ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇందౌర్ లో జరిగిన ‘అశరా ముబారాకా’ లో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ సమర్పణాన్ని స్మరించుకొనేందుకు దావూదీ బోహ్రా సముదాయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇమామ్ హుసేన్ త్యాగాలను ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, ఇమామ్ ఎల్లప్పుడూ అన్యాయానికి ఎదురొడ్డి నిలచారని, శాంతి ని మరియు న్యాయాన్ని పరిరక్షించడం కోసం ప్రాణ సమర్పణ చేశారని పేర్కొన్నారు. ఇమామ్ ప్రబోధాలు నేటి కీ సందర్భ శుద్ధి కలిగినవేనని ఆయన అన్నారు. డాక్టర్ సయ్యద్‌నా ముఫద్దల్ సైఫుద్దీన్ కృషి ని ప్రధాన మంత్రి శ్లాఘిస్తూ ఆయన ప్రవచనాలలో దేశ ప్రజల పట్ల ప్రేమ, అంకిత భావం తొణికిసలాడుతాయన్నారు.
ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే సంస్కృతి భారతదేశాన్ని ఇతర అన్ని దేశాల కన్నా భిన్నంగా తీర్చి దిద్దుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మనం మన గతాన్ని చూసుకొని గర్వపడుతున్నాం, మనం మన వర్తమానం యెడల నమ్మకాన్ని కలిగివున్నాం, అంతేకాక మన ఉజ్వల భవిష్యత్తు పట్ల మనం విశ్వాసంతో ఉన్నామ’’ని ఆయన చెప్పారు.
దావూదీ బోహ్రా సముదాయం అందించిన సేవలను ప్రధాన మంత్రి ప్రముఖంగా వివరిస్తూ ఈ సముదాయం భారతదేశం యొక్క పురోగతి లో, వృద్ధి గాథ లో సదా కీలక భూమిక ను పోషించిందన్నారు. భారతదేశ సంస్కృతి యొక్క బలాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే ఈ సముదాయం ఈ ఘనమైన కృషి ని కొనసాగిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బోహ్రా సముదాయం యొక్క వాత్సల్యాన్ని అందుకోవడం తన సౌభాగ్యం అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి గా వున్న కాలం లో ఈ సముదాయం తనకు అందించిన సహకారాన్ని ఆయన జ్ఞప్తి కి తెచ్చుకొంటూ వారి ఆదరణే తన ను ఇందౌర్ కు రప్పించిందన్నారు.
దావూదీ బోహ్రా సముదాయం అమలు చేస్తున్న వివిధ సామాజిక కార్యక్రమాలను ప్రధాన మంత్రి కొనియాడుతూ పౌరుల, ప్రత్యేకించి పేదల మరియు ఆర్తుల జీవన ప్రమాణాలను మెరుగు పరచే విధంగా ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రయత్నాలను గురించి వివరించారు. ఈ సందర్భంలో స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మరియు ఆయుష్మాన్ భారత్ ల వంటి వివిధ అభివృద్ధి ప్రధాన కార్యక్రమాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు సాధారణ ప్రజానీకం యొక్క జీవితాలలో మార్పు ను తీసుకు వస్తున్నాయని ఆయన చెప్పారు.
‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ను ముందుకు తీసుకుపోతున్నందుకు ఇందౌర్ ప్రజల ను ప్రధాన మంత్రి అభినందించారు. ‘స్వచ్ఛతా హీ సేవా’ పథకాన్ని రేపు ప్రారంభించుకోవడం జరుగుతుందని, ఈ భవ్యమైనటువంటి స్వచ్ఛత కార్యక్రమం లో చురుకు గా పాలుపంచుకోవలసిందిగా పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యాపారం లో బోహ్రా సముదాయం చూపిన నిజాయతీ ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిఎస్‌టి, ఇన్‌సాల్వెన్సి అండ్ బ్యాంక్‌రప్టసి కోడ్ ల ద్వారా నిజాయతీ పరులైన వ్యాపారస్తుల ను మరియు శ్రామికుల ను ప్రోత్సహిస్తోందని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని ఆయన చెప్తూ ‘న్యూ ఇండియా’ ఆవిష్కరణ జరగడమే తరువాయి అని పునరుద్ఘాటించారు.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. అంతక్రితం, డాక్టర్ సయ్యద్‌నా ముఫద్దల్ సైఫుద్దీన్ ప్రధాన మంత్రి ని ఆయన చేస్తున్న ఆదర్శప్రాయమైన కృషి కి గాను ప్రశంసించారు; దేశం కోసం ఆయన చేస్తున్న కృషి సఫలం కావాలని కూడా ఆకాంక్షించారు.
‘अशरा मुबारक’ के इस पवित्र अवसर पर भी आपने मुझे यहां आने का मौका दिया, इसके लिए बहुत आभार।
— PMO India (@PMOIndia) September 14, 2018
मुझे बताया गया है कि टेक्नॉलॉजी के माध्यम से देश और दुनिया के अलग-अलग सेंटर्स से भी समाज के लोग जुड़े हैं, आप सभी का भी मैं अभिनंदन करता हूं: PM
इमाम हुसैन के पवित्र संदेश को आपने अपने जीवन में उतारा है और दुनिया तक उनका पैगाम पहुंचाया है
— PMO India (@PMOIndia) September 14, 2018
इमाम हुसैन अमन और इंसाफ के लिए शहीद हो गए थे
उन्होंने अन्याय, अहंकार के विरुद्ध अपनी आवाज़ बुलंद की थी
उनकी ये सीख जितनी तब महत्वपूर्ण थी उससे अधिक आज की दुनिया के लिए ये अहम है: PM
हम पूरे विश्व को एक परिवार मानने वाले, सबको साथ लेकर चलने की परंपरा का मानने वाले लोग हैं।
— PMO India (@PMOIndia) September 14, 2018
हमारे समाज की, हमारी विरासत की, यही शक्ति है जो हमें दुनिया के दूसरे देशों से अलग करती है: PM
हमें अपने अतीत पर गर्व है,
— PMO India (@PMOIndia) September 14, 2018
वर्तमान पर विश्वास है और
उज्जवल भविष्य का आत्मविश्वास है: PM
बोहरा समाज के साथ मेरा भी रिश्ता बहुत ही पुराना है।
— PMO India (@PMOIndia) September 14, 2018
मेरा सौभाग्य है कि आपका स्नेह मुझ पर हमेशा रहा।
गुजरात का शायद ही कोई गांव हो जहां बोहरा व्यापारी नहीं मिलता हो।
मैं जब मुख्यमंत्री था तब कदम-कदम पर बोहरा समाज ने साथ दिया।
आपका यही अपनापन मुझे आज यहां खींच लाया है: PM
अब आयुष्मान भारत देश के करीब-करीब 50 करोड़ गरीब भाई-बहनों के लिए संजीवनी बनकर आई है।
— PMO India (@PMOIndia) September 14, 2018
एक साल में 5 लाख तक का मुफ्त इलाज सुनिश्चित करने वाली इस योजना का अभी ट्रायल चल रहा है: PM
स्वच्छ भारत अभियान शुरु भले ही सरकार ने किया हो, लेकिन आज इस अभियान को देश की 125 करोड़ जनता चला रही है।
— PMO India (@PMOIndia) September 14, 2018
गांव-गांव, गली-गली में स्वच्छता के प्रति एक अभूतपूर्व आग्रह पैदा हुआ है।
चार वर्ष पहले तक जहां देश के 40% घरों में ही टॉयलेट थे आज ये दायरा 90% से भी अधिक हो गया है: PM
आज हम जिस इंदौर शहर में जुटे हैं, ये तो स्वच्छता के इस आंदोलन का अगुवा है।
— PMO India (@PMOIndia) September 14, 2018
इंदौर निरंतर स्वच्छता के पैमाने पर देशभर में No.1 रहा है।
इंदौर ही नहीं भोपाल ने भी इस बार कमाल किया है।
एक प्रकार से पूरे मध्य प्रदेश के मेरे युवा साथी, एक-एक जन इस आंदोलन को गति दे रहे हैं: PM
कल से स्वच्छता ही सेवा’ पखवाड़ा शुरु हो रहा है।
— PMO India (@PMOIndia) September 14, 2018
मैं कल खुद देश के स्वच्छाग्रहियों, समाज में स्वच्छता के प्रति जनजागरण करने वाले आप जैसे नागरिकों, धर्मगुरुओं, कलाकारों, उद्यमियों, यानि समाज के हर वर्ग के लोगों से वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से बातचीत करुंगा: PM
देश का व्यापारी और कारोबारी अर्थव्यवस्था की रीढ है
— PMO India (@PMOIndia) September 14, 2018
वो देश में रोज़गार पैदा करने वाली महत्वपूर्ण ईकाई है
उसको जितना प्रोत्साहन संभव है दिया जा रहा है
लेकिन ये भी सच है कि पांचों उंगलियां एक समान नहीं होतीं। हमारे बीच से ही ऐसे लोग निकलते हैं जो छल को ही कारोबार मानते है: PM
बीते 4 वर्षों में सरकार ये साफ संदेश देने में सफल हुई है कि जो भी हो वो नियमों के दायरे में हो।
— PMO India (@PMOIndia) September 14, 2018
GST, Insolvency and Bankruptcy Code जैसे अनेक कानूनों के माध्यम से ईमानदार कारोबारियों को प्रोत्साहित किया जा रहा है: PM
दुनिया में जिस प्रकार प्राचीन भारत की चमक थी, आज New India को वो सम्मान देने का सौभाग्य हमें मिला है।
— PMO India (@PMOIndia) September 14, 2018
देश के नव निर्माण के लिए हम निरंतर मिलकर आगे बढ़ते रहेंगे, इसी विश्वास के साथ मैं अपनी बात समाप्त करता हूं: PM