భారతీయుల జీవనశైలిని సులభతరమైనదిగానూ మరియు సౌకర్యవంతమైనదిగానూ చేయాలన్న మా ప్రతిజ్ఞ గత 3 ఏళ్లలో మరింత బలపడింది: ప్రధాని మోదీ

భవిష్యత్ తరాల కోసం జీవితంలో 5 ‘E’లుండే ఒక వ్యవస్థను నిర్మిస్తాం,: ఈస్ ఆఫ్ లివింగ్ (జీవన సౌలభ్యత), ఎడ్యుకేషన్ (విద్య), ఎంప్లాయ్మెంట్ (వృత్తి), ఎకానమీ (ఆర్ధిక వ్యవస్థ) మరియు ఎంటర్టైన్మెంట్ (వినోదం) : ప్రధాని

2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఒక గృహాన్ని కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ అధ్యక్షుడు 'చౌకీదార్-భగదీర్' వ్యాఖ్యపై ప్రధాని మోదీ విరుచుకుపడుతూ, పేదలు పడుతున్న బాధలలో 'భాగాస్తుండనైనందుకు' నేను గర్వపడుతున్నానన్నారు

స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా, నవభారతదేశంలో కొత్త సవాళ్లను ఎదుర్కునేందుకు మన నగరాలను సిద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం: ప్రధాని

ఉత్తరప్రదేశ్లోని పూర్వ ప్రభుత్వాలు పేదలకు గృహాలకంటే సొంత బంగళాలకు ప్రాధాన్యతనిచ్చాయి: ప్రధాని మోదీ

ల‌క్నో , జూలై 28,2018ః ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ ఈరోజు న‌గ‌రాల ప‌రివ‌ర్త‌న ప‌థ‌కాల‌కు సంబంధించి ఏర్పాటు చేసిన‌ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు.

ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మాలైన‌ అట‌ల్ మిష‌న్ ఫ‌ర్ రెజువినేష‌న్ ఆఫ్ అర్బ‌న్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ (అమృత్‌), స్మార్ట్ సిటీస్ మిష‌న్‌,ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్‌యోజ‌న (అర్బ‌న్‌) వంటి మూడు న‌గ‌రాభివృద్ధి ప‌థ‌కాల‌ తృతీయ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

న‌గ‌రాభివృద్ధి ఫ్లాగ్‌షిప్ మిష‌న్‌ల‌పై ఏర్పాటైన ఎగ్జిబిష‌న్‌ను ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి , పిఎంఎవై(యు)కు సంబంధించి ప్ర‌తి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఒక ల‌బ్దిదారుతో మాట్లాడారు.

 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ న‌గ‌రాల‌నుంచి వీడియో లింక్ ద్వారా పిఎంఎవై ల‌బ్ధిదారుల‌ స్పంద‌న‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వివిధ ఫ్లాగ్‌షిప్ మిష‌న్‌ల కింద వివిధ ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ ఆయ‌న‌, ఈ స‌మావేశానికి హాజ‌రైన న‌గ‌ర పాల‌కులు న‌వ‌త‌రం, న‌వ‌భార‌త‌దేశం ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిబింబమ‌ని అన్నారు.

స్మార్ట్ సిటీ మిష‌న్ కింద రూ 7000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప్రాజెక్టులు పూర్త‌య్యాయ‌ని, మ‌రో 52,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప్రాజెక్టులు వివిధ ద‌శ‌ల‌లో అమ‌లులో ఉన్నాయ‌ని అన్నారు.ఈ కార్య‌క్ర‌మాలు దిగువ‌, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని ప‌ర‌స‌దుపాయాలు క‌ల్పించ‌నున్నాయ‌ని , త‌ద్వారా వారి జీవ‌నం మ‌రింత సుల‌భ‌త‌రం కానున్న‌ద‌ని చెప్పారు. స‌మీకృత క‌మాండ్ కేంద్రాలు ఈ మిష‌న్‌లో ముఖ్య‌మైన‌వ‌ని అన్నారు. ఈ కేంద్రాలు ఇప్ప‌టికే 11 న‌గ‌రాల‌లో ప‌నిచేయ‌డం ప్రారంభించాయ‌ని, మ‌రిన్ని న‌గ‌రాల‌లో ఇందుకు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు.

మాజీ ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారి వాజ్‌పేయి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, దేశంలోని న‌గ‌ర ముఖ‌చిత్రాన్ని మార్చివేయాల‌న్న దార్శ‌నిక‌త‌తో ల‌క్నో న‌గ‌రం స‌న్నిహితంగా ముడి ప‌డి ఉన్న‌ద‌ని,శ్రీ వాజ్‌పేయి ఈ న‌గ‌రానికి పార్ల‌మెంటు స‌భ్యుడిగా ప్రాతినిధ్యం వహించార‌ని ఆయ‌న గుర్తుచేశారు.

శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి తీసుకున్న ప‌లుచ‌ర్య‌ల‌ను ప్ర‌సంసించిన ప్ర‌ధాన‌మంత్రి, వారు తీసుకున్న చ‌ర్య‌ల స్ఫూర్తిని అలాగే ఉంచుతూ , ప్ర‌స్తుత అభివృద్ధి ప‌థ‌కాల‌ను మ‌రింత వేగంగా కొన‌సాగిస్తూ,ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. 2022 నాటికి ప్ర‌జ‌లంద‌రికీ గృహ‌వ‌స‌తి క‌ల్పించాల‌ని సంక‌ల్పించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన గ‌ణాంకాల‌ను వివ‌రిస్తూ ప్ర‌ధాని, ఈ దిశ‌గా జ‌రిగిన కృషిని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌స్తుతం నిర్మిస్తున్న ఇళ్ల‌లో టాయిలెట్ సౌక‌ర్యం, విద్యుత్ స‌దుఉపాయం ఉంటున్నాయ‌ని చెప్పారు. ఈ ఇళ్లు మ‌హిళా సాధికార‌త‌కు గుర్తుగా నిలుస్తున్నాయ‌ని, ఇవి మ‌హిళ‌ల పేరుమీదే రిజిస్ట‌ర్ అవుతున్నాయ‌ని చెప్పారు.

ఇటీవ‌లి విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తూ ప్ర‌ధాని, తాను పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, రైతులు, జ‌వాన్ల క‌ష్టాలు, బాధ‌ల‌లో పాలుపంచుకునే వ్య‌క్తిన‌ని, వారి బాధ‌లు పోగొట్టేందుకు నిర్ణ‌యాత్మ‌క చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు చెప్పారు.

భార‌త‌దేశంలో ఒక‌ప్పుడు ప‌క్కా ప్ర‌ణాళిక క‌లిగిన న‌గ‌రాలు ఉండేవ‌ని, కానీ స్వాతంత్ర్యానంత‌రం రాజ‌కీయ సంక‌ల్పం, స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌లు లేక‌పోవ‌డంతో న‌గ‌రాల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశం శ‌ర‌వేగంతో అభివృద్ధి చెందుతున్న‌ద‌ని, న‌గ‌రాలే దాని అభివృద్ధి కేంద్రాల‌ని ప్ర‌ధాని అన్నారు. అర‌కొర అభివృద్ధితో ఇవి ముందుకు పోజాల‌వ‌ని ఆయన చెప్పారు. 21వ శ‌తాబ్ద‌పు న‌వ‌భార‌త‌దేశ స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డానికి స్మార్ట్ సిటీ మిష‌న్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. నివాస‌ప్రాంతాల‌కు 5 ఇ- లు ఉండాల‌ని అన్నారు.అవి ఈజ్ ఆప్ లివింగ్‌, ఎడ్యుకేష‌న్‌, ఎంప్లాయిమెంట్‌, ఎకాన‌మీ, ఎన్‌ట‌ర్‌టైన్‌మెంట్ .

స్మార్ట్‌సిటీ మిష‌న్ పౌరుల ప్ర‌మేయం, పౌరుల ఆకాంక్ష‌లు, పౌరుల బాద్య‌త‌ ఆధారంగా రూపుదిద్దుకున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. పూణె,హైద‌రాబాద్‌, ఇండోర్ న‌గ‌రాలు మునిసిప‌ల్ బాండ్ల ద్వారా చెప్పుకోద‌గిన మొత్తాన్ని సేక‌రించాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ల‌క్నో, ఘ‌జియాబాద్‌లు త్వ‌ర‌లోనే ఈ మార్గంలో ప‌య‌నించ‌నున్నాయ‌న్నారు.పౌర సేవ‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వ‌స్తే అవినీతికి కార‌ణ‌మైన క్యూలు పోతాయ‌ని చెప్పారు. అంద‌మైన , భ‌ద్ర‌మైన‌, సుస్థిర‌మైన‌, పార‌దర్శ‌క వ్య‌వ‌స్థ‌లు కోట్లాది మంది ప్ర‌జ‌ల జీవితాల‌లో మార్పు తీసుకువ‌స్తున్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు.

 

 

  

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage