలో వారికి పెన్షన్‌లు అందేట్టు చేస్తుంది.
ప్రజల సులభతర జీవనాన్ని మెరుగు పరిచేందుకు ,పౌర ఆధారిత సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును వాడుతున్నట్టు ప్రధాని చెప్పారు.
ప్రజల సులభతర జీవనాన్ని మెరుగు పరిచేందుకు ,పౌర ఆధారిత సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును వాడుతున్నట్టు ప్రధాని చెప్పారు.
3 లక్షలకు పైగాగల కామన్ సర్వీస్ సెంటర్‌ల నెట్‌వర్క్ గ్రామీణ ప్రాంత ప్రజలకు వివిధ సేవలను డిజిటల్‌రూపంలో అందించడంలో సహాయపడుతున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో ఇంటర్నెట్ కనక్షన్‌లు భారీ స్థాయిలో పెరగడం గురించి ప్రధాని మాట్లాడారు.
దేశంలో లక్షకుపైగా పంచాయతీలు బ్రాడ్ బ్యాండ్‌ద్వారా అనుసంధానత కలిగి ఉన్నట్టు ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా, ప్రజలకు వివిధ సేవలు అందించడమే కాకుండా ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను తీసుకువచ్చిందని, అవినీతిని రూపుమాపిందని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ – మార్కెట్‌ప్లేస్, జి.ఇ.ఎం వంటివి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధానమంత్రి చెప్పారు.
ఎం.ఎస్.ఎం.ఇలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఎం.ఎస్.ఎం.ఇలకు రుణం సులభంగా అందేట్టు చూడడంతోపాటు సులభతర వాణిజ్యానికీ వీలు కల్పిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.
ఎల్.ఎన్.జి ద్వారా భారతదేశ తూర్పు ప్రాంతంలో ఆధునిక వసతులు కల్పించి పరిశ్రమలను ప్రోత్సహించేందకు కృషిజరుగుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.దీనివల్ల జరిగిన ప్రయోజనమేమంటే, వారణాశిలో వేలాది గృహాలకు వంటగ్యాస్ అందుబాటులోకి వచ్చినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
వారణాశిలో అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం క్యాంపస్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి , సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు తాము చేస్తున్న కృషికి ఫలితమే ఈ కేంద్రమని ప్రధాని అన్నారు.
ఇప్పుడు కాశీలో మార్పు ప్రస్ఫుటంగా కంటికి కనిపిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఈరోజు ప్రారంభించిన పలు అభివృద్ధి పథకాలు ఈ దిశగా మరింతగా ఉపయోగపడనున్నాయని ప్రధాని మంత్రి అన్నారు. గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు ప్రజల మద్దతు లభిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
ఈ నెలాఖరులో వారణాశిలో జరగనున్న ప్రవాస భారతీయ దివస్ విజయవంతం కాగలదన్న ఆకాంక్షను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
हर ज़िले में कुछ अलग है, जिसने यहां लोगों को रोज़गार से जोड़ा है।
— PMO India (@PMOIndia) December 29, 2018
इसको विस्तार देने के लिए एक जनपद, एक उत्पाद लाभकारी सिद्ध होने वाली है।
पूर्वांचल तो हस्तशिल्प का हब है।
कलाकारी चाहे कपड़े और कालीन में हो या फिर मिट्टी या धातू के बर्तनों में, कण-कण में कला बसी हुई है: PM
आज जन्म प्रमाण पत्र से लेकर जीवन प्रमाण पत्र तक सरकार की सैकड़ों सेवाओं का बड़ी तेज़ गति से विस्तार हो रहा है।
— PMO India (@PMOIndia) December 29, 2018
पेंशन जैसी व्यवस्थाओं को भी आसान किया जा रहा है।
घर पर जाकर ही दिव्यांगों, वृद्ध जनों को डिजिटल जीवन प्रमाण पत्र जारी करने का काम चल रहा है: PM
आपने अखबारों में पढ़ा होगा कि देश में 50 करोड़ से अधिक इंटरनेट कनेक्शन काम कर रहे हैं,
— PMO India (@PMOIndia) December 29, 2018
शहरों में तो ये बढ़ोतरी हुई ही है, गांवों में भी तेज़ी से इंटरनेट का दायरा बढ़ा है,
डिजिटल इंडिया से सुविधा तो बढ़ ही रही है, साथ ही ये भ्रष्टाचार को कम करने पारदर्शिता का साधन बन रहा है: PM
पूर्वी भारत में आधुनिक सुविधाएं के लिए बेहतर माहौल बनाने का काम चल रहा है
— PMO India (@PMOIndia) December 29, 2018
प्रधानमंत्री ऊर्जा गंगा योजना के तहत गैस पाइपलाइन बिछाई जा रही है
इससे घरों की रसोई से लेकर खाद कारखानों तक के लिए गैस मिलनी शुरु हो चुकी है। वाराणसी में रसोई गैस की योजना से हज़ारों घर जुड़ चुके हैं: PM
काशी में परिवर्तन अब दिखने लगा है, दिव्य काशी का स्वरूप अब और भव्य होता जा रहा है।
— PMO India (@PMOIndia) December 29, 2018
आज भी बनारस के विकास से जुड़ी अनेक परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है।
ये सारे कार्य काशी की सुंदरता को और निखारने वाले हैं: PM
गंगा की पवित्रता और अविरलता के प्रति हमारी प्रतिबद्धता है।
— PMO India (@PMOIndia) December 29, 2018
मुझे खुशी है कि हमारे प्रयासों के परिणाम भी दिखने लगे हैं।
आप सभी ने मीडिया में आई उन रिपोर्टों को देखा होगा कि कैसे मछलियां, मगरमच्छ समेत अनेक जीव-जंतु जीवनदायनी मां गंगा में फिर से लौटने लगे हैं: PM
हाल में देश के अनेक वैज्ञानिकों की टीम ने गंगाजल के परीक्षण के बाद एक रिपोर्ट भी दी है। इस रिपोर्ट के मुताबिक मां गंगा में प्रदूषण के स्तर में कमी आई है।
— PMO India (@PMOIndia) December 29, 2018
नमामि गंगे का अभियान जैसे-जैसे आगे बढ़ रहा है, वैसे-वैसे निर्मल और अविरल गंगा का लक्ष्य नज़दीक दिख रहा है: PM
जब पूरी पारदर्शिता के साथ, प्रमाणिकता के साथ, जनभागीदारी से सरकार काम करती है, तब सार्थक परिणाम मिलते हैं।
— PMO India (@PMOIndia) December 29, 2018
वरना आप तो साक्षी रहे हैं कि कभी गंगा एक्शन प्लान से लेकर गंगा बेसिन अथॉरिटी तक ना जाने कैसी-कैसी योजनाएं बनाई गईं।
मां गंगा के नाम पर हज़ारों करोड़ रुपए बहा दिए गए: PM
मां गंगा की निर्मलता के लिए धन की शक्ति ही काफी नहीं है, साफ नीयत भी चाहिए।
— PMO India (@PMOIndia) December 29, 2018
हम पूरी ईमानदारी के साथ, साफ नीयत के साथ गंगा जी को स्वच्छ करने के अभियान में जुटे हुए हैं: PM