ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కార్‌గిల్ విజయ్ దివస్ సూచకం గా న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమాని కి హాజరై, సభికుల ను ఉద్దేశించి పస్రంగించారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, భారతదేశం లోని ప్రతి ఒక్కరు ఈ రోజు న- దేశ ప్రజల కు సమర్పణ చేసిన ఒక స్ఫూర్తిమంతమైన గాథ ను- గుర్తు కు తెచ్చుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఆయన కార్‌గిల్ శిఖరాల ను కాపాడుతూ, ప్రాణాల ను అర్పించి, అమరులైన వారి కి శ్రద్ధాంజలి ని ఘటించారు. ఆయన దేశ ప్రజల విషయం లో జమ్ము & కశ్మీర్ ప్రజలు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారంటూ వారి పైన కూడా ప్రశంసల ను కురిపించారు. 20 సంవత్సరాల క్రితం కార్‌గిల్ పర్వతాల లో సాధించినటువంటి విజయం తరాల తరబడి మనకు ప్రేరణ ను అందిస్తూవుంటుందని ఆయన చెప్పారు.
కార్‌గిల్ లో గెలుపు ను ప్రధాన మంత్రి భారతదేశం యొక్క పుత్రులు మరియు పుత్రికల సాహసాని కి, అలాగే భారతదేశం యొక్క సంకల్పాని కి మరియు భారతదేశం యొక్క సామర్ధ్యాని కి, ధీరోదాత్తత కు దక్కిన విజయం గా అభివర్ణించారు. అది భారతదేశం యొక్క గౌరవాని కి, క్రమశిక్షణ కు; మరి అలాగే భారతదేశం లోని ప్రతి ఒక్కరి కి వారి కర్తవ్యం పట్ల సమర్పణ భావాని కి, ఇంకా ఆశల కు లభించిన విజయం అని కూడా ఆయన పేర్కొన్నారు.
యుద్ధాల ను ఒక్క ప్రభుత్వాలు మట్టుకే చేయవు, యుద్ధాన్ని యావత్తు జాతి చేస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సైనికులు భావి తరాల వారి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని ఆయన అన్నారు. ఈ జవానుల కార్యాలు భారతదేశం లో ప్రతి ఒక్కరి కి గర్వకారణం అని ఆయన తెలిపారు.
2014వ సంవత్సరం లో తాను అధికార బాధ్యతల ను స్వీకరించిన కొన్ని నెలల కే తాను కార్‌గిల్ ను సందర్శించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. 20 సంవత్సరాల క్రితం కార్‌గిల్ సమరం తీవ్ర స్థితి కి చేరుకొన్న ఘడియల్లో కూడా కార్‌గిల్ ను తాను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు. కార్‌గిల్ లో జవానుల పరాక్రమాన్ని గురించి ఆయన చెప్తూ, సైనికుల వెన్నంటి యావత్ దేశం నిలచిందని తెలిపారు. యువత రక్తదానం లో పాలుపంచుకొన్నారు. బాలలు సైతం వారు దాచుకొన్న ధనాన్ని సైనికుల కోసం విరాళం గా ఇచ్చారు.
అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు మన సైనికుల పట్ల వారి జీవిత కాలం లో మనం కనుక శ్రద్ధ వహించకపోయినట్లయితే, మన మాతృభూమి పట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించడం లో మనం విఫలం అవుతాం అంటూ పలికారని శ్రీ మోదీ జ్ఞప్తి కి తెచ్చారు. గడచిన అయిదు సంవత్సరాల కాలం లో సైనికుల కోసం మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం అనేక నిర్ణయాల ను కేంద్ర ప్రభుత్వం తీసుకొందని చెప్తూ ఆయన సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన ‘వన్ ర్యాంక్, వన్ పెన్శన్’ను; అమరుల పిల్లల కోసం ఉపకార వేతనాల పెంపుదల ను, అలాగే జాతీయ యుద్ధ స్మారకాన్ని గురించి ప్రస్తావించారు.
కశ్మీర్ లో పాకిస్తాన్ పదే పదే మోసాని కి పాల్పడిందని, 1999వ సంవత్సరం లోనూ మనం వారిని పైచేయి సాధించనీయలేదని ప్రధాన మంత్రి చెప్పారు. పాకిస్తాన్ కు ఒక దీటైన ప్రతిస్పందనను ఇవ్వడం కోసం ప్రధాని వాజ్‌పేయీ గారు తీసుకొన్న సంకల్పాన్ని ఆయన గుర్తు చేస్తూ, దీని కి శత్రువు వద్ద ఏ విధమైన జవాబు లేకపోయిందని తెలిపారు. అంతక్రితం వాజ్‌పేయీ ప్రభుత్వం తీసుకొన్న శాంతి పూర్వక చొరవ ప్రపంచం అంతటా భారతదేశ వైఖరి పట్ల ఒక మెరుగైనటువంటి అవగాహన ను ఏర్పరచిందని కూడా శ్రీ మోదీ అన్నారు.
భారతదేశం ఆక్రమణదారు గా మారిన దాఖలా చరిత్ర లో ఎన్నడూ లేదని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. భారతదేశ సాయుధ బలగాల ను శాంతి మరియు మానవీయత ల యొక్క రక్షకులు గా ప్రపంచవ్యాప్తం గా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. ఇజ్రాయల్ లోని హైఫా ను భారతదేశ జవానులు విముక్తం చేయడం, అలాగే ఒకటో ప్రపంచ యుద్ధ కాలం లో ప్రాణాల ను అర్పించిన భారతీయ సైనికుల కోసం ఫ్రాన్స్ లో ఒక స్మారకం నిర్మాణం అయిన సంగతుల ను ఆయన జ్ఞప్తి కి తెచ్చారు. ప్రపంచ యుద్ధాల లో ఒక లక్ష మంది కి పైగా భారతీయ సైనికులు ప్రాణ సమర్పణం చేశారని; ఐరాస శాంతి పరిరక్షక దళాల లో సైతం భారతీయ సైనికులే అత్యధిక సంఖ్య లో ప్రాణ సమర్పణం చేశారని ఆయన అన్నారు. ప్రాకృతిక విపత్తుల వేళల్లో సాయుధ బలగాల సేవలను మరియు వారు ప్రదర్శించిన సమర్పణ భావాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ఉగ్రవాదం, ఇంకా పరోక్ష యుద్ధం ఈ రోజు న యావత్తు ప్రపంచాని కి ఒక బెదరింపు ను రువ్వుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. యుద్ధం లో ఓటమి పాలైన వారు వారి రాజకీయ ఉద్దేశాల ను నెరవేర్చుకోవడానికి పరోక్ష యుద్ధాని కి పాల్పడుతూ, ఉగ్రవాదాన్ని బలపరుస్తున్నారని ఆయన చెప్పారు. మానవీయత ను నమ్మే వారందరూ సాయుధ బలగాల కు మద్దతు గా నిలబడవలసిన తక్షణావసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదురొడ్డాలంటే ఇది అత్యంత అవసరం అని ఆయన చెప్పారు.
సంఘర్షణ లు రోదసి కి మరియు సైబర్ వరల్డ్ కు చేరుకొన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా సాయుధ బలగాలను ఆధునికీకరించవలసి వుందని కూడా ఆయన చెప్పారు. జాతీయ భద్రత విషయాని కి వస్తే భారతదేశం ఒత్తిడి కి తలవొగ్గదని, ఏ విధంగాను లోటు ను రానీయదని ఆయన అన్నారు. ఈ సందర్భం లో భారతదేశం క్షిపణి నిరోధక పరీక్ష అయినటునవంటి ఎ- శాట్ ను ప్రయోగించిందని, అలాగే అరిహంత్ ద్వారా న్యూక్లియర్ ట్రాయడ్ ను నెలకొల్పిందని ఆయన వెల్లడించారు. సాయుధ బలగాల ను శీఘ్ర గతి న ఆధునికీకరించడం జరుగుతోందని, రక్షణ రంగం లో ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కై ప్రైవేటు రంగం మరింత ఎక్కువ స్థాయి లో పాలు పంచుకొనేలా ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. సాయుధ బలగాల తాలూకు మూడు విభాగాల మధ్య ‘‘సయుక్తత’’ నెలకొనవలసిన ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ఈ సందర్భం లో నొక్కి పలికారు.
సరిహద్దు ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన ను పటిష్ట పరచడం జరుగుతోందని ఆయన అన్నారు. సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి పరమైనటువంటి చర్యల ను గురించి మరియు అక్కడ నివసిస్తున్న ప్రజల సంక్షేమం కోసం తీసుకొంటున్న చర్యల ను గురించి ఆయన వివరించారు.
చివర గా, ప్రధాన మంత్రి 1947 లో స్వాతంత్య్రాన్ని గెలుచుకొన్నది యావత్తు దేశం అని; అలాగే, యావత్తు దేశ ప్రజల కోసమే 1950వ సంవత్సరం లో రాజ్యాంగాన్ని వ్రాసుకోవడం జరిగింది అని; అలాగే దేశం అంతటి కోసమే కార్‌గిల్ యొక్క మంచు శిఖరాల లో 500 మంది కి పైగా శూర సైనికులు ప్రాణ త్యాగం చేశారని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
ఈ త్యాగాలు వ్యర్ధం కాకుండా చూడటానికి, మరి ఈ అమరవీరుల కార్యాల నుండి ప్రేరణ ను పొందడాని కి, వారు కలగన్న భారతదేశాన్ని మనం ఆవిష్కరించడాని కి ఒక ఉమ్మడి సంకల్పాన్ని తీసుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు.