Under Mission Indradhanush, we aim to achieve total vaccination. Till now over 3 crore 40 lakh children and over 90 lakh mothers have benefitted: PM
Swachhata is an important aspect of any child's health. Through the Swachh Bharat Abhiyan, we are ensuring cleaner and healthier environment fo rour children: PM
Mission Indradhanush has been hailed globally by experts. It has been listed among the top 12 best medical practices: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో వృందావన్ ను సంద‌ర్శించారు. ఆయ‌న వృందావన్ చంద్రోద‌య మందిర్ లో అక్ష‌య పాత్ర ఫౌండేశ‌న్ ఆధ్వ‌ర్యం లో 3 వంద‌ల కోట్ల‌వ భోజ‌నం వ‌డ్డ‌న‌ కు గుర్తుగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భం గా పాఠ‌శాల విద్యార్థుల కు భోజ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి వ‌డ్డించారు. ఐఎస్‌కెసిఒఎన్ (‘ఇస్కాన్‌’) ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద విగ్ర‌హాని కి ప్ర‌ధాన మంత్రి పుష్పాంజ‌లి సమర్పించారు.

ఈ కార్య‌క్ర‌మాని కి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాం నాయ‌క్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్‌, అక్ష‌య పాత్ర ఫౌండేశన్ ఛైర్మ‌న్ మ‌ధు పండిత్ దాస, ఇంకా ఇత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

 

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, అక్ష‌య పాత్ర ఫౌండేశన్ కృషి ని ప్ర‌శంసించారు. 15 వంద‌ల మంది చిన్నారుల‌ కు సేవ చేయ‌డం తో ఆరంభ‌మైన ఉద్య‌మం ఈ రోజు న దేశ‌వ్యాప్త పాఠ‌శాల‌ల్లో 17 ల‌క్ష‌ల మంది చిన్నారుల‌ కు మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని అందిస్తోంద‌న్నారు. అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గారి హయాం లో మొద‌టి భోజ‌నం అందించబడింద‌ని తెలుసుకొని తాను సంతోషించాన‌న్నారు. 3 వంద‌ల కోట్లవ భోజ‌నాన్ని వ‌డ్డించే అవ‌కాశాన్ని తాను ద‌క్కించుకొన్నాన‌న్నారు. మంచి పౌష్టికాహారం మ‌రియు ఆరోగ్యవంత‌మైన‌ బాల్యం ‘న్యూ ఇండియా’ కు పునాదిరాళ్ళు అని ఆయ‌న చెప్పారు.

ఆరోగ్యాని కి సంబంధించిన 3 ద‌శ ల‌కు.. పోష‌క విలువ‌లు, టీకా మందు మ‌రియు స్వ‌చ్ఛత‌.. కు త‌న ప్ర‌భుత్వం పెద్ద పీట వేసింద‌ని, రాష్ట్రీయ పోష‌ణ్ అభియాన్, మిశన్ ఇంద్రధనుష్, ఇంకా స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ ప్ర‌ధాన మైన కార్య‌క్ర‌మాల‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. రాష్ట్రీయ పోష‌ణ్ అభియాన్ ను గ‌త సంవ‌త్స‌రం లో ప్రారంభించ‌డ‌మైంద‌ని, ప్ర‌తి త‌ల్లి కి, ప్రతి బిడ్డ‌ కు స‌రైన పోష‌క విలువ‌ లను అందించ‌డం ఈ కార్య‌క్ర‌మం యొక్క వాగ్ధాన‌మ‌ని ఆయ‌న వివ‌రించారు. ‘‘ప్ర‌తి ఒక్క త‌ల్లి కి, ప్ర‌తి ఒక్క చిన్నారి కి పోష‌కాహారాన్ని అందించ‌డం లో మ‌నం స‌ఫ‌ల‌మైన ప‌క్షం లో ఎన్నో ప్రాణాలు కాపాడ‌బ‌డుతాయి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

 

మిశ‌న్ ఇంద్ర‌ధ‌నుష్‌ కార్య‌క్ర‌మాన్ని గురించి ఆయ‌న చెప్తూ మ‌రో అయిదు టీకా మందుల‌ ను జాతీయ కార్య‌క్ర‌మాని కి జోడించ‌డం జ‌రిగిందని తెలిపారు. ఇంత‌వ‌ర‌కు 3 కోట్ల 40 ల‌క్ష‌ల మంది చిన్నారులు, 90 ల‌క్ష‌ల మంది గ‌ర్భ‌వ‌తుల‌ కు టీకా మందు ను ఇప్పించ‌డ‌మైంద‌ని వివ‌రించారు. ప్ర‌పంచ స్థాయి లో అగ్ర‌గామి గా ఉన్న ఒక వైద్య ప‌త్రిక ఎంపిక చేసిన 12 ఉత్త‌మ కార్య‌క్ర‌మాల‌ లో ఒక కార్య‌క్ర‌మం గా మిశ‌న్ ఇంద్రధ‌నుష్ ఎంపిక అయిందంటూ ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంస‌లు కురిపించారు.

స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ గురించి, పరిశుభ్రత ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించి టాయిలెట్ ల ఉప‌యోగం 3 ల‌క్ష‌ల మంది జీవితాల‌ను కాపాడ‌టం లో స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని ఒక అంత‌ర్జాతీయ వార్తా క‌థ‌నం పేర్కొంద‌న్నారు. ఈ దిశ లో చేప‌ట్టిన‌టువంటి ఒక కార్యక్ర‌మ‌మే స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ అని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌ధాన మంత్రి మాతృ వంద‌న యోజ‌న‌, ఉజ్జ్వల యోజన, రాష్ట్రీయ గోకుల్ మిశ‌న్ త‌దిత‌ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు. ఉజ్జ్వ‌ల యోజ‌న లో భాగం గా ప్ర‌భుత్వం ఒక్క ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోనే ఒక కోటి ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్ లను స‌మ‌కూర్చింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

గోవుల సంర‌క్ష‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ మ‌రియు అభివృద్ధి కోసం రాష్ట్రీయ కామ‌ధేను ఆయోగ్ ను నెల‌కొల్పుతున్నామ‌న్నారు. ప‌శు సంవ‌ర్ధ‌కం లో త‌ల‌మున‌కలు అయిన వారికి స‌హాయ‌ప‌డ‌టం కోసం ప్ర‌భుత్వం చేస్తున్న కృషి ని ఆయ‌న వివ‌రిస్తూ, అటువంటి వారికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 3 ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌ర‌ప‌తి ని అందిస్తున్న‌ట్లు తెలిపారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని రైతులు చాలా మంది 5 ఎక‌రాల క‌న్నా త‌క్కువ సైజు క‌మ‌తాల‌ ను క‌లిగి ఉన్నందున రైతు సంక్షేమానికి ఉద్దేశించిన పిఎం-కిసాన్ యోజ‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని రైతుల కు అత్య‌ధిక లాభాల‌ ను అంద‌జేయ‌గ‌ల‌ద‌ని ఆయ‌న చెప్పారు.

ఫౌండేశన్ యొక్క ఈ విధమైనటువంటి ప్ర‌య‌త్నాలు ‘నేను’ నుండి ‘మ‌నం’ దిశ గా మార్పు చెంద‌వ‌ల‌సిన ప్రాముఖ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, మనం మన స్థాయి నుండి ఎదిగి సమాజాన్ని గురించి ఆలోచించాలంటూ తన ప్ర‌సంగాన్ని ముగించారు.

 

మ‌ధ్యాహ్న భోజ‌న కార్య‌క్ర‌మం లో భాగంగా ల‌క్ష‌లాది బాల‌ల కు మంచి నాణ్య‌త క‌లిగిన ఆరోగ్య‌దాయ‌క‌మైన మ‌రియు పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాన్ని అందించ‌డం కోసం మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇంకా రాష్ట్ర ప్ర‌భుత్వాల తో అక్ష‌య పాత్ర ఫౌండేష‌న్ కలసి ప‌ని చేస్తోంది. ఈ ఫౌండేష‌న్ 12 రాష్ట్రాల లో 14,702 పాఠ‌శాల‌ల ప‌రిధి లో గ‌ల 1.76 మిలియ‌న్ మంది పిల్ల‌ల‌ కు మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని స‌మ‌కూర్చుతోంది. 2016వ సంవ‌త్స‌రం లో అక్ష‌య పాత్ర అప్ప‌టి భార‌త రాష్ట్రప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స‌మ‌క్షం లో 2 వంద‌ల కోట్ల‌వ సంచిత భోజ‌నాల‌ కు గుర్తు గా ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుంటున్న, అణ‌గారిన వ‌ర్గాల‌ కు చెందిన బాల‌ల కోసం ఉద్దేశించిన 3 వంద‌ల కోట్లవ భోజ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల మీదు గా వ‌డ్డించ‌డం స‌మాజం లో పేద‌లు, ఇంకా నిరాద‌ర‌ణ కు గురైన వ‌ర్గాల వారి చెంత‌ కు చేరుకొనే దిశ‌ గా వేసినటువంటి మ‌రొక ముంద‌డుగు గా ఉంది.

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage