శ్రీ గురునాన‌క్‌దేవ్‌జీ బోధ‌న‌లు, ప్ర‌వ‌చించిన విలువ‌ల‌ను పాటించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. క‌ర్తార్‌పూర్ కారిడార్‌, స‌మీకృత చెక్‌పోస్ట్ (ఐసిపి) ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు. గురునాన‌క్ దేవ్‌జీ 550 వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ఒక స్మార‌క నాణాన్ని విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ పెద్ద‌సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ ఆయ‌న , ప‌విత్ర‌స్థ‌ల‌మైన దేరాబాబానాన‌క్ వ‌ద్ద క‌ర్తార్‌పూర్ కారిడార్‌ను దేశ‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌డం త‌న‌కు ల‌భించిన గౌర‌వంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు.

అంత‌కు ముందు శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ ప్ర‌ధాన‌మంత్రిని క్వామి సేవా అవార్డుతో స‌త్క‌రించింది. దీనిని గురునాన‌క్ దేవ్‌జీ పాద‌ప‌ద్మాల‌కు అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

గురునాన‌క్ 550 వ జ‌యంతి సంద‌ర్భంగా ఐసిపి , క‌ర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్స‌వం చేయ‌డం గురునాన‌క్ దేవ్‌జీ దీవెనలుగా భావిస్తాన‌ని, వీటి వ‌ల్ల పాకిస్థాన్‌లోని గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌కు చేరుకోవ‌డం సుల‌భ‌త‌ర‌మౌతుంద‌న్నారు.
ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగ ఎస్‌.జి.పి.సి కి , పంజాబ్ ప్ర‌భుత్వానికి, రికార్డు స‌మ‌యంలో ఈ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేసి

స‌రిహ‌ద్దుల‌కు ఇరువైపులా ప్ర‌జ‌ల రాక‌పోక‌ల వీలు క‌ల్పించిన‌ వారికి ప్ర‌ధాన‌మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు , ఇది సాకారం కావ‌డానికి స‌రిహ‌ద్దుల‌కు ఆవ‌ల కృషిచేసిన వారంద‌రికీ ప్ర‌ధాన‌మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

భార‌త‌దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికీ గురునాన‌నక్ దేవ్‌జీ ఒక స్ఫూర్తి అని ప్ర‌ధాన‌మంత్రి కొనియాడారు. గురునాన‌క్‌దేవ్‌జీ కేవ‌లం ఒక గురువు మాత్ర‌మే కాద‌ని, త‌త్వం అని , మ‌న జీవితాల‌కు అండ‌గా నిలిచే ఒక స్థంభం అని అన్నారు. నిజ‌మైన విలువ‌ల‌కు అనుగుణంగా జీవించ‌డంలోని ప్రాధాన్య‌త‌ను గురునాన‌క్‌దేవ్ జీ మ‌న‌కు ప్ర‌బోదించార‌ని, నిజాయితీ, ఆత్మ‌విశ్వాసం పునాదిగా ఒక ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న మ‌న‌కు ప్ర‌సాదించార‌ని ప్ర‌ధాని అన్నారు.

గురునాన‌క్ దేవ్జీ స‌మాన‌త్వం, సోద‌ర‌భావం, స‌మాజంలో ఐక్య‌త గురించి బోధించార‌ని, ర‌క‌ర‌కాల సామాజిక రుగ్మ‌త‌ల తొల‌గింపు

న‌కు వారు పోరాడార‌ని చెప్పారు.

క‌ర్తార్‌పూర్ ఒక ప‌విత్ర ప్ర‌దేశ‌మ‌ని, నాన‌క్‌దేవ్‌జీ ప‌విత్ర‌శ‌క్తితో అది పునీత‌మైంద‌ని ప్ర‌ధాని చెప్పారు. ఈ కారిడార్ వేలాదిమంది భ‌క్తులు, యాత్రికుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని చెప్పారు.

దేశ గొప్ప సంస్కృతి , సంప్ర‌దాయాల‌ను ప‌రిరక్షించేందుకు గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం గ‌ట్టి కృషిచేస్తున్న‌ద‌ని చెప్పారు.

గురునాన‌క్ దేవ్ జి 550 వ జ‌యంతి సంద‌ర్భంగా దేశవ్యాప్తంగాను, మ‌న రాయ‌బార కార్యాల‌యాల ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

గురుగోవింద్ సింగ్ 350 వ‌ జ‌యంతిని దేశ‌వ్యాప్తంంగా జ‌రుపుకుంటున్న‌విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. గురుగోవింద్ సింగ్ జీ గౌర‌వార్థం గుజ‌రాత్ లోని జామ్‌న‌గ‌ర్ లో 750 ప‌డ‌క‌ల ఆధునిక ఆస్ప‌త్రిని నిర్మించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

యువ‌త‌రం కోసం యునెస్కో స‌హాయంతో ప్ర‌పంచంలోని వివిధ భాష‌ల‌లోకి గురువాణిని అనువదించే ప‌ని జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.సుల్తాన్ పూర్ లోధిని ఒక చారిత్రిక పట్ట‌ణంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. గురునాన‌క్‌జీతో సంబంధం ఉన్న అన్ని ప్ర‌ధాన ప్రాంతాల‌నూ అనుసంధానం చేస్తూ ఒక ప్ర‌త్యేక రైలును న‌డ‌ప‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. శ్రీ అక‌ల్ త‌క్త్‌, ద‌మ్ ద‌మా సాహిబ్‌, తేజ్‌పూర్ సాహిబ్‌, కేశ్‌ఘ‌ర్ సాహిబ్‌, పాట్నా సాహిబ్‌, హుజూర్ సాహిబ్ ల‌కు రైలు, విమాన‌యాన స‌దుపాయాన్ని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అమృత‌స‌ర్‌, నాందేడ్ మ‌ధ్య ఒక ప్ర‌త్యేక విమాన స‌ర్వీసు సేవ‌లు ప్రారంభించింద‌ని, అలాగే అమృత‌స‌ర్ నుంచి లండ‌న్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఏక్ ఓంకార్ సందేశాన్ని వినిపించ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా నివ‌శిస్తున్న సిక్కు కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. విదేశాల‌లో ఉండి స్వ‌దేశానికి రావ‌డానికి ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించడం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు వీసా, ఒసిఐ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. వారు ఇండియాలోని త‌మ బంధువుల‌ను సుల‌భంగా క‌లుసుకోవ‌చ్చ‌ని, యాత్రాస్థ‌లాల‌ను సంద‌ర్శించ‌వచ్చ‌ని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న మ‌రో రెండు నిర్ణ‌యాలు కూడా సిక్కుల‌కు స‌హాయం చేసేవిగా ఉన్నాయ‌ని అన్నారు. అందులో ఒక‌టి ఆర్టిక‌ల్ 370 తొల‌గింపు నిర్ణ‌యం. ఇది జ‌మ్ము క‌శ్మీర్‌, లెహ్ లోని సిక్కు క‌మ్యూనిటీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. వారు దేశంలోని ఇత‌ర పౌరుల లాగా స‌మాన హ‌క్కులు క‌లిగి ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.అలాగే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు వ‌ల్ల సిక్కులు దేశ‌పౌరులుగా కావ‌డాన్ని సుల‌భ‌త‌రం చేస్తుంద‌న్నారు.

గురునాన‌క్ దేవ్ జి నుంచి గురు గోవింద్ జి వ‌ర‌కు ప‌లువురు ఆథ్యాత్మిక గురువులు త‌మ జీవితాల‌ను ఐక్య‌త‌, దేశ భ‌ద్ర‌త‌కు త‌మ జీవితాల‌ను అంకితం చేశారని అన్నారు. ఎంద‌రో సిక్కులు త‌మ జీవితాల‌ను దేశ స్వాతంత్ర్యం కోసం అర్పించార‌ని అన్నారు. దీనిని గుర్తించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు చర్య‌లు తీసుకున్న‌ద‌ని చెప్పారు. జ‌లియ‌న్ వాలా బాగ్ స్మార‌కాన్ని ఆధునికం చేయ‌నున్న‌ట్టు చెప్పారు. సిక్కు యువ‌త త‌మ నైపుణ్యాల‌ను పెంపొందించుకునేందుకు , వారు స్వ‌యం ఉపాధి పొందేందుకు ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతున్న‌ట్టు చెప‌పారు. ఈ నేప‌థ్యంలో సుమారు 27 ల‌క్ష‌ల‌మంది సిక్కు విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తున్న‌ట్టు చెప్పారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 డిసెంబర్ 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance