Today women are leading from the front in every sphere: Prime Minister Modi
Not only are our daughters flying fighter jets but also achieving great feats by circumnavigating the entire world: PM Modi
Our government is fully devoted to empowerment of women: PM Modi

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో గ‌ల దీన్ ద‌యాళ్ హ‌స్త్ క‌ళా సంకుల్ లో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు నిర్వ‌హించిన ‘మ‌హిళల‌ జీవ‌నోపాధి సంబంధిత జాతీయ స‌మావేశం- 2019’కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లైవ్లీ హుడ్ మిశ‌న్‌ స‌హకారం తో స్వ‌యం స‌హాయ బృందాలు త‌యారు చేసిన ఉత్పత్తుల‌ తో ఏర్పాటైన ఒక ప్ర‌ద‌ర్శ‌న‌ ను ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు. విద్యుత్తు తో న‌డిచే ఒక చ‌క్రం, సౌర శ‌క్తి తో ప‌ని చేసే చ‌ర‌ఖా, తేనెటీగల పెంపకం లో ఉపయోగించేటటువంటి ఒక తేనె బుట్ట లను మ‌హిళా ల‌బ్దిదారుల‌ కు అందించారు. అలాగే మ‌హిళా స్వ‌యం స‌హాయ బృందాల కు చెందిన అయిదుగురికి ప్ర‌శంసా ప‌త్రాల‌ ను కూడా ఆయ‌న‌ ప్ర‌దానం చేశారు. దీన్‌ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న, నేశనల్ రూరల్ లైవ్ లీ హుడ్ మిశన్ (ఎన్ఆర్ఎల్ఎమ్- ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ల తోడ్పాటు తో వివిధ‌ మ‌హిళ‌ ల స్వ‌యం స‌హాయ బృందాలు ‘భార‌త్ కె వీర్’ నిధి కి త‌మ చందా గా 21 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కు ను ప్ర‌ధాన మంత్రి కి అందించాయి.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రి కీ ప్ర‌ధాన మంత్రి వ‌ంద‌నాన్ని ఆచ‌రిస్తూ, ‘న్యూ ఇండియా’ నిర్మాణం లో మ‌హిళ ల‌కు ఒక ముఖ్య‌మైన పాత్ర ఉంద‌న్నారు. సుమారు 75 ప్ర‌దేశాల నుండి 65 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ లు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొంటున్నందుకు ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. వారాణ‌సీ మ‌హిళ‌ల సాధికారిత‌ కు ఒక ప్ర‌కాశ‌వంత‌మైనటువంటి ఉదాహ‌ర‌ణ గా ఉన్నద‌ని ఆయ‌న అన్నారు.

మ‌హిళ‌ల కు సాధికారిత క‌ల్ప‌న దిశ గా ప్ర‌భుత్వం పూర్తి గా దీక్షాబ‌ద్ధురాలై ఉన్న‌ద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. మ‌హిళ‌ల మ‌రియు బాలిక‌ల సంక్షేమం కోసం ప్ర‌త్యేకించి ఆరోగ్యం, పోష‌క విలువ‌లు, ప‌రిశుభ్ర‌త‌, విద్య‌, నైపుణ్యాభివృద్ధి, స్వ‌తంత్రోపాధి క‌ల్ప‌న‌, కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్లు వంటి రంగాల లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వివిధ ప‌థ‌కాల ను గురించి, అలాగే, మ‌హిళ ల‌కు భ‌ద్ర‌త‌, మ‌రియు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌ల ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆరు నెల‌ల మాతృత్వ సెల‌వు ప్ర‌పంచం లో ఉత్త‌మ‌మైన వ్యవస్థల లో ఒకటి అని ఆయ‌న అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నింటి లో మ‌హిళ ల‌కు ప్రాధాన్యాన్ని ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఇంత‌వ‌ర‌కు ఇచ్చిన 15 కోట్ల ముద్ర రుణాల లో 11 కోట్ల రుణాలు మ‌హిళ‌ ల‌కు ఇచ్చినట్లు ఆయ‌న తెలిపారు.

భార‌త‌దేశం లో స్వ‌యం స‌హాయ బృందాలు అసాధార‌ణ‌మైన‌టువంటి కృషి చేశాయ‌ని ప్ర‌ధాన మంత్రి అభినందిస్తూ, వారి కృషి కేవలం వారి కుటుంబం బాగుప‌డ‌టానికే కాకుండా దేశాభివృద్ధి కి కూడా దారి తీస్తున్నద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. స్వ‌యం స‌హాయ బృందాల‌ కు మెరుగైన బ్యాంకు రుణాలు మ‌రియు మ‌ద్ధ‌తు వ్య‌వ‌స్థ‌ ల క‌ల్ప‌న ప‌రం గా ప్ర‌భుత్వం కొత్త శ‌క్తి ని అంద‌జేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం దేశం లో ఇంచుమించు 50 ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ బృందాలు దాదాపు గా 6 కోట్ల మంది మ‌హిళ‌ లు పనిచేస్తున్నారని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క కుటుంబం లో క‌నీసం ఒక మ‌హిళా స‌భ్యురాలి ని ఒక స్వ‌యం స‌హాయ బృందం తో జతవ్వాలని ప్ర‌భుత్వం అభిలషిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

కొత్త కొత్త ఆలోచ‌న‌ల ను చేస్తూ, విప‌ణి ని మెరుగైన విధం గా అర్థం చేసుకోవ‌ల‌సింది గా స్వ‌యం స‌హాయ బృందాల ను ప్ర‌ధాన మంత్రి కోరారు. వారు వారి యొక్క ఉత్ప‌త్తుల ను ప్ర‌భుత్వాని కి విక్ర‌యించ‌డం కోసం జిఇఎమ్ (GEM) పోర్ట‌ల్ ను వినియోగించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. స్వ‌యం స‌హాయ బృందాలు వాటి ప్ర‌మేయాని కి ఆస్కారం ఉన్న చోట‌ల్లా నూత‌న రంగాల కు వ్యాప్తి చెందాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఇటీవ‌లే ప్రారంభించబడిన ప్రధాన మంత్రి శ్ర‌మ్‌ మాన్ ధ‌న్‌ యోజ‌న వృద్ధాప్యం లో ఆర్థిక భ‌ద్ర‌త ను అందిస్తుందని, కాబ‌ట్టి దాని ని పూర్తి గా ఉప‌యోగించుకోండంటూ మ‌హిళల కు ప్ర‌ధాన మంత్రి సూచించారు. ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి మ‌రియు ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న ల వ‌ల్ల చేకూరే లాభాల ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

వారాణ‌సీ లోని స్వ‌యం స‌హాయ బృందాల కు చెందిన మహిళా స‌భ్యుల తో కూడా ఆయ‌న సంభాషించారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi