ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశానికి చెందిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్ వి- ఎఫ్05 ను పదో సారి విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ఇస్రో) శాస్త్రవేత్త లను అభినందించారు. ఈ వెహికల్ ఆధునిక వాతావరణ ఉపగ్రహం ‘ఐఎన్ఎస్ఎటి-3డిఆర్’ ను మోసుకొనివెళ్లింది.
“మన అంతరిక్ష కార్యక్రమం మార్గదర్శకమైన విజయాలతో మనం గర్వించేటట్లు చేస్తోంది. ఐఎన్ఎస్ఎటి-3డిఆర్ సఫల ప్రయోగం ఎంతో ఆనందించవలసిన క్షణం.
ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్తలు మరొక్క మారు మొదటి రకం నైపుణ్యాన్ని, సాటిలేని సమర్పణ భావాన్ని, అసాధారణమైన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించినందుకు వారికి ఇవే నా అభినందనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Our space programme keeps making us proud with the exemplary achievements. Successful launch of INSAT-3DR is a moment of immense joy.
— Narendra Modi (@narendramodi) September 8, 2016
Congratulations to @isro scientists for time and again demonstrating top-notch skill, unparalleled dedication & remarkable determination.
— Narendra Modi (@narendramodi) September 8, 2016