India has Walked the Talk; country has been identified as one of the top reformers: PM Modi
With GST, we are moving towards a modern tax regime, which is transparent, stable and predictable: PM Modi
We are particularly keen to develop India into a knowledge based, skill supported and technology driven society: PM Modi
Our mantra is reform, perform and transform. We want to do better and better: PM Modi

ప్ర‌పంచ‌ బ్యాంకు సిఇఒ క్రిస్టాలినా జార్జివా, మంత్రివ‌ర్గంలో నా స‌హ‌చ‌రులు, సీనియ‌ర్ అధికారులు, వ్యాపార రంగ ప్రముఖులు, మహిళలు మరియు సజ్జనులారా,

आज गुरु परब का पवित्र अवसर है | गुरु नानक देव जी का पुण्य स्मरण देश की एकता, सत्यनिष्ठता और सत्य से भरे जीवन के लिए प्रेरणा देता है| दो वर्ष के बाद गुरू नानक देव जी के 550वां प्रकाश पर्व मनाने का पूरी मानव जाति को अवसर मिलने वाला है| ऐसे जगद्गुरु को प्रणाम करते हुये मैं आप सब को भी शुभकामनाएं देता हूँ |

ఈ రోజు మీ అంద‌రి మ‌ధ్య నిల‌వ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్క‌డ నాకు ఒక పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. సులభంగా వ్యాపారం చేసుకొనేందుకు అనుకూలమైన వాతావ‌ర‌ణం క‌ల్పించే దిశ‌గా మేం చేసిన అద్భుత‌ కృషిని ప్ర‌పంచ బ్యాంకు గుర్తించింది. మేం ఇప్పుడు డూయింగ్ బిజినెస్ లో ప్ర‌పంచం లోని అగ్ర‌గామి వంద దేశాల సరసన నిలచాం. మూడు సంవ‌త్స‌రాల స్వల్ప కాలంలో మేము మా ర్యాంకింగ్ ను 42 స్థానాల మేర మెరుగుపరచుకొన్నాం.

ఈ ఆనంద స‌మ‌యంలో మాతో ఉన్నందుకు క్రిస్టాలినా జార్జివాకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను. స‌మాజానికి, ఆర్థిక రంగానికి లాభ‌దాయ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టే దేశాల‌ను ప్రోత్స‌హించే విష‌యంలో ప్ర‌పంచ‌ బ్యాంకు వచనబద్ధతకు ఇది ద‌ర్ప‌ణం ప‌డుతోంది. ఈ రోజు ఆమె మాతో ఉండ‌డం రానున్న నెల‌లు, సంవ‌త్స‌రాల్లో మ‌రింత మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రచేందుకు కావ‌ల‌సిన స్ఫూర్తిని మా బృందంలో నింపుతుంది.

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను మెరుగుప‌రచే దిశ‌గా మేం చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నామ‌ని దేశ‌, విదేశీ పెట్టుబ‌డిదారుల‌తో నేను గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా చెబుతూ వ‌స్తున్నాను.

మరి మిత్రులారా, భార‌తదేశం మాట‌ల‌ే కాకుండా చేతల ద్వారా తానేమిటో నిరూపించుకొంది.

ఈ ఏడాది ర్యాంకింగులలో భారతదేశం అతి పెద్ద అడుగును వేసింది. సంస్క‌ర‌ణల బాట‌లో ప‌య‌నిస్తున్న అగ్ర‌గామి దేశాలలో ఒక‌టిగా భార‌తదేశానికి గుర్తింపు దక్కింది. ఇందు కోసం శ్ర‌మ ప‌డిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మీరు దేశం గ‌ర్వ‌ప‌డేటట్టు చేశారు.

ఈ మెరుగుద‌ల ఈ దిగువ అంశాల‌ ప‌రంగా చాలా ముఖ్యమైనటువంటిది:

• ఇది దేశంలోని సుపరిపాల‌న‌కు ఒక సంకేతం;

• ఇది ప్ర‌భుత్వ విధానాలలోని నాణ్య‌త‌కు ఒక ప్రమాణం;

• ఇది ప్రక్రియలలో పార‌ద‌ర్శ‌క‌త్వానికి ఓ గీటురాయి;

• వ్యాపారాన్ని సులభతరంగా మలచడం వల్ల అది జీవ‌నంలో స‌ర‌ళతకు బాట వేస్తుంది;

• అలాగే, అంతిమంగా, అది ప్ర‌జ‌ల జీవ‌న విధానాన్ని, ప‌ని విధానాన్ని, సమాజంలో లావాదేవీల రీతిని ప్రతిఫలిస్తుంది కూడాను.

మిత్రులారా,

ఇదంతా వ్యాపార రంగంతో సంబంధం ఉన్న అంద‌రికీ ప్ర‌యోజ‌నం చేకూర్చే ప్ర‌య‌త్న‌మే. నా వ‌ర‌కు నిబద్ధత, క‌ఠోర శ్ర‌మ ల ద్వారా ఎలాంటి మార్పును తీసుకురావ‌చ్చు అనేందుకు ప్ర‌పంచ బ్యాంకు నివేదిక ఒక నిద‌ర్శ‌నం. నిరంత‌ర ప్ర‌య‌త్నాలు మేం మ‌రింత మెరుగుప‌డేందుకు తోడ్పడుతాయి.

और वैसे भी आप जानते हैं मेरे पास तो और कोई काम है नहीं | इसलिए मुझे इसमें भी आगे काम ही दिखाई दे रहा है | मेरा देश , मेरे देश के सौ करोड़ लोग , उनके जीवन में कुछ बदलाव लाना और इसलिए जो अपेक्षाएं दुनिया हमसे रख रही है उन्हें पूरा करने में हम कोई कमी नहीं रखेंगे यह मैं आपको विश्वास दिलाता हूँ|

భార‌తదేశం ఎక్క‌డ నుండి ఈ అంతస్తుకు చేరుకొందో తెలియ‌చేసేందుకే నేను ఇది చెబుతున్నాను. ఇప్పుడు మ‌రింత మెరుగుద‌లను సాధించ‌డం తేలికైన విషయం. మా ప్ర‌య‌త్నాలు వేగం పుంజుకొన్నాయి. మేనేజ్‌మెంట్ ప‌రిభాష‌లో చెప్పాలంటే, మేం ఒక శ‌క్తివంత‌మైన టేకాఫ్‌ కు అవ‌స‌ర‌మైన స్థాయిని చేరాం.

ఉదాహ‌ర‌ణ‌కు వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్‌ టి) త‌రువాత స్థితిని ఈ నివేదిక ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. మీ అంద‌రికీ తెలిసిందే, భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో జిఎస్‌ టి అతి పెద్ద ప‌న్ను సంస్క‌ర‌ణ‌ అనేది. వ్యాపారానుకూల‌త‌లో ప‌లు అంశాల‌ను ఇది ప్ర‌భావితం చేస్తుంది. జిఎస్‌టితో మేం పార‌ద‌ర్శ‌క‌మైన‌, స్థిర‌మైన‌, అంచ‌నాల‌కు అందే ఆధునికమైన ప‌న్ను వ్య‌వ‌స్థ‌లోకి అడుగుపెట్టాం.

और इसलिए जब जीएसटी की चर्चा हुयी है तो मैं कहना चाहूँगा , यहाँ पर व्यापार जगत के बहुत लोग हैं और इस फोरम के माध्यम से देश भर के व्यापारियों से कहना चाहता हूँ| जिस समय हमने जीएसटी लाने का संकल्प किया तब लोगों को लगता था कि पता नहीं आएगा कि नहीं आएगा, एक जुलाई को लागू होगा कि नहीं होगा| हुआ .. फिर होने के बाद लगा, कि अब मर गए ...यह मोदी है कोई सुधार नहीं करेगा और हमने तब कहा था कि तीन महीना हमें इसे बारीकी से देखने दीजिये क्योंकि हिंदुस्तान इतना बड़ा है और दिल्ली में ही बुद्धि भरी हुयी है ऐसा नहीं है जी| 

देश के सामान्य मानवी के पास भी समझ है| हम उससे समझेंगे, सीखेंगे, कठिनाइयों का अंदाज करेंगे, रास्ते खोजेंगे और तीन महीने के बाद जब जीएसटी कौंसिल की मीटिंग हुयी जितनी चीजें सामने आई उसका समाधान किया| कुछ चीजों के लिए काउन्सिल में कुछ राज्य सहमत नहीं थे तो हमने राज्यों के मंत्रियों और अधिकारियों की समितियां बनाईं और मुझे आज यह कहते हुए खुशी हो रही है कि verbatim रिपोर्ट अभी मेरे पास पहुँचा नहीं है लेकिन मंत्रियों की कमिटी , जीएसटी काउंसिल जो बनाई थी उन्होंने मिल करके ही बनाई थी और उस मीटिंग में जो हुआ है और जिसकी छोटी मोटी जानकारी मेरे पास है पूरा रिपोर्ट तो नहीं है मेरे पास लेकिन मैं कह सकता हूँ कि जितने इशूज सामान्य व्यापारियों ने उठाये थे कारोबारियों की तरफ से जो सुझाव आये थे करीब करीब सारे विषयों को positively स्वीकार किया जा रहा है| और नौ और दस तारीख की जीएसटी काउंसिल की मीटिंग में अगर कोई राज्य कठिनाई पैदा नहीं करेगा तो मुझे विश्वास है कि भारत के व्यापार जगत को और भारत की आर्थिक व्यवस्था को नई ताकत देने में जो भी आवश्यक सुधार होंगे वह किये जायेंगे| उसके बावजूद भी आगे भी ऐसी कोई बातें आयेंगी क्योंकि आखिर एक नई व्यवस्था को स्वीकार करना होता है , सालों की पुरानी व्यवस्था से बाहर निकलना होता है तो सरकार का ही दिमाग काम करे यह जरूरी नहीं है सभी stakeholders का दिमाग काम में आता है तब उत्तम से उत्तम परिणाम आता है और जीएसटी उसके लिए भी एक उत्तम उदाहरण बनने वाला है कि सबकी भावनाओं का आदर करते हुए व्यवस्थाओं को foolproof कैसे बनाया जा सकता है यह जीएसटी की प्रोसेस से नजर आता है| 

वर्ल्ड बैंक की इस रिपोर्ट में मई 2017 तक के ही रिफॉर्म्स काउंट हुए हैं जबकि GST उसके बाद जुलाई 2017 से लागू हुआ है | इसलिए आप अंदाज कर सकते हैं कि जब 2018 में चर्चा होगी तो हमारे जो initiative हैं वह count होने वाले हैं| 

ఇంకా ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ఇప్ప‌టికే ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చాయి. అవి ప్ర‌పంచ‌ బ్యాంకు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చే ముందు కొంత నిల‌దొక్కుకొని స్థిర‌డాల్సివుంది. ఇందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అలాగే ఉభ‌యుల‌కు అంగీకార‌మైన‌విగా మా బృందం, ప్ర‌పంచ‌ బ్యాంకు అవ‌గాహ‌న‌కు రాగ‌ల సంస్క‌ర‌ణ‌లు కూడా మ‌రికొన్ని ఉన్నాయి. మా క‌ట్టుబాటుకు ఇవ‌న్నీ కూడా జోడైతే మ‌రింత మెరుగుద‌లను సాధించ‌గ‌లుగుతాం. వ‌చ్చే ఏడాది, ఆ త‌రువాతి సంవ‌త్సరాలలో ప్ర‌పంచ‌ బ్యాంకు నివేదిక‌లో మ‌రింత గ‌ర్వించ‌గ‌ల స్థాయికి మేం చేర‌గ‌ల‌మ‌న్న నమ్మకం నాకు ఉంది.

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుప‌రచేందుకు అవ‌స‌ర‌మైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ప్ర‌పంచ‌ బ్యాంకును నేను అభినందిస్తున్నాను. “ఉపాధిక‌ల్ప‌న ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు” అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంచుకొన్నందుకు కూడా అభినంద‌న‌లు.

మ‌న జీవితాల‌కు ప్ర‌ధాన చోద‌క‌ శ‌క్తి వ్యాపారాలే అనే విష‌యంలో విభేదించేందుకు అవ‌కాశ‌మే లేదు. వృద్ధికి, ఉపాధిక‌ల్ప‌న‌కు, సంప‌ద సృష్టికి, మ‌న జీవితాలు సౌక‌ర్య‌వంతం చేయ‌గ‌ల వ‌స్తువులు మరియు సేవ‌లను అందించేందుకు వ్యాపార సంస్థ‌లే కీల‌కంగా నిలుస్తాయి.

మాది య‌వ‌ జ‌నాభా అధికంగా ఉన్న దేశం. ఉపాధి క‌ల్ప‌న ఒక అవ‌కాశమే కాకుండా ఒక స‌వాలుగా కూడా ప‌రిగ‌ణించాలి. మా యువ‌త‌ లోని శ‌క్తిని సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు మేం మా దేశాన్ని స్టార్ట్- అప్ దేశంగాను, అంత‌ర్జాతీయ త‌యారీ కేంద్రం గాను తీర్చి దిద్దుతున్నాం. ఈ ల‌క్ష్యం దిశ‌గా మేం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ ల వంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు ప్రారంభించాం.

ఈ కార్యక్రమాల‌కు కొత్త వ్య‌వ‌స్థీకృత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను, ఉమ్మ‌డి ప‌న్ను వ్య‌వ‌స్థ‌ల బ‌లాన్ని జోడించి ఒక NEW INDIA ను ఆవిష్క‌రించేందుకు కృషి చేస్తున్నాం. అవ‌కాశాలను అందుబాటు లోకి తీసుకువచ్చే, అవ‌స‌రంలో ఉన్న వారికి లాభం చేకూర్చే భార‌తదేశం ఇది. భార‌తదేశాన్ని మేధోసంప‌త్తి ఆధారిత‌, నైపుణ్యాల మ‌ద్ద‌తు గ‌ల, సాంకేతిక‌ విజ్ఞానం చోద‌క‌ శ‌క్తిగా గ‌ల వ్య‌వ‌స్థ‌గా అభివృద్ధి చేయాల‌న్నది మా ల‌క్ష్యం. ‘డిజిట‌ల్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా కార్య‌క్ర‌మాల ద్వారా దీనికి ఒక శుభారంభాన్ని ఇచ్చాం.

మిత్రులారా,

భార‌తదేశం మ‌రింత ఉత్తమంగా శర వేగంగా మారుతోంది. దీనిని సూచించే మ‌రికొన్ని అంత‌ర్జాతీయ గుర్తింపుల‌ను మీ దృష్టికి తీసుకు రాదలుస్తున్నాను:

– వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ ప్ర‌పంచ స్పర్ధాత్మక సూచి లో గ‌త రెండు సంవత్సరాలలో మేం 32 అంతస్తులు ఎగువకు చేరుకొన్నాం.

– డబ్ల్యుఐపిఒ కు చెందిన ప్ర‌పంచ న‌వ‌క‌ల్ప‌న‌ సూచి లో గ‌త రెండు సంవత్సరాలలో 21 స్థానాల పురోగ‌తిని సాధించాం.

– ప్ర‌పంచ‌ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ సూచి లో గ‌త రెండేళ్లో 19 స్థానాలు ఎగబాకాం.

– యుఎన్ సిటిఎడి పట్టికీకరించిన అగ్రగామి ఎఫ్ డిఐ గమ్యస్థానాల సరసన మేం స్థానం సంపాదించుకొన్నాం.

कुछ लोगों को भारत की रैकिंग 142 से 100 होने की बात समझ नहीं आती। उन्हें कोई फर्क नहीं पड़ता। इनमें से कुछ लोग तो पहले वर्ल्ड बैंक में भी रह चुके हैं। वो आज भी भारत की रैंकिंग पर सवाल उठा रहे हैं। यदि इन्सॉल्वेंसी कोड, बैंकरप्सी कोड, कमर्शियल कोर्ट जैसे कानूनी सुधार आपके टाइम में ही हो जाते तो हमारी रैकिंग पहले ही सुधर जाती। यह रैंकिंग आपके सौभाग्य में आती| देश की स्थिति नहीं सुधरती नहीं क्या | किया कुछ नहीं, और जो कर रहा है उस पर सवाल कर रहे हैं|

वैसे ये भी संयोग की बात है कि वर्ल्ड बैंक ने Ease of Doing Business की प्रक्रिया साल 2004 में शुरू की थी। बड़ा महत्वपूर्ण साल है| इसके बाद 2014 तक देश में किसकी सरकार रही ये भी आप सभी को पता है। 

मैं ऐसा प्रधानमंत्री हूँ जिसने वर्ल्ड बैंक का बिल्डिंग भी नहीं देखा है जबकि पहले वर्ल्ड बैंक को चलाने वाले लोग यहाँ बैठा करते थे| 

मैं तो कहता हूं कि आप वर्ल्ड बैंक की इस रैकिंग पर सवाल उठाने के बजाय हमारा सहयोग करिए ताकि हम देश को और ऊंचे पायदान पर ले जा सकें। न्यू इंडिया बनाने के लिए साथ आगे बढाने का संकल्प करें| 

‘సంస్క‌రించు, ప‌ని చేయి, ప‌రివ‌ర్త‌నను సాధించు’ అనేది మా మంత్రం. ఇంకా ఇంకా మెరుగుద‌లను సాధించాల‌ని మేం ఆకాంక్ష‌ిస్తున్నాం. ప్ర‌పంచ బ్యాంకు మొదటి సారిగా జాతీయ‌ స్థాయి క‌న్నా కింది స్థాయిలో సైతం ఈ ప్ర‌య‌త్నానికి చేయూతను అందిస్తోంద‌ని తెలియ‌చేయ‌డానికి సంతోషిస్తున్నాను. భార‌తదేశం వంటి సమాఖ్య వ్య‌వ‌స్థ‌ లో, సంస్క‌ర‌ణ‌లను అమలుతెచ్చే క్రమంలో ప్ర‌తి ఒక్క‌రినీ క‌లసి న‌డిచేటట్టు చేయ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ, గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా దేశంలో కేంద్ర‌, రాష్ర్ట స్థాయిలలో ఎంతో మార్పు క‌నిపించింది. వ్యాపారానుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వాలు కొత్త పంథా ను అనుస‌రిస్తున్నాయి. వ్యాపార సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో ప‌ర‌స్ప‌రం పోటీ ప‌డ‌డంతో పాటు ఒక‌రికి మరొక‌రు స‌హాయం చేసుకొంటున్నాయి. స్పర్ధ మరియు స‌హ‌కారం.. రెండూ స‌హ‌జీవ‌నం సాగిస్తున్న ఉత్తేజభరిత విశ్వం ఇది.

మిత్రులారా,

వృద్ధిని ఉత్తేజితం చేసి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలంటే ఎన్నో వ్యవస్థీకృత‌ మార్పులు, క‌ఠిన నిర్ణ‌యాలు, కొత్త నియంత్ర‌ణ‌లు అవ‌స‌రం. దీనికి తోడు, నిర్భయంగా, నిజాయతీగా ప‌ని చేసే విధంగా అధికార యంత్రాంగం యొక్క ఆలోచ‌నా ధోర‌ణిలోనూ మార్పు రావలసిన అవసరం ఉంది. గ‌త మూడు సంవత్సరాలగా ఈ దిశగా ప‌రిస్థితిని మెరుగుప‌రచేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం ఎంతో చేసింది. వ్యాపార సంస్థ‌లు, కంపెనీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మేం నియంత్ర‌ణ‌ పరమైన, విధాన‌ ప‌ర‌మైన మార్పులు అనేకం తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.

త‌యారీ రంగంతో పాటు అవస్థాపన రంగం కూడా త్వ‌రిత‌ గ‌తిన పురోగ‌తిని సాధించేందుకు వీలుగా మేం శ్రద్ధ వహిస్తున్నాం. ఈ ల‌క్ష్యంతో పెట్టుబ‌డుల వాతావ‌ర‌ణాన్ని మెరుగుప‌రచేందుకు అదే పనిగా శ్ర‌మిస్తున్నాం. గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలో 21 రంగాల‌కు చెందిన 87 విధాన‌ సంబంధ అంశాల‌కు సంబంధించి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి నిబంధ‌న‌ల్లో సాహ‌సోపేత‌మైన సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాం. मैं दो साल तक सुनता रहता था बिग बैंग..बिग बैंग ..रिफॉर्म्स ..अब बंद कर दिया , क्योंकि लोगों की मालूम चल गया कि रेफौर्म्स की स्पीड और लेवल और साइज इतनी है कि आलोचना करने वाले मैच ही नहीं कर पा रहे |

ర‌క్ష‌ణ‌, రైల్వేలు, కన్ స్ట్రక్షన్ డివెలప్ మెంట్, బీమా, పింఛ‌ను, పౌర‌ విమాన‌యానం, ఫార్మస్యుటికల్స్ విభాగాలలో ఈ సంస్క‌ర‌ణ‌లు చోటుచేసుకొన్నాయి. ఇప్పుడు 90 శాతానికి పైబ‌డి ఎఫ్‌డిఐ ల‌కు అనుమ‌తులను ఆటోమేటిక్ రూట్‌ లోకి తీసుకురావడమైంది. यह बहुत बड़ी बात है| ప్రస్తుతం మేం ఎఫ్‌డిఐ ల‌కు అత్యంత బ‌హిరంగమైనటువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లలో ఒక‌టిగా ఉన్నాం.

ఈ చ‌ర్య ఎఫ్‌డిఐల రాక పెరగడానికి తోడ్పడింది. ఏటికేడాది కొత్త రికార్డులను సాధిస్తున్నాం. 2016 మార్చి ఆఖరుతో ముగిసిన సంవత్సరంలో దేశంలో 55.6 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్లకు చేరిన ఎఫ్‌డిఐలు చరిత్రాత్మకంగా గ‌రిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఆ త‌రువాతి సంవ‌త్స‌రంలో, భారతదేశం 60.08 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల ఎఫ్‌డిఐ ప్రవాహాలను నమోదు చేసింది. తద్వారా మ‌రింత ఉన్నత స్థాయిని అందుకొంది. ఫలితంగా, మూడు సంవత్సరాల స్వల్ప కాలంలో దేశం అందుకొన్న మొత్తం ఎఫ్‌డిఐ లు 67 శాతానికి పెరిగాయి.

ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆగ‌స్టు వ‌ర‌కు, మొత్తం 30.38 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల ఎఫ్‌డిఐలను అందుకోవడమైంది. ఈ స్థాయి గ‌త సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30 శాతం అధికం. 2017 సంవత్సరం ఆగ‌స్టులో 9.64 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల ఎఫ్‌డిఐని భారతదేశం అందుకొన్నది. ఎఫ్ డిఐ పరంగా ఈ స్థాయి ఏదైనా నెలలో నమోదైన అత్య‌ధిక స్థాయి.

మిత్రులారా,

గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా వ్యాపార నియంత్ర‌ణ‌ల‌ను మేం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం, ఎంతో జాగ్ర‌త్త‌గా స‌మీక్షిస్తూ వ‌స్తున్నాం. ప్ర‌భుత్వంతో సంప్ర‌దించే విష‌యంలో వ్యాపార సంస్థ‌ల ఇబ్బందుల‌ను అర్ధం చేసుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. నిరంత‌రం వ్యాపార సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై వారి ఇబ్బందులు తెలుసుకొని వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా నియంత్ర‌ణ‌ల్లో మార్పులు చేస్తున్నాం.

