ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రయాగ్‌రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన ప్రయాగ్‌రాజ్ లోని పవిత్ర సంగమ స్థలం లోని జలాల లో స్నానమాచరించి, అనంతరం స్వచ్ఛ్ కుంభ్ కోసం పాటుపడుతున్న వారి లో ఎంపిక చేసిన కొంత మంది పారిశుధ్య శ్రామికుల కు వారి కృషి కి గౌరవ సూచకం గా “చరణ వందనం” కూడా చేసి మరీ వేదిక వద్ద కు చేరుకొన్నారు.
ప్రయాగ్‌రాజ్ లో కుంభ్ కు తరలి వచ్చిన భక్త జన సందోహాని కి మెరుగైన ఏర్పాట్లు చేయడం లో పాలుపంచుకొన్న వారందరినీ ‘‘కర్మ-యోగులు’’ గా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భం గా ఎన్‌డిఆర్ఎఫ్ ను గురించి, పడవలు నడిపే వారి ని గురించి, స్థానిక ప్రజానీకాన్ని గురించి, ఇంకా పారిశుధ్య శ్రామికుల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గడచిన కొన్ని వారాల లో 21 కోట్ల కు పైగా ప్రజలు కుంభ్ ను సందర్శించారని ఆయన చెప్తూ, ఏదీ అసాధ్యం కాదని పారిశుధ్య శ్రామికులు రుజువు చేశారన్నారు. ఈ సంవత్సరం లో కుంభ్ తెచ్చుకున్న ప్రశంసలన్నింటికీ వారే అత్యంత అర్హులు అని కూడా ఆయన పేర్కొన్నారు. కొందరు పారిశుధ్య శ్రామికుల కు తాను చరణ వందనాన్ని ఆచరించిన క్షణాలు తన స్మృతి లో సదా నిలచిపోతాయని ఆయన చెప్పారు.
ఈ రోజు న ప్రకటించినటువంటి ‘స్వచ్ఛ సేవా సమ్మాన్ కోశ్’ పారిశుధ్య శ్రామికుల కు మరియు వారి కుటుంబాల కు అవసర కాలం లో సహాయకారి గా ఉండగలదని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
స్వచ్ఛ్ భారత్ అభియాన్ శీఘ్ర గతిన పురోగమిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీ నాడు మహాత్మ గాంధీ 150 వ జయంతి కన్నా ముందుగానే బహిరంగ మలమూత్రాదుల విసర్జన రహితం గా మారే దిశ గా దేశం పయనిస్తున్నదని ఆయన తెలిపారు.
గంగ నది శుద్ధి సైతం ఈ సంవత్సరం లో చాలా చర్చ జరిగిన అంశం గా మారిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తాను ఈ రోజున తాను దీనిని ప్రత్యక్షం గా గమనించినట్లు ఆయన చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరియు నమామి గంగే యొక్క కృషి ఫలితం అని ఆయన వివరించారు. నది లో కలుస్తున్న మురుగు నీటి ని నిరోధించడం జరుగుతోందని, మురుగు నీటి శుద్ధి ప్లాంటుల ను నిర్మిస్తున్నారని ఆయన వివరించారు. కొద్ది రోజుల క్రితం తాను సియోల్ శాంతి బహుమతి ని స్వీకరించానని, అందులో సుమారు ఒక కోటీ ముప్ఫై లక్షల రూపాయలు భాగం గా ఉన్నాయంటూ ఆ సొమ్ము ను తాను ‘నమామీ గంగే అభియాన్’కు విరాళమిచ్చినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గా తాను స్వీకరించిన కానుకల ను మరియు జ్ఞాపికల ను వేలం వేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని సైతం నమామి గంగే కోసం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.
కుంభ్ లో పాలుపంచుకొన్న పడవలు నడిపే వారి ని (నావిక్ లు) ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రశంసించారు. కుంభ్ కు విచ్చేసే యాత్రికులు స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొట్టమొదటిసారి గా అక్షయ్ వట్ ను దర్శించే అవకాశాన్ని పొందినట్లు ఆయన వెల్లడించారు.
ఆధ్యాత్మికత, విశ్వాసం, ఆధునికత ల మిశ్రణమైన ‘కుంభ్’ అనేది తన దృష్టి కోణమని, దీనిని నెరవేర్చినందుకు గాను సభాస్థలి లో ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం లో ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ విభాగం పోషిస్తున్న భూమిక ను కూడా ఆయన మెచ్చుకొన్నారు.
ఈ సంవత్సరం కుంభ్ కోసం చేసిన ఏర్పాట్ల లో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక భాగం గా ఉందని, ఈ మౌలిక సదుపాయాలు కుంభ మేళా ముగిసిన తరువాత కూడా నగరాని కి సేవల ను అందిస్తూ ఉంటాయని ప్రధాన మంత్రి తెలిపారు.
इस साल 2 अक्टूबर से पहले पूरा देश खुद को खुले में शौच से मुक्त घोषित करने की तरफ आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) February 24, 2019
और मैं समझता हूं, प्रयागराज के आप सभी स्वच्छाग्रही, पूरे देश के लिए बहुत बड़ी प्रेरणा बनकर सामने आए हैं: PM
गंगाजी की ये निर्मलता नमामि-गंगे मिशन की दिशा और सरकार के सार्थक प्रयासों का भी उदाहरण है।
— PMO India (@PMOIndia) February 24, 2019
इस अभियान के तहत प्रयागराज गंगा में गिरने वाले 32 नाले बंद कराए गए हैं।
सीवर-ट्रीटमेंट प्लांट के माध्यम से गंगा नदी में प्रदूषित जल को साफ करने के बाद ही प्रवाहित किया गया: PM
नमामि-गंगे के लिए अनेक स्वच्छाग्रही तो योगदान दे ही रहे हैं, आर्थिक रूप से भी मदद कर रहे हैं।
— PMO India (@PMOIndia) February 24, 2019
मैंने भी इसमें छोटा सा योगदान किया है।
सियोल पीस प्राइज़ के तौर पर मुझे जो 1 करोड़ 30 लाख रुपए की राशि मिली थी, उसको मैंने नमामि-गंगे मिशन के लिए समर्पित कर दिया है: PM
बीते साढ़े चार वर्षों में प्रधानमंत्री के नाते मुझे जो उपहार मिले हैं,
— PMO India (@PMOIndia) February 24, 2019
उनकी नीलामी करके भी जो राशि मिली है,
वो भी मां गंगा की सेवा में लगाई जा रही है: PM
पिछली बार मैं जब यहां आया था तो मैंने कहा था कि इस बार का कुंभ
— PMO India (@PMOIndia) February 24, 2019
अध्यात्म,
आस्था और
आधुनिकता की त्रिवेणी बनेगा।
मुझे खुशी है कि आप सभी ने अपनी तपस्या से इस विचार को साकार किया है।
तपस्या के क्षेत्र को तकनीक से जोड़ कर जो अद्भुत संगम बनाया गया उसने भी सभी का ध्यान खींचा है: PM