Country is not formed by governments alone. What is also important is fulfilling our duties as citizens: PM
Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ ని సంద‌ర్శించారు.  ఆయ‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో జంగంవాడీ మ‌ఠం లో గ‌ల శ్రీ‌ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శ‌త వార్షికోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

పంతొమ్మిది భాష‌ల లో అనువాద‌మైన ‘శ్రీ సిద్ధాంత్ శిఖామ‌ణి గ్రంథ్’ ప్ర‌తి ని కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ కార్య‌క్ర‌మం లో ఆవిష్క‌రించారు.  ‘శ్రీ సిద్ధాంత్ శిఖామ‌ణి గ్రంథ్’ మొబైల్ యాప్ ను సైతం ప్రధాన మంత్రి ప్రారంభించారు.  స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ నూరేళ్ల కాలం ఉత్స‌వాలు ఒక నూత‌న ద‌శాబ్ధి ఆరంభ త‌రుణం లో జ‌రుగుతూ ఉండ‌టం అనేది ఒక యాదృచ్ఛిక ఘ‌ట‌న, అంతే కాదు ప్ర‌పంచం లో ఇరవై ఒకటో శతాబ్ది లో భార‌త‌దేశం యొక్క పాత్ర ను ఈ ద‌శాబ్ది మ‌రొక్క‌మారు ప్ర‌తిష్ఠితం చేస్తుంది అని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

మొబైల్ యాప్ మాధ్య‌మం ద్వారా ‘శ్రీ సిద్ధాంత్ శిఖామ‌ణి గ్రంథం’ డిజిట‌లీక‌ర‌ణ ప్ర‌క్రియ యువతరం దీని తో మ‌మేకం అయ్యేందుకు, వారి జీవనాల లో స్ఫూర్తి ని నింపేందుకు మ‌రింత గా తోడ్ప‌డ‌నుంది అని ప్రధాన మంత్రి చెప్పారు.  ఈ గ్రంథాని కి సంబంధించిన అంశాల పై మొబైల్ యాప్ ద్వారా ఏటా ఒక క్విజ్ పోటీ ని నిర్వ‌హించాల‌ని ఆయ‌న సూచించారు.  ఈ గ్రంథాన్ని 19 భాష‌ల లో అనువ‌దించ‌డం అనేది మ‌రింత మంది ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఈ గ్రంథం చేరుకోవడం లో స‌హాయ‌కారి అవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ఒక పౌరుని గా మ‌నం ఏ విధం గా న‌డ‌చుకొంటామ‌నేది భార‌త‌దేశం యొక్క భ‌విష్య‌త్తు ను నిర్ధారిస్తుంది, అంతేకాక‌ ఒక ‘న్యూ ఇండియా’ యొక్క దిశ ను కూడా ఇది నిర్ణ‌యిస్తుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  సాధువులు సూచించిన మార్గాన్ని అనుస‌రించ‌డం ద్వారా మ‌నం మ‌న జీవితాల లో ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చుకోవ‌ల‌సివున్నది.  అంతే కాక జాతి నిర్మాణం లో పూర్తి స‌హ‌కారాన్ని అందించ‌డాన్ని కొన‌సాగించవలసివుంది కూడా అని ఆయ‌న చెప్పారు.

స్వ‌చ్ఛత‌ మిశ‌న్ ను దేశం లో ప్ర‌తి ఒక్క ప్రాంతాని కి తీసుకుపోవ‌డం ద్వారా ప‌రిశుభ్ర‌త కు సంబంధించిన చైత‌న్యాన్ని నెల‌కొల్ప‌డం లో ప్ర‌జ‌లు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.  భార‌త‌దేశం లో త‌యారైన ఉత్ప‌త్తుల ను ఉప‌యోగించుకోవాలంటూ వారి కి ఆయ‌న విజ్ఞప్తి చేశారు.  జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ ఫ‌ల‌ప్ర‌దం అయ్యేట‌ట్లు చూడ‌టం కోసం దీనిలో పాలుపంచుకోవ‌ల‌సింది గా ప్ర‌తి ఒక్క‌రి కి ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

గంగా న‌ది శుద్ధి లో గ‌ణ‌నీయ‌మైన‌ మ‌రియు గ‌మ‌నించ‌ద‌గిన‌ మెరుగుద‌ల చోటు చేసుకొంది;  ప్ర‌జ‌లు భాగం పంచుకోవ‌డం ద్వారా మాత్ర‌మే ఇది సాధ్యం అయింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  న‌మామి గంగే కార్య‌క్ర‌మం లో భాగం గా 7,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల ను పూర్తి చేయ‌డం జ‌రిగింది, 21,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల ప‌నులు పురోగ‌మిస్తున్నాయి అంటూ ఆయ‌న వివ‌రించారు.

‘శ్రీ రామ్ జ‌న్మభూమి తీర్థ క్షేత్ర’ పేరు తో ఒక ట్ర‌స్టు ను రామాల‌యం నిర్మాణం కోసం ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన సంగతి ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.  ఈ ట్ర‌స్టు ఆయోధ్య లో శ్రీ రామాల‌య నిర్మాణ ప‌నుల‌ ను చూసుకొంటుంది అని ఆయన చెప్పారు. ఈ ట్ర‌స్టు కు 67 ఎక‌రాల భూమి ని బ‌దిలీ చేయాల‌ని కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది అని ఆయ‌న వెల్ల‌డించారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"