పునరుద్దరించిన వారసత్వ భవనాలు నాలుగిటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్ కాతా లో నేడు దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. అవి: ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వెడేయర్ హౌస్, మెట్ కాఫ్ హౌస్ మరియు విక్టోరియా మెమోరియల్ హాల్.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతీయ కళ ను, సంస్కృతి ని మరియు వారసత్వాన్ని సంరక్షించుకోవడం తో పాటు తిరిగి కనుగొనడం, పునర్ గుర్తింపు, పునర్నిర్మాణం మరియు కొత్త భవనాల ఏర్పాటు దిశ లో ప్రయత్నాలు జరిపేందుకు దేశ వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం అని పేర్కొన్నారు.
ప్రపంచాని కి సెంటర్ ఆఫ్ హెరిటేజ్ టూరిజమ్ :
భారతదేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని మరియు నిర్మాణాల ను పరిరక్షించుకోవాలని, వాటి ని ఆధునికీకరించుకోవాలని ఎల్లవేళలా కోరుకుంటోందని శ్రీ మోదీ అన్నారు. అదే స్ఫూర్తి తో ప్రపంచానికి ఒక వారసత్వ పర్యాటక కేంద్రం గా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
దేశంలోని 5 వస్తు ప్రదర్శన శాలల ను అంతర్జాతీయ ప్రమాణాల కు అనుగుణం గా తీర్చిదిద్దడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పని ని ప్రపంచం లో అతి పురాతన వస్తు ప్రదర్శన శాలల్లో ఒకటైన ఇండియా మ్యూజియమ్ (కోల్ కాతా)తో ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని వనరుల సృష్టి, సంగ్రహాలయాల సంరక్షణ కోసం ఈ నాలుగు సాంస్కృతిక వారసత్వ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతల ను ప్రభుత్వం చేపట్టాలని, భారత వారసత్వ పరిరక్షణ సంస్థ ను ప్రారంభించి దానికి విశ్వవిద్యాలయం హోదా ను ఇవ్వాలని యోచిస్తోందని శ్రీ మోదీ తెలిపారు.
నాలుగు వారసత్వ భవనాలైనటువంటి ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వెడేయర్ హౌస్, మెట్ కాఫ్ హౌస్ మరియు విక్టోరియా మెమోరియల్ హాల్ ల యొక్క పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు. బెల్వెడేయర్ హౌస్ ను ప్రపంచ మ్యూజియమ్ గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని కూడా ఆయన తెలిపారు.
కోల్ కాతా లోని భారత ప్రభుత్వ టంకశాల వద్ద “నాణేల తయారీ మరియు వర్తకం” ఇతివృత్తం తో మ్యూజియమ్ ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ తెలిపారు.
విప్లవీ భారత్
“విక్టోరియా మెమోరియల్ హాలులోని ఐదు గ్యాలరీల లో మూడు చాలా కాలంగా మూసి వున్నాయి. ఇది మంచిది కాదు. ఇప్పుడు మేము వాటిని తిరిగి తెరచే ప్రయత్నాన్ని చేస్తున్నాము. భారత స్వాతంత్ర్య సమర యోధుల చిత్రపటాల ను ఉంచేందుకు కొంత చోటు ను కేటాయించాలని నా వినతి. ఆ విభాగానికి “విప్లవీ భారత్” అని పేరు పెట్టాలి. దానిలో సుభాష్ చంద్ర బోస్, అరబిందో ఘోష్, రాస్ బిహారీ బోస్, ఖుదీ రాం బోస్, బాఘా జతిన్, బినాయ్, బాదల్, దినేశ్.. ఇలాగ ప్రతి ఒక్క మహా సేనాని కి ఇక్కడ చోటు లభించాలి” అని ప్రధాన మంత్రి అన్నారు.
సుభాష్ చంద్ర బోసు ను గురించి దేశ ప్రజలకు గల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీ లో ఎర్రకోట వద్ద సుభాష్ చంద్ర బోసు మ్యూజియమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అండమాన్ నికోబార్ ద్వీప సమూహం లో ఒక దీవి కి నేతాజీ పేరు పెట్టడం జరిగింది.
బెంగాల్ ఆరాధ్య నాయకులకు నివాళులు
దేశాని కి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడానికి తమ ప్రాణాల ను అర్పించిన పశ్చిమ బెంగాల్ భూమి పుత్రులైన ఆరాధ్య నాయకుల కు కొత్త శకం లో తగిన నివాళులు అర్పించాలని ప్రధాన మంత్రి కోరారు.
“ప్రస్తుతం మనం శ్రీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 200వ జయంతి ఉత్సవాల ను జరుపుకొంటున్నాము. అదే విధం గా 2022వ సంవత్సరం లో భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించిన 75వ సంవత్సరం లో ప్రముఖ సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త శ్రీ రాజా రాంమోహన్ రాయ్ యొక్క 250వ జయంతి ని జరుపుకోవలసివుంది. దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి యువత, మహిళలు, బాలికల సంక్షేమాని కి ఆయన చేసిన ప్రయత్నాల ను మనం గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. అదే స్పూర్తి తో మనం ఆయన 250వ జయంతి ఉత్సవాల ను అంగరంగ వైభవం గా జరుపుకోవాలి”.
భారతీయ చరిత్ర ను పరిరక్షించుకోవడం
భారతీయ వారసత్వం, భారతదేశాని కి చెందిన మహనీయ నాయకుల ఖ్యాతి ని, భారతీయ చరిత్ర ను పరిరక్షించడమే జాతి నిర్మాణం లో ప్రధాన అంశం అని ప్రధాన మంత్రి అన్నారు.
“భారతదేశ చరిత్ర ను బ్రిటిష్ పాలకుల హయాము లో లిఖించడమైంది. దానిలో పలు ముఖ్యమైన అంశాల ను వదలివేశారు. భారతదేశ చరిత్ర ను గురించి 1903లో గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసిన సంగతి ని ఇక్కడ ఉటంకిస్తాను. “భారతదేశ చరిత్ర అంటే మనం పరీక్షల కోసం చదివి, బట్టీ పట్టి వ్రాసేది కాదు. అది కేవలం బయటి వ్యక్తులు మనల్ని జయించడానికి చేసిన ప్రయత్నాల ను, ఎత్తుగడల ను గురించి, పిల్లలు తమ తండ్రుల ను చంపడాన్ని గురించి, సింహాసనం కోసం సోదరులు తమలో తాము కొట్లాడుకోవడం గురించి మాత్రమే చెప్తుంది. వారు రాసిన చరిత్ర లో భారత పౌరుల ను గురించి గాని, వారు జీవించినటువంటి తీరు ను గురించి గాని ఉండదు. అసలు వారి కి ప్రాముఖ్యమే ఇవ్వలేదు”.
“గురుదేవులు ఏమన్నారంటే దేశం పై జరిగిన ముట్టడి ఎంత బలమైంది అయినా కావచ్చు. దాని ని ఎదుర్కొన్న ప్రజలు, వారు ఎదుర్కొన్న తీరే ఎక్కువ ముఖ్యమైనది” అని.
“అందువల్ల మిత్రులారా, గురుదేవులు ఉల్లేఖించిన వాక్యం చరిత్రకారులు దేశం పై జరిగిన ముట్టడి ని బయటి నుండి చూసి వ్రాసిన విషయాన్ని గుర్తుచేస్తోంది. చరిత్రకారులు ముట్టడి కి గురైన, దాని వల్ల నష్టపోయిన వారి ఇళ్ళలోకి వెళ్లి చూడలేదు. బయటి నుండి చూసే వారికి అసలు పరిస్థితి ఏమిటో అర్ధం కాదు.”
“అటువంటి ఎన్నో సమస్యల ను, అంశాల ను ఈ చరిత్రకారులు వదలివేశారు” అని ఆయన అన్నారు. దేశం లో అస్థిరత నెలకొని యుద్ధం జరుగుతున్నప్పుడు దేశాన్ని గురించి , దేశ అంతరాత్మ ను గురించి పట్టించుకున్నది ఎవరు? మన సంప్రదాయాన్ని తరువాత తరాల కు అందించింది ఎవరు?” అని ప్రశ్నిస్తూ..
“మన కళ, మన సాహిత్యం, మన సంగీతం, మన సాధువులు, మన సంన్యాసులు ఆ పని చేశారు” అని ప్రధాన మంత్రి వివరించారు.
భారతీయ సంప్రదాయాలకు మరియు సంస్కృతుల కు ప్రోత్సాహం
“భారత దేశం లోని ప్రతి మూలా వివిధ రకాల కళ లు, సంగీతం గురించిన ప్రత్యెక సంప్రదాయాల ను మనం చూస్తాము. అదేవిధం గా దేశం లోని ప్రతి ప్రాంతం లో మేధావులు, సాధువుల ప్రభావం మనకు కనిపిస్తుంది. ఈ వ్యక్తులు, వారి భావన లు, వివిధ కళారూపాలు మరియు సాహిత్యం చరిత్రను సంపన్నం చేసింది. దేశ చరిత్ర లో జరిగిన అతిపెద్ద సంఘ సంస్కరణల కు మహోన్నతులు ఎందరో నాయకత్వం వహించారు. వారు చూపిన బాట ఈనాటి కి కూడా మనకు స్పూర్తిదాయకం గా ఉంది”.
“ఎందరో సంఘ సంస్కర్తల బోధన లు, వారు రాసిన పాటల తో భక్తి ఉద్యమం వృద్ధి చెందింది. సంత్ కబీర్, తులసీదాస్ తదితరులు ఎందరో సమాజాన్ని మేల్కొల్పడం లో కీలక భూమిక ను నిర్వహించారు.”
“ఈ సందర్భం లో మనం మిశిగన్ యూనివర్సిటీ లో జరిగిన చర్చ లో పాల్గొంటూ స్వామి వివేకానందుల వారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గుర్తు పెట్టుకోవాలి. “ప్రస్తుత శతాబ్దం మీది కావచ్చు. కానీ 21వ శతాబ్దం మాత్రం భారతదేశాని కి చెందుతుంది” అని ఆయన అన్నారు. అందువల్ల ఆయన (స్వామి వివేకానంద) దార్శనికత నిజం అయ్యే వరకు మనం గట్టి గా కృషి చేస్తూనే ఉండాలి అని ప్రధాన మంత్రి తెలిపారు.
