QuoteAyushman Bharat is one of the revolutionary steps of New India
QuoteAyushman Bharat symbolizes the collective resolve and strength of 130 crore people as India: PM Modi
QuoteAyushman Bharat is a holistic solution for a healthy India: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఆరోగ్య మంథ‌న్ ముగింపు కార్య‌క్రమాని కి అధ్య‌క్ష‌త వ‌హించి, దేశం లోని 10.70 కోట్ల కు పైగా పేద కుటుంబాల ఆరోగ్య భ‌ద్ర‌త కు పూచీ ప‌డేటటువంటి మరియు ప్ర‌పంచం లోని అతి పెద్ద ఆరోగ్య బీమా ప‌థ‌కం అయినటువంటి ఆయుష్మాన్ భార‌త్ కోసం ఒక కొత్త మొబైల్ అప్లికేశ‌న్ ను ప్రారంభించారు.

ఆయ‌న ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న (పిఎం-జెఎవై)కి చెందిన ఎంపిక చేసిన కొంత మంది ల‌బ్ధిదారుల తో ముఖాముఖి సంభాషించారు.

గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌ర కాలాని కి పైగా కొన‌సాగుతూ ఉన్న ప‌థ‌కం ప్ర‌స్థానాన్ని క‌ళ్ళ‌ కు క‌ట్టినటువంటి పిఎం-జెఎవై తాలూకు ప్ర‌ద‌ర్శ‌న ను ప్రధాన మంత్రి సంద‌ర్శించారు.

అలాగే, ఈ సంద‌ర్భం గా ‘ఆయుష్మాన్ భార‌త్ స్టార్ట్‌- అప్ గ్రాండ్ చాలింజ్’ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఒక స్మార‌క స్టాంపు ను సైతం ఆయన ఆవిష్కరించారు.

|

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం గా మాట్లాడుతూ, ‘‘ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు లోకి వ‌చ్చిన మొద‌టి సంవ‌త్స‌రం లో సంక‌ల్పం తీసుకోవడం, స‌మ‌ర్ప‌ణ భావాన్ని కనబరచడం తో పాటు ప‌ర‌స్ప‌రం నేర్చుకోవ‌డం కూడా జ‌రిగింది. మ‌నం ప్ర‌పంచం అంత‌టి లోకి అతి పెద్ద‌దైన ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాన్ని భార‌త‌దేశం లో మ‌న యొక్క దృఢ సంక‌ల్పం తో న‌డుపుతున్నాం’’ అన్నారు.

వైద్య స‌దుపాయాలు దేశం లోని ప్ర‌తి పేద వ్య‌క్తి కి మ‌రియు ప్ర‌తి ఒక్క పౌరుని కి సుల‌భం గా ల‌భించాలి అని ఆయ‌న అన్నారు.

ఈ స‌ఫ‌ల‌త వెనుక ఒక స‌మ‌ర్ప‌ణ భావం ఉంద‌ని, మ‌రి ఈ స‌మ‌ర్ప‌ణ భావం దేశం లోని ప్ర‌తి ఒక్క రాష్ట్రాని కి, ప్ర‌తి ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాని కి ద‌క్కుతుంద‌ని కూడా ఆయ‌న అన్నారు.

|

దేశం లోని ల‌క్ష‌లాది పేద ప్ర‌జ‌ల లో రోగం బారి నుండి బ‌య‌ట‌ ప‌డ‌గ‌లుగుతామ‌న్న ఆశ ను ర‌గుల్కొల్ప‌డం అనేది ఒక గొప్ప కార్య సాధ‌న అని ఆయ‌న అన్నారు. గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌ర కాలం లో ఏ వ్య‌క్తి అయినా వైద్య చికిత్స కోసం ఇంటి ని, లేదా న‌గ‌ల‌ ను, లేదా భూమి ని, లేదా మ‌రే ఇత‌ర వ‌స్తువుల‌ను అయినా విక్ర‌యించ‌డానికో, లేదా త‌న‌ఖా పెట్ట‌డానికో చూడ‌కుండా వుంటే అటువంటప్పుడు అదే ఆయుష్మాన్ భార‌త్ యొక్క భారీ స‌ఫ‌ల‌త అవుతుందని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.

గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌రం కాలం లో దాదాపుగా 50,000 మంది పేద‌లు వారి రాష్ట్రాని కి వెలుపల మ‌రియు వారి జిల్లా కు వెలుప‌ల పిఎంజెఎవై లో భాగం గా ల‌బ్ధి ని పొంద గ‌లిగారు అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

|

‘న్యూ ఇండియా’ యొక్క విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాల లో ఆయుష్మాన్ భార‌త్ ఒక‌టి అని, అది కేవ‌లం ఒక సాధార‌ణ వ్య‌క్తి యొక్క జీవ‌నాన్ని కాపాడ‌డం లో ఒక ముఖ్య‌మైన పాత్ర ను పోషించినందువ‌ల్ల మాత్ర‌మే కాక దేశం లోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల స‌మ‌ర్ప‌ణ భావం మ‌రియు శ‌క్తి యొక్క సంకేతం గా కూడా ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వివరించారు.

ఆయుష్మాన్ భార‌త్ అనేది యావ‌త్తు భార‌త‌దేశాని కి ఒక ఉమ్మ‌డి ప‌రిష్కార మార్గం గానే కాక ఒక స్వాస్థ్య భార‌త్ కోసం ఉద్దేశించిన‌టువంటి సమ‌గ్ర ప‌రిష్కారం కూడా అని ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశం యొక్క స‌మ‌స్య‌ల ను మ‌రియు సవాళ్ళ ను ప‌రిష్క‌రించ‌డం లో ముక్క‌లు ముక్క‌ల వంటి ఆలోచ‌న‌లు చేసే క‌న్నా సంపూర్ణ‌త్వం తో కూడిన కార్యాలు చేయాల‌నే ప్ర‌భుత్వ ఆలోచ‌న స‌ర‌ళి కి ఇది ఒక పొడిగింపు వంటిద‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఆయుష్మాన్ భార‌త్ దేశం లోని ఏ మూల‌ న ఉన్న రోగుల‌ కు అయినా సరే ఉత్త‌మ చికిత్స కు పూచీ లభిస్తుంది అని ఆయన అన్నారు.

|

ఆయుష్మాన్ భార‌త్ పిఎం-జెఎవై అమ‌లు లోకి వ‌చ్చి ఒక సంవ‌త్స‌రం పూర్తి అయినందుకు గుర్తు గా నేశ‌న‌ల్ హెల్త్ అథారిటీ ఆధ్వ‌ర్యం లో ఏర్పాటైన రెండు రోజుల కార్య‌క్ర‌మం పేరే ఆరోగ్య మంథ‌న్‌. ఆరోగ్య మంథ‌న్ ను ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ ప‌థ‌కం అమ‌లు లోకి వ‌చ్చిన గ‌త సంవ‌త్స‌ర కాలం లో ఎదురైన స‌వాళ్ళ ను గురించి చ‌ర్చించ‌డం మ‌రియు పిఎం-జెఎవై తాలూకు ముఖ్య‌మైన సంబంధిత వ‌ర్గాల వారంద‌రితో భేటీ కావ‌డం కోసం ఒక వేదిక ను స‌మ‌కూర్చ‌డమూ, ఈ ప‌థ‌కం అమ‌లు తీరు ను మెరుగుప‌ర‌చ‌డం కోసం ఒక నూత‌న‌ అవ‌గాహ‌న ను ఏర్ప‌ర‌చుకొని ముందుకు పోవ‌డ‌మూ ను.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section

Media Coverage

Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 ఏప్రిల్ 2025
April 10, 2025

Citizens Appreciate PM Modi’s Vision: Transforming Rails, Roads, and Skies