Vijaya Dashami is the festival of victory of truth over falsehood; and of defeating the oppressor: PM Modi
Terrorism is the enemy of humanity: PM Modi
The forces of humanity across the world must now unite against terrorism: PM Modi
PM Modi urges people to defeat the Ravana existing in the form of corruption, illiteracy and poverty

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు లక్నో లోని ఐశ్ బాగ్ రాంలీల మైదానంలో జరిగిన దసరా మహోత్సవంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు.

విజయ దశమి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పురాతన కాలం నుండి జరుగుతూ వస్తున్న రాంలీల సంప్రదాయంలో పాలుపంచుకొన్నందుకు తాను అదృష్టవంతుడినని ఆయన అన్నారు. అసత్యంపై సత్యం సాధించిన విజయాన్ని సూచించే మరియు పీడకుడిని ఓడించే ఉత్సవం రాం లీల అని ఆయన అభివర్ణించారు. ఏటా రావణుడిని దహనం చేస్తున్నట్లే, మనలోని, మన సమాజ వ్యవస్థలలోని మరియు మన దేశంలోని దుష్టత్వాలను తొలగించుకొంటామని మనమంతా సంకల్పించుకోవాలి అని ఆయన అన్నారు. ప్రజలు ప్రతి దసరా రోజున వారి లోపలి పది దోషాలను అంతం చేసుకొంటామంటూ నిశ్చయం చేసుకోవాలి అని ఆయన కోరారు. ఈ దుష్టత్వాలను తరిమికొట్టి, ఈ దేశాన్ని గొప్ప దేశంగా చేయడానికి ప్రయత్నించే శక్తి మన అందరిలోనూ ఉంది అని ఆయన చెప్పారు.

 

ఉగ్రవాదాన్ని మానవత్వానికి శత్రువుగా వర్ణించిన ప్రధాన మంత్రి, శ్రీరాముడు మానవాళిలోకెల్లా అత్యుత్తముడు; త్యాగానికి, సమర్పణ భావానికి ఆయన మూర్తీభవించిన సారాంశం అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపైన మొట్టమొదటగా పోరాడింది రామాయణంలో ఒక పాత్రధారి అయిన జటాయు అని ప్రధాన మంత్రి చెప్పారు. దేనికీ భయపడకూడదు అనే సందేశాన్ని జటాయు మనకు అందిస్తున్నట్లు ప్రధాన మంత్రి వివరించారు. ఉగ్రవాదంపై తలపడడంలో జటాయు వలెనే 125 కోట్ల మంది భారతీయులూ వ్యవహరించాలి అని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటే ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలను భగ్నం చేయగలం అని ఆయన చెప్పారు.

ప్రపంచం అంతటిలోని మానవత్వ శక్తులు ప్రస్తుతం ఉగ్రవాదంపైన పోరాడడానికి ఒక్కటి అయి తీరాలి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వారిని ఇక వదలివేయకూడదు అని ఆయన అన్నారు.

ప్రపంచం అంతటిలోని మానవత్వ శక్తులు ప్రస్తుతం ఉగ్రవాదంపైన పోరాడడానికి ఒక్కటి అయి తీరాలి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వారిని ఇక వదలివేయకూడదు అని ఆయన అన్నారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.