QuotePM proposes first meeting of BRICS Water Ministers in India
QuoteInnovation has become the basis of our development: PM
QuotePM addresses Plenary session of XI BRICS Summit

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రెజిల్ లో ఈ రోజు న జ‌రిగిన 11వ బ్రిక్స్ స‌మిట్ తాలూకు స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. బ్రిక్స్ కూట‌మి లో ఇత‌ర దేశాల అధిప‌తులు కూడా ఈ స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు లో ప్ర‌సంగించారు.

|

ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నాని కి ఎంచుకొన్నటువంటి ‘‘ వినూత్న భ‌విష్య‌త్తు కై ఆర్థిక వృద్ధి’’ అనే ఇతివృత్తం ఎంతో స‌ముచిత‌మైంది గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు. నూత‌న ఆవిష్క‌ర‌ణ లు మా అభివృద్ధి కి ఒక ఆధారం గా మారాయ‌ని ఆయ‌న అన్నారు. నూత‌న ఆవిష్క‌ర‌ణ ల కై బ్రిక్స్ ఆధ్వ‌ర్యం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతయినా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

|

మ‌నం ప్రస్తుతం బ్రిక్స్ యొక్క దిశ ను గురించి మ‌రియు రాగ‌ల ప‌ది సంవ‌త్స‌రాల కాలం లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని మ‌రింత ప‌టిష్ట‌ ప‌ర‌చుకోవ‌డాన్ని గురించి ఆలోచించ‌వ‌ల‌సివుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అనేక రంగాల లో స‌ఫ‌ల‌త ను సాధించిన‌ప్ప‌టి కీ, కొన్ని రంగాల లో కృషి ని అధికం చేయ‌డానికి త‌గినంత అవకాశాలు ఉన్నాయి అని ఆయ‌న నొక్కి వ‌క్కాణించారు. బ్రిక్స్ దేశాల జ‌నాభా అంత‌టినీ క‌లుపుకొంటే ప్ర‌పంచ జ‌నాభా లో 40 శాతాని క‌న్నా అధికం గా ఉండగా, ప్ర‌పంచ వ్యాపారం లో బ్రిక్స్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న వ్యాపారం 15 శాతాని కి మాత్రమే పరిమితం అయింద‌ని, ఈ కార‌ణం గా బ్రిక్స్ దేశాల మధ్య పెట్టుబ‌డి పట్ల మ‌రియు వ్యాపారం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహించవ‌ల‌సివుందంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

|

ఇటీవ‌లే భార‌త‌దేశం లో ఆరంభించిన ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ ను ఆయ‌న గుర్తు కు తెస్తూ, ఆరోగ్యం, ఇంకా దేహ దారుఢ్యం రంగం లో బ్రిక్స్ దేశాల మ‌ధ్య ఆదాన ప్ర‌దానాల ను మ‌రియు సంబంధాల ను అధికం చేసుకోవాల‌ని తాను అభిలషిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల లో పారిశుధ్యం మ‌రియు నిలుక‌డ‌త‌నం క‌లిగిన నీటి నిర్వ‌హ‌ణ అనేవి ఎన్న‌ద‌గిన స‌వాళ్ళు గా ఉన్నాయ‌ని కూడా ఆయ‌న చెప్పారు. బ్రిక్స్ దేశాల జ‌ల శాఖ మంత్రుల ఒక‌టో స‌మావేశాన్ని భార‌త‌దేశం లో నిర్వ‌హించాల‌ని ఉంది అంటూ ప్ర‌తిపాదించారు.

|

ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డం కోసం బ్రిక్స్ వ్యూహాలు అనే అంశం పై ఒక‌టో చ‌ర్చా స‌భ ను నిర్వ‌హించ‌డం ప‌ట్ల తాను సంతోషిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్తూ, ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాల తో పాటు అయిదు కార్యాచరణ బృందాల యొక్క కార్యకలాపాలు ఉగ్రవాదాని కి మరియు ఇతర వ్యవస్థీకృత‌ నేరాలకు వ్యతిరేకం గా బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భ‌ద్ర‌త సంబంధి స‌హ‌కారాన్ని ఇనుమడింపచేయగలవన్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో- బ్రిక్స్ సభ్యత్వ దేశాలు వీజా లకు పరస్పరం గుర్తింపు ను ప్రసాదించుకోవడం, సామాజిక భ‌ద్ర‌త ఒప్పందం కలిగివుండటం ద్వారా మ‌నం అయిదు దేశాల ప్ర‌జానీకానికి పరస్పరం రాక పోకల ను జరపడం తో పాటు పని చేసుకోవడాని కి కూడాను మ‌రింత సానుకూలమైనటువంటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌సాదించ‌గ‌లుగుతాము- అని వివరించారు.

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns

Media Coverage

Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మార్చి 2025
March 21, 2025

Appreciation for PM Modi’s Progressive Reforms Driving Inclusive Growth, Inclusive Future