ఇటీవలే కన్నుమూసిన పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృత్యర్థం న్యూ ఢిల్లీ లో ఈ రోజున నిర్వహించిన ఒక ప్రార్థన సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
మన జీవితం ఎంత కాలం పాటు ఉంటుందనేది మన చేతుల్లో లేదని, అయితే మన జీవనం ఏ విధంగా ఉండాలన్న దానిని మాత్రం మనం నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. అటల్ గారు ఆయన జీవితం ద్వారా, జీవితం ఎలా ఉండాలో, జీవితం యొక్క ప్రయోజనం ఏమిటో చూపించారని శ్రీ మోదీ చెప్పారు. అటల్ గారు తన జీవితం లోని ప్రతి ఒక్క క్షణాన్ని సామాన్య మానవుడి కోసమే వెచ్చించారని ఆయన అన్నారు. యవ్వన కాలం మొదలుకొని ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు కూడా దేశం కోసమే ఆయన జీవించారని ప్రధాన మంత్రి వివరించారు. అటల్ గారు దేశ ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం, సగటు మనిషి ఆకాంక్షల కోసం మనుగడ సాగించారని ఆయన పేర్కొన్నారు.
వాజ్‌పేయీ గారు తన రాజకీయ జీవితం లో చాలావరకు- ఆధిపత్య రాజకీయ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయమంటూ ఏదీ లేనటువంటి కాలంలో- గడిపారని ప్రధాన మంత్రి తెలిపారు. ఒంటరితనాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఆయన తన ఆదర్శాలకు కట్టుబడివున్నారని ఆయన చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్షం లోనే ఉండిపోయినా ఆయన ఆదర్శాలు మరెవ్వరి స్పర్శ కు అందకుండా వుండిపోయాయని ప్రధాన మంత్రి వివరించారు. పార్లమెంటరీ సంప్రదాయాలను వాజ్‌పేయీ గారు గౌరవించారని; మరి అవకాశం లభించడం తోనే తన దార్శనికత ను- ప్రజల మేలు కోసం- ఆచరణ లోకి తీసుకువచ్చారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.
ప్రతి ఒక్క క్షణం లోను మీరు ఆయన లోపలి ‘‘అటల్’’ను అనుభూతించవచ్చునని ప్రధాన మంత్రి చెప్పారు. 1998 మే నెల 11వ తేదీన పరమాణు పరీక్షల తో ప్రపంచాన్ని ఆయన ఆశ్చర్యానికి లోను చేశారని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ఈ పరీక్షల సాఫల్యాన్ని మన శాస్త్రవేత్తల కౌశలానికే ఆయన కట్టబెట్టారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతికూల ప్రతిస్పందన వచ్చినప్పటికీ, ఒత్తిడికి అటల్ గారు లొంగిపోలేదని, భారతదేశం ‘‘అటల్’’ (దృఢమైంది) అని ప్రపంచానికి నిరూపించారని ప్రధాన మంత్రి అన్నారు.
మూడు కొత్త రాష్ట్రాలు- వాజ్‌పేయీ గారి నాయకత్వం లో- ఎటువంటి కటుత్వపు ఛాయలకు తావు లేనటువంటి రీతి లో ఏర్పాటు అయ్యాయని ప్రధాన మంత్రి చెప్పారు. నిర్ణయాలను తీసుకోవడం లో ప్రతి ఒక్కరిని ఎలా కలుపుకొని పోవాలో వాజ్‌పేయీ గారు చూపించారని ఆయన చెప్పారు.
అటల్ గారు మొదట్లో కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మద్ధతును అందించడానికి ఏ ఒక్కరూ సుముఖంగా లేరని, దీనితో ప్రభుత్వం 13 రోజులలో పడిపోయిందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. అయితే, అటల్ గారు ఆశ ను కోల్పోలేదని, ప్రజాసేవ కు కంకణబద్ధుడిగా మిగిలారని చెప్పారు. సంకీర్ణ రాజకీయాల విషయానికి వస్తే, వాటిని ఎలా నడపాలో ఆయన మార్గదర్శకత్వం వహించారని ప్రధాన మంత్రి చెప్పారు.
కశ్మీర్ పై ప్రపంచ వృత్తాంతాన్ని వాజ్‌పేయీ గారు మార్చివేశారని ప్రధాన మంత్రి అన్నారు. ఉగ్రవాదం సమస్య ను ఆయన ప్రముఖంగా ప్రస్తావించి, దానిని ప్రపంచ వ్యాప్తంగా ప్రస్ఫుటం చేశారన్నారు.
అటల్ గారు ఒక ప్రేరణగా నిలచిపోతారని ప్రధాన మంత్రి చెప్పారు. ఒక దశాబ్ద కాలానికి పైగా రాజకీయాలకు, ప్రజా జీవనానికి ఆయన ఆవల ఉండిపోయారని; అయినప్పటికీ ఆయన అస్తమించడంతోనే భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగశాయని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన గొప్పతనాన్ని ఇది సూచిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతీయ యువ మల్లయోధుడు బజరంగ్ పునియా తాను అటల్ గారిని బహుశా ఎన్నడూ కలుసుకోక పోయినప్పటికీ, ఏశియన్ గేమ్స్ లో నిన్న తాను సాధించిన బంగారు పతకాన్ని అటల్ గారికి అంకితమిచ్చారని శ్రీ మోదీ తెలిపారు. ఒక మనిషి అందుకోగలిగేందుకు మరెంతటి గొప్ప శిఖరాలు, సొంతం చేసుకోగలిగేందుకు మరెంతటి భారీ విజయం ఉంటాయి? అంటూ ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
Atal Ji's was a life for the people of India.
— PMO India (@PMOIndia) August 20, 2018
In his youth itself he decided that he wants to serve his fellow Indians.
He entered politics when only one party held sway over the political discourse: PM @narendramodi
Atal Ji spent several years in Opposition. Not once did he compromise on his ideology.
— PMO India (@PMOIndia) August 20, 2018
He distinguished himself as a Parliamentarian and was proud of our Parliamentary traditions: PM @narendramodi
Atal Ji's efforts ensured Indian became a nuclear power. He attributed the tests of 11th May 1998 to the brilliance of our scientists. Two days later, India tested again & showed what a strong political leadership can do. He never buckled under pressure. He was Atal after all: PM
— PMO India (@PMOIndia) August 20, 2018
Atal Ji as PM created three states, which are prospering. The process of creating these states was peaceful and without bitterness: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 20, 2018
When Atal Ji formed the Government for 13 days, no party was willing to support him. The Government fell. He did not lose hope and remained committed to serving the people.
— PMO India (@PMOIndia) August 20, 2018
Atal Ji showed the way when it came to coalition politics: PM @narendramodi
When some were cornering India on the Kashmir issue, it was Vajpayee Ji who changed the narrative.
— PMO India (@PMOIndia) August 20, 2018
Due to Vajpayee ji, terrorism became an important issue at the world stage: PM @narendramodi
Yesterday one of our athletes, @BajrangPunia won the Gold (our 1st in 2018 Asian Games). He dedicated medal to Atal Ji. I do not think Bajrang would have had the opportunity to closely interact with Atal Ji but such is Atal Ji's respect that every Indian is inspired by him: PM https://t.co/vB8T58xGcT
— PMO India (@PMOIndia) August 20, 2018