ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో గల ఇందిరాపురం లో నేడు జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల (సిఐఎస్ఎఫ్) 50వ స్థాపక దినోత్సవానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
సిఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కవాతు ను ప్రధాన మంత్రి సమీక్షించారు. విశిష్టమైనటువంటి మరియు ప్రతిభావంతమైనటువంటి సేవల ను అందించినందుకు గాను సేవా పతకాల ను ఆయన ప్రదానం చేశారు. అమరవీరుల స్మారకం వద్ద ఆయన పూల హారాన్ని సమర్పించారు; సందర్శకుల పుస్తకం లో ఆయన సంతకం చేశారు.
సిఐఎస్ఎఫ్ సిబ్బంది ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వర్ణోత్సవం జరుపుకొంటున్న దళాల ను అభినందించారు. దేశం లో ప్రధాన సంస్థ లను కాపాడటం లో సిఐఎస్ఎఫ్ యొక్క భూమిక ను ఆయన ప్రశంసించారు. ‘న్యూ ఇండియా’ కోసం నిర్మించిన ఆధునిక మౌలిక సదుపాయాల ను పరిరక్షించే బాధ్యత సిఐఎస్ఎఫ్ యొక్క సురక్షిత హస్తాల లో ఉన్నదని ఆయన చెప్పారు.
భద్రత సిబ్బంది కి సహకరించవలసింది గా పౌరుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. భద్రత సంబంధిత స్వరూపం లో విఐపి సంస్కృతి అడ్డంకు లను సృష్టిస్తోంది, కాబట్టి భద్రత దళాలకు పౌరులు సహకరించడం ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సిఐఎస్ఎఫ్ యొక్క విధుల ను మరియు పాత్ర ను గురించి సాధారణ ప్రజానీకం లో చైతన్యాన్ని ఏర్పరచడం కోసం సిఐఎస్ఎఫ్ యొక్క కృషి ని వివరిస్తూ విమానాశ్రయాల లో, మెట్రోల లో డిజిటల్ మ్యూజియమ్ లను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచన చేశారు.
దేశం లో ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల ను భద్రం గా ఉంచడం లో సిఐఎస్ఎఫ్ పోషిస్తున్న పాత్ర ను ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ, ఈ బలగం విపత్తు వేళల లో ప్రతిస్పందించడం లో కూడా పాలుపంచుకొంటోందని, మహిళ ల భద్రత కు ఈ దళం పూచీ పడుతోందని, ఇతర అనేక కార్యకలాపాల ను కూడా నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భం గా కేరళ వరదల లో మరియు నేపాల్ లో, ఇంకా హైతీ లో భూకంపాలప్పుడు సైతం సిఐఎస్ఎఫ్ చేపట్టిన సహాయక కార్యకలాపాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
భద్రత దళాల సురక్షత కు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. బలగాల ను ఆధునికీకరించడం కోసం మరియు వారి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి ఈ సందర్భం గా ఆయన ప్రస్తావించారు.
కర్తవ్యమే సాయుధ బలగాల కు పండుగ అని ప్రధాన మంత్రి తెలిపారు. ఉగ్రవాదం విసరుతున్న సవాళ్ళ కారణం గా సిఐఎస్ఎఫ్ యొక్క పాత్ర అధికం అయిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశ గా తన ప్రభుత్వం కంకణం కట్టుకొన్నదని ఆయన అన్నారు.
రక్షక భటులు మరియు అర్థ సైనిక బలగాల పరాక్రమాని కి మరియు వారు చేసినటువంటి త్యాగాల కు జాతీయ పోలీసు స్మారకం అంకితం చేయబడిందని ప్రధాన మంత్రి చెప్పారు. జాతీయ యుద్ధ స్మారకం మరియు జాతీయ పోలీసు స్మారకం ల వంటి కట్టడాలు భద్రత దళాల తోడ్పాటు కు సంబంధించి పౌరుల లో జాగృతి ని ఏర్పరుస్తున్నాయని ఆయన తెలిపారు. సిఐఎస్ఎఫ్ లోకి చాలా మంది మహిళా సైనికుల ను చేర్చుకోవడం కోసం ఆ దళం చేస్తున్నటువంటి ప్రయత్నాల ను ఆయన హర్షించారు.
భారతదేశం వృద్ధి చెందే తరుణం లో, సిఐఎస్ఎఫ్ యొక్క బాధ్యత లు మరియు భూమిక లు కూడా తదనుగుణం గా పెరగనున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
सुरक्षा और सेवा के भाव के साथ आप आगे बढ़ रहे हैं, वो बहुत महत्वपूर्ण है।
— PMO India (@PMOIndia) March 10, 2019
नए भारत के लिए इंफ्रास्ट्रक्चर तैयार किया जा रहा है,
पोर्ट बन रहे हैं,
एयरपोर्ट बन रहे हैं,
मेट्रो का विस्तार हो रहा है,
जो बड़े उद्योग लगाए जा रहे हैं, उनकी सुरक्षा की जिम्मेदारी आप सभी पर है: PM
आपदाओं की स्थिति में भी आपका योगदान हमेशा से सराहनीय रहा है।
— PMO India (@PMOIndia) March 10, 2019
केरल में आई भीषण बाढ़ में आपने राहत, बचाव के काम में दिन रात एक करके हजारों लोगों का जीवन बचाने में मदद की।
देश में ही नहीं विदेश में भी जब मानवता संकट में आई है तब CISF ने अपनी जिम्मेदारी बखूबी निभाई है: PM
गर्मी हो,
— PMO India (@PMOIndia) March 10, 2019
सर्दी हो,
बरसात हो,
आप अपने मोर्चे पर बिना विचलित हुए खड़े रहते हैं।
देश के लिए होली, दीवाली और ईद होती है, तमाम त्योहार होते हैं,
लेकिन आप सभी के लिए अपनी ड्यूटी ही त्योहार बन जाती है: PM
हमारे सुरक्षाकर्मी का परिवार भी तो बाकियों की तरह ही होता है।
— PMO India (@PMOIndia) March 10, 2019
उसके भी सपने हैं, आकाक्षाएं हैं।
उसकी भी शंकाएं, आशंकाएं होती हैं।
लेकिन राष्ट्र रक्षा का भाव जब मन में आ जाता है तो वो हर मुश्किल पर जीत हासिल कर लेता है: PM