The thoughts of Mahatma Gandhi have the power to mitigate the challenges the world is facing today, says PM Modi
Swacchata' must become a 'Swabhav' of every Indian: Prime Minister
We are a land of non violence. We are the land of Mahatma Gandhi, says PM Modi
Killing people in the name of Gau Bhakti is not acceptable: Prime Minister
Let us work together and create India of Mahatma Gandhi's dreams: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు. 

మన చరిత్రతో మమేకమై ఉండటం ఒక సమాజంగా అత్యంత అవసరమని ఆయన అన్నారు. శ్రీమద్ రాజ్ చంద్రజీ 150వ జయంతి ఉత్సవం గురించి గుర్తు చేస్తూ, ఆయన జీవితం పట్ల మరియు ఆయన ఆలోచనల సరళి పట్ల మరింత పరిశోధన జరగాలని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారు. 

పరిశుభ్రత గురించి ప్రస్తావిస్తూ, అది ఒక అలవాటుగా మారి తీరాలని శ్రీ మోదీ చెప్పారు. 2019 సంవత్సరంలో మహాత్మ గాంధీ 150వ జయంతికి ఇదే చక్కటి నివాళి కాగలదని ఆయన అన్నారు. 

సాబర్మతి ఆశ్రమాన్ని చూడవలసిందంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. 

గోవుల పహరా అంశంపై ప్రధాన మంత్రి ఒక శక్తివంతమైన ప్రకటనను చేశారు. “మనది అహింసాయుతమైనటువంటి దేశం. మహాత్మా గాంధీ పుట్టిన గడ్డ ఇది. మహాత్మా గాంధీ మరియు ఆచార్య వినోబా బావే ల కన్నా మిన్నగా గో సంరక్ష‌ణను గురించి మాట్లాడినవారు ఎవ్వరూ లేరు. అవును, దీనిని ఖచ్చితంగా పాటించాలి.” 

అయితే, గోమాత భక్తి పేరిట అమాయకుల ప్రాణాలు హరించడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదంటూ, ఆయన గట్టిగా ఉద్ఘాటించారు. దీనిని మహాత్మా గాంధీ సమర్థించేవారు కాదు అని ఆయన అన్నారు. సమాజంలో హింసకు చోటు లేదని, ఈ దేశంలో చట్టాన్ని తమ చేతులలోకి తీసుకొనే హక్కు ఎవరికీ లేదని కూడా ఆయన వివరించారు. 

మహాత్మా గాంధీ కలలు గన్న భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం ప్రజలు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ప్రధాన మంత్రి కోరారు. మన స్వాంతంత్య్ర సమరయోధులు గర్వించే విధంగా మనం భారతదేశాన్ని తీర్చిదిద్దాలని తెలిపారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.