ప్రపంచాన్ని శుభ్రం చేయడానికి 4 పి ల తప్పనిసరి - పొలిటికల్ లీడర్షిప్ (రాజకీయ నాయకత్వం), పబ్లిక్ ఫండింగ్ (ప్రభుత్వ నిధులు), పార్టీనేర్షిప్స్ (భాగస్వామ్యాలు) & పీపుల్స్ పార్టిసిపేషన్: ప్రధాని మోదీ
#SwachhBharat స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో, గాంధీజీ ఒకసారి స్వతంత్రం మరియు పరిశుభ్రతలో ఏది కోరుకుంటారు అంటే, ఆయన పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.
#SwacchBharat మిషన్ కోసం, నేను గౌరవనీయులైన బాపు నుండి ప్రేరణ పొందాను, ఉద్యమం ప్రారంభించగానే అతని మార్గదర్శకాలను అనుసరించాము: ప్రధాని మోదీ
నేడు, మన దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు గాంధీ అడుగుజాడలను అనుసరిస్తున్నారని తెలపడానికి గర్వపడుతున్నాను మరియు #SwacchBharat మిషన్ను విజయవంతం అయ్యింది: ప్రధాని మోదీ
పరిశుభ్రత ప్రచారం కోసం అనేక దేశాలు ముందుకు రావడమే ఇందుకు కారణం అని ఎంజిఐఎస్సి #Gandhi150 వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్య

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు జ‌రిగిన మ‌హాత్మ గాంధీ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ శానిటేష‌న్ క‌న్‌వెన్శ‌న్ (ఎంజిఐఎస్‌సి)లో ప్ర‌సంగించారు. ప్ర‌పంచం న‌లు మూలల నుండి పారిశుధ్య మంత్రుల ను మరియు నీరు, పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య ర‌క్ష‌ణ.. డ‌బ్ల్యుఎఎస్‌హెచ్ రంగాల లోని ఇత‌ర నాయ‌కుల ను ఒక చోటు కు చేర్చే, నాలుగు రోజుల పాటు జరిగే అంత‌ర్జాతీయ స‌మావేశ‌మే ఎంజిఐఎస్‌సి. 

 ప్ర‌ధాన మంత్రి ఒక డిజిట‌ల్ ఎగ్జిబిష‌న్ ను సంద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి వెంట ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఉన్నారు. ఉన్న‌తాధికారులు వేదిక మీద నుండి మ‌హాత్మ గాంధీ స్మార‌క త‌పాలా బిళ్ళ‌ ల‌తో పాటు మ‌హాత్మ గాంధీ కి ఎంతో ఇష్ట‌మైన కీర్త‌న అయిన ‘‘వైష్ణ‌వ జ‌న తో’’ ఆధారంగా రూపొందించిన ఓ సిడి ని కూడా ఆవిష్క‌రించారు. స్వ‌చ్ఛ్ భార‌త్ అవార్డు ల‌ను సైతం ఈ సంద‌ర్భంగా ప్ర‌దానం చేశారు.

 

 

 

మ‌హాత్మ గాంధీ స్వ‌చ్ఛ‌త కు ఇచ్చిన‌టువంటి ప్రాధాన్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు. 1945వ సంవ‌త్స‌రం లో ప్ర‌చురిత‌మైన‌ మ‌హాత్మ గాంధీ ర‌చ‌న ‘‘క‌న్‌స్ట్ర‌క్టివ్ ప్రోగ్రామ్’’ను ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల లో పారిశుధ్యాన్ని ఈ ర‌చ‌న లో ముఖ్య‌ాంశం గా వివ‌రించ‌డ‌మైంది.

ప‌రిశుభ్ర‌త కు నోచుకోని ప‌రిస‌రాల‌ ను శుభ్రం చేయ‌క‌పోయిన‌ట్ల‌యితే గ‌నుక, ప‌రిస్థితుల‌ కు త‌ల‌వంచే స్థితి ఎదుర‌వుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దీనికి భిన్నంగా, ప‌రిస‌ర ప్రాంతాల లోని మురికి ని ప్ర‌క్షాళ‌న చేసిన‌ పక్షంలో, అలా చేసిన వ్య‌క్తి కి శ‌క్తి ని స‌మ‌కూర్చుకొంటాడని, అంతే కాక ఆ వ్య‌క్తి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ కు లోబ‌డడ‌ని చెప్పారు.

మ‌హాత్మ గాంధీ ఇచ్చిన ప్రేర‌ణే ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ కు మార్గాన్ని చూపింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌హాత్మ గాంధీ నుండి భార‌తీయులు స్ఫూర్తి ని పొంది ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ను ప్ర‌పంచం లో కెల్లా ప్ర‌జలు పాలుపంచుకొంటున్న అత్యంత భారీ ఉద్య‌మం గా తీర్చిదిద్దార‌ని కూడా ఆయ‌న చెప్పారు. 2014వ సంవ‌త్స‌రం లో 38 శాతం స్థాయి వ‌ద్ద నిల‌చిన గ్రామీణ పారిశుధ్యం ప్ర‌స్తుతం 94 శాతం స్థాయి కి చేరుకొంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 5 ల‌క్ష‌ల‌కు పైగా ప‌ల్లెలు ప్ర‌స్తుతం బహిరంగంగా మల మూత్రాదుల విసర్జన కు తావు ఉండని ప్రాంతాలు (ఒడిఎఫ్)గా మారాయ‌ని ఆయ‌న చెప్పారు. 

భార‌త‌దేశం లో ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ అమ‌లు లోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల జీవ‌న శైలి మారుతోందంటూ ఆయ‌న సంతృప్తి ని వ్య‌క్తం చేశారు. స‌స్‌టైన‌బుల్ డివెల‌ప్‌మెంట్ గోల్స్ ను సాధించే మార్గం లో భార‌త‌దేశం ప‌య‌నిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచాన్ని శుభ్రంగా ఉంచ‌డం లో ‘4 పి’ ల‌కు.. రాజ‌కీయ నాయ‌క‌త్వం (Political Leadership), సార్వజనిక నిధి (Public Funding), భాగ‌స్వామ్యాలు (Partnerships), ఇంకా ప్ర‌జల ప్రాతినిధ్యం (People’s (participation)ల‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ఆయ‌న ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How MSMEs in Tier 2 & Tier 3 Cities Are Fuelling India’s Growth

Media Coverage

How MSMEs in Tier 2 & Tier 3 Cities Are Fuelling India’s Growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties