శ్రీ గురునానక్‌దేవ్‌జీ బోధనలు, ప్రవచించిన విలువలను పాటించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కర్తార్‌పూర్ కారిడార్, సమీకృత చెక్‌పోస్ట్ (ఐసిపి) ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నారు. గురునానక్ దేవ్‌జీ 550 వ జయంతి సందర్భంగా ఆయన ఒక స్మారక నాణాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా అక్కడ పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన , పవిత్రస్థలమైన దేరాబాబానానక్ వద్ద కర్తార్‌పూర్ కారిడార్‌ను దేశప్రజలకు అంకితం చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.
అంతకు ముందు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధానమంత్రిని క్వామి సేవా అవార్డుతో సత్కరించింది. దీనిని గురునానక్ దేవ్‌జీ పాదపద్మాలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
గురునానక్ 550 వ జయంతి సందర్భంగా ఐసిపి , కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం చేయడం గురునానక్ దేవ్‌జీ దీవెనలుగా భావిస్తానని, వీటి వల్ల పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు చేరుకోవడం సులభతరమౌతుందన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగ ఎస్.జి.పి.సి కి , పంజాబ్ ప్రభుత్వానికి, రికార్డు సమయంలో ఈ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేసి
సరిహద్దులకు ఇరువైపులా ప్రజల రాకపోకల వీలు కల్పించిన వారికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు , ఇది సాకారం కావడానికి సరిహద్దులకు ఆవల కృషిచేసిన వారందరికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశానికే కాక యావత్ ప్రపంచానికీ గురునాననక్ దేవ్‌జీ ఒక స్ఫూర్తి అని ప్రధానమంత్రి కొనియాడారు. గురునానక్‌దేవ్‌జీ కేవలం ఒక గురువు మాత్రమే కాదని, తత్వం అని , మన జీవితాలకు అండగా నిలిచే ఒక స్థంభం అని అన్నారు. నిజమైన విలువలకు అనుగుణంగా జీవించడంలోని ప్రాధాన్యతను గురునానక్‌దేవ్ జీ మనకు ప్రబోదించారని, నిజాయితీ, ఆత్మవిశ్వాసం పునాదిగా ఒక ఆర్థిక వ్యవస్థను ఆయన మనకు ప్రసాదించారని ప్రధాని అన్నారు.
గురునానక్ దేవ్జీ సమానత్వం, సోదరభావం, సమాజంలో ఐక్యత గురించి బోధించారని, రకరకాల సామాజిక రుగ్మతల తొలగింపు
నకు వారు పోరాడారని చెప్పారు.
కర్తార్‌పూర్ ఒక పవిత్ర ప్రదేశమని, నానక్‌దేవ్‌జీ పవిత్రశక్తితో అది పునీతమైందని ప్రధాని చెప్పారు. ఈ కారిడార్ వేలాదిమంది భక్తులు, యాత్రికులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
దేశ గొప్ప సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించేందుకు గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం గట్టి కృషిచేస్తున్నదని చెప్పారు.
గురునానక్ దేవ్ జి 550 వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగాను, మన రాయబార కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
గురుగోవింద్ సింగ్ 350 వ జయంతిని దేశవ్యాప్తంంగా జరుపుకుంటున్నవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. గురుగోవింద్ సింగ్ జీ గౌరవార్థం గుజరాత్ లోని జామ్‌నగర్ లో 750 పడకల ఆధునిక ఆస్పత్రిని నిర్మించినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
యువతరం కోసం యునెస్కో సహాయంతో ప్రపంచంలోని వివిధ భాషలలోకి గురువాణిని అనువదించే పని జరుగుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.సుల్తాన్ పూర్ లోధిని ఒక చారిత్రిక పట్టణంగా అభివృద్ధి చేయనున్నట్టు ఆయన చెప్పారు. గురునానక్‌జీతో సంబంధం ఉన్న అన్ని ప్రధాన ప్రాంతాలనూ అనుసంధానం చేస్తూ ఒక ప్రత్యేక రైలును నడపనున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. శ్రీ అకల్ తక్త్, దమ్ దమా సాహిబ్, తేజ్‌పూర్ సాహిబ్, కేశ్‌ఘర్ సాహిబ్, పాట్నా సాహిబ్, హుజూర్ సాహిబ్ లకు రైలు, విమానయాన సదుపాయాన్ని బలోపేతం చేయనున్నట్టు ఆయన చెప్పారు. అమృతసర్, నాందేడ్ మధ్య ఒక ప్రత్యేక విమాన సర్వీసు సేవలు ప్రారంభించిందని, అలాగే అమృతసర్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఏక్ ఓంకార్ సందేశాన్ని వినిపించనున్నట్టు ఆయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నివశిస్తున్న సిక్కు కుటుంబాలకు ప్రయోజనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. విదేశాలలో ఉండి స్వదేశానికి రావడానికి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను తొలగించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు వీసా, ఒసిఐ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. వారు ఇండియాలోని తమ బంధువులను సులభంగా కలుసుకోవచ్చని, యాత్రాస్థలాలను సందర్శించవచ్చని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో రెండు నిర్ణయాలు కూడా సిక్కులకు సహాయం చేసేవిగా ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి ఆర్టికల్ 370 తొలగింపు నిర్ణయం. ఇది జమ్ము కశ్మీర్, లెహ్ లోని సిక్కు కమ్యూనిటీకి ఉపయోగపడుతుందన్నారు. వారు దేశంలోని ఇతర పౌరుల లాగా సమాన హక్కులు కలిగి ఉండడానికి ఉపయోగపడుతుందన్నారు.అలాగే పౌరసత్వ సవరణ బిల్లు వల్ల సిక్కులు దేశపౌరులుగా కావడాన్ని సులభతరం చేస్తుందన్నారు.
గురునానక్ దేవ్ జి నుంచి గురు గోవింద్ జి వరకు పలువురు ఆథ్యాత్మిక గురువులు తమ జీవితాలను ఐక్యత, దేశ భద్రతకు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. ఎందరో సిక్కులు తమ జీవితాలను దేశ స్వాతంత్ర్యం కోసం అర్పించారని అన్నారు. దీనిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నదని చెప్పారు. జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని ఆధునికం చేయనున్నట్టు చెప్పారు. సిక్కు యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు , వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు చెపపారు. ఈ నేపథ్యంలో సుమారు 27 లక్షలమంది సిక్కు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నట్టు చెప్పారు.
ये मेरा सौभाग्य है कि मैं आज देश को करतारपुर साहिब कॉरिडोर समर्पित कर रहा हूं।
— PMO India (@PMOIndia) November 9, 2019
जैसी अनुभूति आप सभी को ‘कार सेवा’ के समय होती है, वही मुझे इस वक्त हो रही है।
मैं आप सभी को, पूरे देश को, दुनिया भर में बसे सिख भाई-बहनों को बहुत-बहुत बधाई देता हूं: PM @narendramodi
गुरु नानक देव जी के 550वें प्रकाश-उत्सव से पहले, इंटीग्रेटेड चेकपोस्ट, करतारपुर साहिब कॉरिडोर का खुलना, हम सभी के लिए दोहरी खुशी लेकर आया है।
— PMO India (@PMOIndia) November 9, 2019
इस कॉरिडोर के बनने के बाद, अब गुरुद्वारा दरबार साहिब के दर्शन आसान हो जाएंगे: PM @narendramodi
गुरु नानक देव जी, सिर्फ सिख पंथ की, भारत की ही धरोहर नहीं, बल्कि पूरी मानवता के लिए प्रेरणा पुंज हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
गुरु नानक देव एक गुरु होने के साथ-साथ एक विचार हैं, जीवन का आधार हैं: PM @narendramodi
अपनी यात्राओं का मकसद, गुरु नानक देव जी ने ही बताया था।
— PMO India (@PMOIndia) November 9, 2019
बाबे आखिआ, नाथ जी, सचु चंद्रमा कूडु अंधारा !!
कूडु अमावसि बरतिआ, हउं भालण चढिया संसारा !!
PM @narendramodi
उन्होंने सीख दी है कि सच्चाई और ईमानदारी से किए गए विकास से हमेशा तरक्की और समृद्धि के रास्ते खुलते हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
उन्होंने सीख दी है कि धन तो आता जाता रहेगा पर सच्चे मूल्य हमेशा रहते हैं: PM @narendramodi
कहते हैं शब्द हमेशा ऊर्जा बनकर वातावरण में विद्यमान रहते हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
करतारपुर से मिली गुरुवाणी की ऊर्जा, सिर्फ हमारे सिख भाई-बहनों को ही नहीं बल्कि हर भारतवासी को अपना आशीर्वाद देगी: PM @narendramodi
करतारपुर में ही उन्होंने प्रकृति के गुणों का गायन किया था। उन्होंने कहा था- “पवणु गुरु, पाणी पिता, माता धरति महतु”!!!
— PMO India (@PMOIndia) November 9, 2019
यानि हवा को गुरु मानो, पानी को पिता और धरती को माता के बराबर महत्व दो: PM @narendramodi
बीते एक साल से देश और विदेश में कीर्तन, कथा, प्रभात फेरी, लंगर, जैसे आयोजनों के माध्यम से गुरु नानक देव की सीख का प्रचार किया जा रहा है।
— PMO India (@PMOIndia) November 9, 2019
इससे पहले गुरु गोबिंद सिंह जी के 350वें प्रकाशोत्सव को भी इसी तरह भव्यता के साथ पूरी दुनिया में मनाया गया था: PM @narendramodi
सुल्तानपुर लोधी को हैरिटेज टाउन बनाने का काम चल रहा है।
— PMO India (@PMOIndia) November 9, 2019
हैरिजेट कॉम्प्लैक्स हो, म्यूजियम हो, ऑडिटोरियम हो, ऐसे अनेक काम यहां या तो पूरे हो चुके हैं या फिर जल्द पूरे होने वाले हैं: PM @narendramodi
केंद्र सरकार ने एक और महत्वपूर्ण फैसला लिया है, जिसका लाभ दुनियाभर में बसे अनेक सिख परिवारों को हुआ है।
— PMO India (@PMOIndia) November 9, 2019
कई सालों से, कुछ लोगों को भारत में आने पर जो दिक्कत थी, अब उन दिक्कतों को दूर कर दिया गया है: PM @narendramodi
हमारी गुरु परंपरा, संत परंपरा, ऋषि परंपरा, ने अलग-अलग कालखंड में, अपने-अपने हिसाब से चुनौतियों से निपटने के रास्ते सुझाए हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
उनके रास्ते जितने तब सार्थक थे, उतने ही आज भी अहम हैं।
राष्ट्रीय एकता और राष्ट्रीय चेतना के प्रति हर संत, हर गुरु का आग्रह रहा है: PM @narendramodi
आइए, इस अहम और पवित्र पड़ाव पर हम संकल्प लें कि गुरु नानक जी के वचनों को अपने जीवन का हिस्सा बनाएंगे।
— PMO India (@PMOIndia) November 9, 2019
हम समाज के भीतर सद्भाव पैदा करने के लिए हर कोशिश करेंगे: PM @narendramodi