ప్ర‌భుత్వ పాల‌న వ్య‌వ‌హారాలలో పరివర్తనను తీసుకువ‌చ్చేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకోవాల‌ని నేను త‌ర‌చు నొక్కి చెప్తూ ఉంటాను. సాంకేతిక విజ్ఞానాన్ని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగంలోకి తెచ్చిన‌ట్లయితే నేరుగా సంప్ర‌దించవలసిన వ్య‌వ‌ధిని త‌గ్గించి నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో నిర్ణ‌యాలు తీసుకొనే అవ‌కాశం క‌లుగుతుంది. చాలా ప్ర‌భుత్వ శాఖ‌లు, రాష్ర్ట ప్ర‌భుత్వాలు పాల‌న వ్య‌వ‌హారాల‌ను మెరుగుప‌రచి స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లందించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఆశ్ర‌యిస్తున్నాయ‌న్న విష‌యం నాకెంతో ఆనందం క‌లిగిస్తోంది.

సాంకేతిక విజ్ఞానంతో పాటు వ్యాపార సంస్థ‌లు, వ్యాపార వ‌ర్గాల‌తో వ్య‌వ‌హ‌రించే విష‌యంలో ఆలోచ‌న ధోర‌ణి కూడా పూర్తిగా మారవలసిన అవ‌స‌రం ఉంది. మ‌న‌స్సు, యంత్రాలు రెండింటి లోనూ సంపూర్ణ‌మైన మార్పు తీసుకురావ‌డం అవ‌స‌రం. మితిమీరిన అదుపు అనే పాత‌కాల‌పు ఆలోచ‌న ధోర‌ణిని మార్చి దాని స్థానంలో క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న అనే సూత్రాన్ని ఆచ‌ర‌ణ‌ లోకి తీసుకు రావాలి. ఇదే మా ల‌క్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించాల‌న్నది మా ప్రభుత్వ దృఢ సంకల్పం.

ప్ర‌భుత్వ విధానాలు మ‌రింత స‌ర‌ళంగా, స‌హాయ‌కారిగా ఉండేందుకు అనుగుణంగా విధానాల‌ను, చ‌ట్టాల‌ను పూర్తిగా మార్చేందుకు విస్తృత‌మైన ప్ర‌య‌త్నం చేప‌ట్టాం. భార‌తదేశ నియంత్ర‌ణ‌ల వ్య‌వ‌స్థ‌ను అంత‌ర్జాతీయ అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నాం. డూయింగ్ బిజినెస్ రిపోర్టు లో భారతదేశం స్థాయిని మెరుగుప‌రుచుకొనేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేయ‌డ‌మే కాదు, ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు అంత‌క‌న్నా మ‌రింత విస్తృత‌మైన‌వి. ఉదాహ‌ర‌ణ‌కు పాల‌న వ్య‌వ‌హారాల‌ను సంక్లిష్టం చేస్తున్న 1200కు పైగా కాలం చెల్లిన చ‌ట్టాల‌ను మేం ర‌ద్దు చేశాం. వాటిని శాస‌నాల పుస్త‌కం నుండి కూడా తొల‌గించాం. ఇదే స‌మ‌యంలో రాష్ట్రాలు కూడా వేలాది కీల‌క సంస్క‌ర‌ణ‌లు చేశాయి. ఈ అద‌న‌పు చ‌ర్య‌లు ప్ర‌పంచ బ్యాంకు అవ‌స‌రాల‌లో భాగం కాదు.

అన్ని కేంద్ర‌ ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంత‌ర్జాతీయ అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌ను గుర్తించి సంబంధిత వ‌ర్గాల‌తో చ‌ర్చించి ఆ అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో త‌మ నియంత్ర‌ణ‌ల‌ను, విధానాల‌ను అనుసంధానం చేయాలి. ఈ సంస్థ‌లలో ప‌ని చేసే వారు ప్ర‌జా సేవలు అందించ‌గ‌ల స‌మ‌ర్థ‌త‌లో గాని, వారి యొక్క సామర్థ్యం విషయంలో గాని ప్ర‌పంచంలో ఏ మరెవరికీ తీసిపోర‌న్న విష‌యంలో నాకెలాంటి అనుమానం లేదు.

మిత్రులారా,

इस रैंकिंग को भले Ease of doing Business कहते हैं लेकिन मैं मानता हूं कि ये Ease of doing Business के साथ ही Ease of Living Life की भी रैंकिंग है। ये रैंकिंग सुधरने का मतलब है कि देश में आम नागरिक, देश के मध्यम वर्ग की जिंदगी और आसान हुई है।

मैं ऐसा इसलिए कह रहा हूं कि इस रैंकिंग के लिए जो पैरामीटर्स चुने जाते हैं, उनमें से अधिकांश आम नागरिक, देश के नौजवानों की जिंदगी से जुड़े हुए हैं।

भारत की रैंकिंग में इतना सुधार इसलिए आया है क्योंकि पिछले तीन वर्षों में सरकार ने देश के आम नागरिक की जिंदगी में होने वाली मुश्किलों को कम करने के लिए Reform का रास्ता अपनाया है। तीन वर्षों में देश में टैक्स भरने की प्रक्रिया में बहुत सुधार आया है। इनकम टैक्स रिटर्न के लिए अब महीनों इंतजार नहीं करना पड़ा। PF रजिस्ट्रेशन और PF का पैसा निकालने के लिए पहले आपको दफ्तरों के चक्कर लगाने पड़ते थे। अब सब कुछ ऑनलाइन हो गया है।

मेरे नौजवान साथी अब सिर्फ एक दिन में अपनी नई कंपनी रजिस्टर करा सकते हैं। कारोबारी मुकदमों की सुनवाई भी आसान हुई है। तीन वर्षों में भारत में कंस्ट्रक्शन परमिट लेना आसान हुआ है। बिजली कनेक्शन लेना आसान हुआ है। रेलवे रिजर्वेशन कराना आसान हुआ है। जो पासपोर्ट पहले महीनों में मिलता था, अब एक हफ्ते के भीतर मिल जाता है। ये Ease of Living Life नहीं है तो क्या है?

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అన్ని వ్యాపార సంస్థలకు ముఖ్యమైందే అయినప్పటికీ, ఇది చిన్న వ్యాపారాలకు, చిన్న స్థాయి తయారీదారు లకు కీలకమైందన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించే తీరాలి. దేశంలో విస్తారమైన స్థాయిలో ఉపాధిని కల్పిస్తున్నది ఈ రంగమే. ఈ సంస్థలకు స్పర్ధాత్మక పోటీ సామ‌ర్థ్యాన్ని కల్పించాలంటే, వ్యాపార నిర్వ‌హ‌ణ వ్య‌యాల‌ను త‌గ్గించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేసే కృషిలో చిన్న వ్యాపార సంస్థ‌లు, చిన్న త‌ర‌హా త‌యారీదారుల స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించాలి.

వ్యాపార నిర్వ‌హ‌ణ విధానాల‌ను స‌ర‌ళం చేసే దిశ‌గా చిత్త‌శుద్ధితో, అంకిత భావంతో భిన్న అంశాల‌పై కృషి చేసిన బృందానికి నేను మ‌రోసారి అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. మ‌నంద‌రం క‌లిసి భార‌తదేశ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయాన్ని లిఖిద్దాం. మన ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు, క‌ల‌లకు రెక్క‌లు తొడిగేలా భార‌తదేశాన్ని ఆవిష్క‌రిద్దాం.

వ్యాపారానుకూల‌త‌ను మెరుగుప‌రచే కృషిలో అందించిన మార్గ‌ద‌ర్శ‌కానికి ప్ర‌పంచ‌బ్యాంకు కు మ‌రో సారి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేయాల‌నుకుంటున్నాను. భార‌తదేశం వంటి పెద్ద దేశంలో వృద్ధికి విఘాతం క‌ల‌గ‌కుండా నిర్ణ‌యాత్మ‌క‌మైన మార్పులు ప్రవేశపెట్టడంలో మ‌న అనుభ‌వాలు ఇత‌ర దేశాల‌కు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ అని నాకు చెప్పారు. ఇత‌రుల నుండి నేర్చుకొనే అవ‌కాశం నిరంత‌రం ఉంటుంది. అవ‌స‌రపడితే, మేం మా అనుభ‌వాల‌ను ఇత‌రుల‌తో ఆనందంగా పంచుకొంటాం.

మీకు ధ‌న్య‌వాదాలు.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones