ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యాలో వేరు వేరు రాష్ట్రాలకు చెందిన 16 మంది గవర్నర్ల తో ఈ రోజు భేటీ అయ్యారు; ఆయన వారితో సంభాషించారు.
ద్వైపాక్షిక సంబంధాలను పెంచి పోషించుకోవడంలో ఇరు దేశాల ప్రాంతాలు మరియు రాష్ట్రాల మధ్య నెలకొన్న సంబంధాలు కీలక పాత్ర వహిస్తాయన్న తన విజన్ ను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 2001లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ రష్యా లోని Astrakhan ప్రావిన్స్ లో పర్యటించినప్పుడు తనకు సాదర స్వాగతం లభించిన సంగతిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నారు.
గవర్నర్లు తమ తమ ప్రావిన్సుల మధ్య మరియు భారతదేశంతోను వ్యాపార సంబంధాలను, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను, అన్యోన్యతను వర్ధిల్లజేసుకొనేందుకు ఉన్న అవకాశాలను గురించి వివరించారు.
ఈ రోజు శ్రీ మోదీతో ముఖాముఖి సంభాషణకు హాజరైన గవర్నర్లలో Arkhangelsk Oblast, Astrakhan Oblast, Irkutsk region, Moscow region, Primorye Territory, Republic of Kalmykia, Tatarstan, St. Petersburg, Sakhalin Oblast, Sverdlovsk Oblast, Tomsk Oblast, Tula Oblast, Ulyanovsk Oblast, Khabarovskiy Krai, Chelyabinsk Oblast, and Yaroslavl Oblast లకు చెందిన గవర్నర్లు ఉన్నారు.
Governors of various Russian regions interacted with PM @narendramodi. They held talks on boosting economic & people-to-people ties. pic.twitter.com/VCZfvd5Yhn
— PMO India (@PMOIndia) June 2, 2017