PM Modi hoists the National Flag at Red Fort to commemorate the 75th anniversary of establishment of Azad Hind Government
Azad Hind government represented the vision laid down by Subhas Chandra Bose, of a strong undivided India: PM Modi
Subhas Chandra Bose was a visionary, who united Indians to fight against the powerful colonial British rule, says PM Modi
Netaji was an inspiration for all those who were fighting for self-determination and freedom in countries all over the world, says the Prime Minister

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటుచేసిన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన వార్షికోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతికెంతో గర్వకారణమైన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన స్మారకోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ- అవిభక్త, శక్తిమంతమైన భారతదేశంపై సుభాష్ చంద్రబోస్ దార్శనికతకు ఆజాద్ హింద్ ప్రభుత్వం ఒక ప్రతీకగా ఆయన పేర్కొన్నారు.

జాతి నిర్మాణంలో చురుగ్గా వ్యవహరించడమేగాక ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేయడంతోపాటు సొంత కరెన్సీని, స్టాంపులను కూడా ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు. జాతికి నేతాజీ చేసిన సేవలను గుర్తుచేస్తూ- బలమైన బ్రిటిష్ వలస పాలకులపై పోరాటానికి భారతీయులను ఏకం చేసిన సుభాష్ చంద్రబోస్ గొప్ప దార్శనికుడని కొనియాడారు. 

చిన్నతనం నుంచే ఆయనలో దేశభక్తి ఉప్పొంగుతుండేదని ఆయన తల్లి రాసిన లేఖలనుబట్టి స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.

ఒక్క భారతీయులకేగాక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ నేతాజీ స్ఫూర్తిప్రదాతగా నిలిచారని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు దక్షిణాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా కూడా నేతాజీ నుంచి స్ఫూర్తి పొందారని వివరించారు.

సుభాష్ చంద్రబోస్ కలలుగన్న నవభారత నిర్మాణానికి ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉందని గుర్తుచేస్తూ- నేతాజీ స్ఫూర్తితో పౌరులంతా భరత జాతి అభివృద్ధి కోసం తమవంతు కృషిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అసంఖ్యాకుల ఎనలేని త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఆ స్వేచ్ఛను పదిలంగా పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉద్బోధించారు. సైనికబలగాల్లో మహిళలకూ సమాన అవకాశాలు కల్పిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాందీప్రస్తావన చేశారని ప్రధానమంత్రి చెప్పారు. తదనుగుణంగా ఆనాడు రాణి ఝాన్సీ రెజిమెంట్ పేరిట మహిళా సైనిక బృందాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. ఆయన వారసత్వాన్ని సంపూర్ణ స్ఫూర్తితో తమ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, అందులో భాగంగా సైనిక బలగాల్లో మహిళలకు శాశ్వత నియామకం దిశగా వారికి సమాన అవకాశాలు కల్పిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”