ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల డిడిఎ గ్రౌండ్ లో ఈ రోజు న జరిగిన దసరా ఉత్సవాల లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి విజయ దశమి సందర్భం గా దేశ పౌరుల కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం పర్వదినాల భూమి అన్నారు. మన సచేతన సంస్కృతి కారణం గా భారతదేశం లోని ఏదో ఒక మూల న ఎల్లప్పుడూ ఏదైనా ఒక సందర్భమో లేదా పర్వదినమో చోటు చేసుకొంటూనే ఉంటుంది. భారతదేశం లో పండుగ ల ద్వారా మనం భారతీయ సంస్కృతి యొక్క ముఖ్య పార్శ్వాల ను వేడుక గా జరుపుకొంటూవుంటాము. వీటి వల్ల మన కు కళ, సంగీతం, ఆట పాటల తాలూకు వివిధ రూపాల ను గురించిన అవగాహన లభ్యమవుతుంది అని ఆయన అన్నారు.
భారతదేశం శక్తి సాధన యొక్క భూమి గా వుందని ఆయన చెప్పారు. గడచిన తొమ్మిది రోజులు గా మనం మాత ను ఆరాధించాము. అదే స్ఫూర్తి ని ముందుకు తీసుకు పోతూ, మహిళల గౌరవాన్ని పెంపొందింపచేసే దిశగాను, మహిళ ల సాధికారిత ను ఇనుమడింపచేసే దిశ గాను కృషి చేయవలసిన అవసరం ఉంది అంటూ ఆయన పిలుపునిచ్చారు.
‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో భాగం గా గృహ లక్ష్మి అనే అంశం పై తాను మాట్లాడిన అంశాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, రానున్న దీపావళి పండుగ నాడు మన నారీ శక్తి యొక్క కార్యసిద్ధుల ను వేడుక గా జరుపుకొందామంటూ పిలుపునిచ్చారు. ఈ రోజు న విజయ దశమి తో పాటు వైమానిక దళ దినోత్సవం కూడా అని ఆయన అన్నారు. భారతదేశం తన వైమానిక దళాన్ని చూసుకొని అమితం గా గర్విస్తోందని ఆయన పేర్కొన్నారు.
మహాత్మ గాంధీ 150వ జయంతి ని జరుపుకొంటున్న వేళ, విజయ దశమి సందర్భం గా ఒక విషయమై ప్రధాన మంత్రి అభ్యర్ధించారు. ఈ సంవత్సరం లో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి దానిని పూర్తి చేయడం కోసం శ్రద్ధ తీసుకోవలసిందిగా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమం – ఆహారాన్ని వృథా చేయకపోవడం, శక్తి ని ఆదా చేయడం, నీటి ని సంరక్షించడం – వీటి లో ఏదైనా కావచ్చు అని ఆయన అన్నారు. మనం గనుక సమష్టి స్ఫూర్తి తాలూకు శక్తి ని అర్థం చేసుకోవాలని అనుకొన్నామంటే గనక అందుకు మనం భగవాన్ శ్రీ రాముడు మరియు భగవాన్ శ్రీ కృష్ణుడు ల నుండి ప్రేరణ ను పొందే తీరాలి అని ఆయన స్పష్టం చేశారు.
ద్వారక లోని శ్రీ రామ లీల సమాజం నిర్వహించిన రామ్ లీల కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి వీక్షించారు. ఈ కార్యక్రమం లో భాగం గా– చెడు పైన మంచి సాధించిన గెలుపున కు సంకేతం గా– ఏర్పాటు చేసిన రావణ, కుంభకర్ణ మరియు మేఘనాథు ల పెద్ద పెద్ద బొమ్మల ను దహనం చేయడాన్ని కూడా ఆయన తిలకించారు.
I greet my fellow Indians on Vijaya Dashami.
— PMO India (@PMOIndia) October 8, 2019
India is a land of festivals. Due to our vibrant culture, there is always an occasion or festival in some part of India.
Every festival brings our society together: PM @narendramodi pic.twitter.com/7QWd3kDJMJ
Through India’s festivals we celebrate the salient aspects of Indian culture. We get to know different types of art, music, song and dance: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 8, 2019
उत्सव हमें जोड़ते भी हैं, उत्सव हमें मोड़ते भी हैं। उत्सव हमें उमंग भी भरते हैं, उत्साह भी भरते हैं और हमारे सपनों को सजने का सामर्थ्य भी देते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 8, 2019
India is a land of Shakti Sadhna.
— PMO India (@PMOIndia) October 8, 2019
In the last nine days we worshipped Maa. Taking that spirit ahead, let us always work towards furthering empowerment as well as dignity of women: PM @narendramodi
During #MannKiBaat I had spoken about #GharKiLaxmi.
— PMO India (@PMOIndia) October 8, 2019
This Diwali, let us celebrate the accomplishments of our Nari Shakti. This can be our Lakshmi Pujan: PM @narendramodi
Today is Vijaya Dashami. Today is also Air Force Day. India is phenomenally proud of our Air Force: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 8, 2019
On this Vijaya Dashami, at a time when we mark #Gandhi150, I have a request for my fellow Indians.
— PMO India (@PMOIndia) October 8, 2019
Let us take up one mission this year and work to fulfil it.
This mission can be- not wasting food, conserving energy, saving water: PM @narendramodi
If we want to understand the power of collective spirit, we must seek inspiration from Bhagwan Shri Krishna and Bhagwan Shri Ram: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 8, 2019