संस्कृति और साहित्य की तरंग और उमंग से भरे कोलकाता के इस वातावरण में आकर मन और मस्तिष्क आनंद से भर जाता है।
— PMO India (@PMOIndia) January 11, 2020
ये एक प्रकार से मेरे लिए खुद को तरोताज़ा करने का और बंगाल की वैभवशाली कला और सांस्कृतिक पहचान को नमन करने का अवसर है: PM @narendramodi
अभी जब प्रदर्शनी देखी, तो ऐसा लगा था जैसे मैं उन पलों को स्वयं जी रहा हूं जो उन महान चित्रकारों, कलाकारों, रंगकारों ने रचे हैं, जीए हैं।
— PMO India (@PMOIndia) January 11, 2020
बांग्लाभूमि की, बंगाल की मिट्टी की इस अद्भुत शक्ति, मोहित करने वाली महक को मैं नमन करता हूं: PM @narendramodi
भारत की कला, संस्कृति और अपनी हैरिटेज को 21वीं सदी के अनुसार संरक्षित करने और उनको Reinvent, Rebrand, Renovate और Rehouse करने का राष्ट्रव्यापी अभियान आज पश्चिम बंगाल से शुरु हो रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
केंद्र सरकार का ये प्रयास है कि भारत के सांस्कृतिक सामर्थ्य को दुनिया के सामने नए रंग-रूप में रखे, ताकि भारत दुनिया में हैरिटेज टूरिज्म का बड़ा सेंटर बनकर उभरे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
ये भी तय किया गया है कि देश के 5 Iconic Museums को International Standard का बनाया जाएगा। इसकी शुरुआत विश्व के सबसे पुराने म्यूजियम में से एक, Indian Museum Kolkata से की जा रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
बिप्लॉबी भारत नाम से म्यूज़ियम बने, जिसमें नेताजी सुभाषचंद्र बोस, ऑरबिंदो घोष, रास बिहारी बोस, खुदी राम बोस, देशबंधु, बाघा जतिन, बिनॉय, बादल, दिनेश, ऐसे हर महान सेनानी को यहां जगह मिलनी चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
जब आज़ाद हिंद सरकार के 75 वर्ष पूरे हुए तो लाल किले में ध्वजारोहण का सौभाग्य मुझे खुद मिला। नेताजी से जुड़ी फाइलों को सार्वजनिक करने की मांग भी बरसों से हो रही थी, जो अब पूरी हो चुकी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
अभी हम सभी ईश्वर चंद्र विद्यासागर जी की 200वीं जन्मजयंति मना रहे हैं। इसी तरह 2022 में जब भारत की आज़ादी के 75 वर्ष होंगे, तब एक और सुखद संयोग बन रहा है। साल 2022 में महान समाज सुधारक और शिक्षाविद राजा राममोहन राय की 250वीं जन्मजयंति आने वाली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
ये बहुत दुर्भाग्यपूर्ण रहा कि अंग्रेजी शासन के दौरान और स्वतंत्रता के बाद भी देश का जो इतिहास लिखा गया, उसमें इतिहास के कुछ अहम पक्षों को नजरअंदाज कर दिया गया: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
गुरुदेव ने अपने एक लेख में एक बहुत महत्वपूर्ण उदाहरण भी दिया था आंधी और तूफान का। उन्होंने लिखा था कि “चाहे जितना भी तूफान आए, उससे भी ज्यादा अहम होता है कि संकट के उस समय में, वहां के लोगों ने उस तूफान का सामना कैसे किया”: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
भारत को आदि शंकराचार्य, थिरुनावुक्कारासार जैसे कवि संतों का आशीर्वाद मिला। अंदाल, अक्का महादेवी, भगवान बशवेश्वर, गुरु नानक देव जी द्वारा दिखाया गया मार्ग, आज भी हमें प्रेरणा देता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2020
राजनीतिक और सैन्यशक्ति तो अस्थाई होती है, लेकिन कला और संस्कृति के जरिए जो जनभावनाएं अभिव्यक्त होती हैं, वो स्थाई होती हैं।
— PMO India (@PMOIndia) January 11, 2020
और इसलिए, अपने समृद्ध इतिहास को, अपनी धरोहर को संजोकर रखना, उनका संवर्धन करना भारत के लिए, हर भारतवासी के लिए बहुत महत्वपूर्ण है: PM @narendramodi
हम सभी को स्वामी विवेकानंद जी की वो बात हमेशा याद रखनी है, जो उन्होंने मिशिगन यूनिवर्सिटी में कुछ लोगों से संवाद के दौरान कही थी।
— PMO India (@PMOIndia) January 11, 2020
स्वामी विवेकानंद ने उन्हें कहा था- “अभी वर्तमान सदी भले ही आपकी है, लेकिन 21वीं सदी भारत की होगी”: PM @narendramodi