Shri Narendra Modi addresses a huge rally in Badaun, Uttar Pradesh
Our Govt is devoted to serve the poor, marginalized & farmers: PM Modi
What is the reason that fruits of development could not reach this land under SP, BSP?, asks Shri Modi
Why is it that even after 70 years of independence, 18,000 villages did not have electricity? Previous goverenments must answer: PM
We eliminated interview processes for class III & IV jobs. This has reduced corruption: PM

ఉత్తరప్రదేశ్ లో బదౌన్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ  నేడు ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూసిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లో మార్పు కావాలని స్పష్టమైనదని ప్రధాని మోదీ అన్నారు.

గత ప్రభుత్వాల గురించి ప్రధాని మాట్లాడుతూ, “నేను గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా నేను బదౌన్ గురించి విన్నాను. ఎస్పి మరియు బిఎస్పి అధికారంలో ఈ నెలకు అభివృద్ధి ఫలాలు అందకపోవడానికి కారణం ఏమిటి?” అని అన్నారు.

"పేదల, అట్టడుగు ప్రజల & రైతుల సేవకు మా ప్రభుత్వం కట్టుబడివుంది. వారి ఉన్నతికి మేము అనేక చర్యలు చేపట్టాము.” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించాడు

ప్రతిపక్షంపై ప్రధాని దాడిచేస్తూ,” " స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ల తరువాత కూడా, 18,000 గ్రామాలకు విద్యుత్ ఎందుకు లేదు." అని ప్రశ్నించారు. “బదౌన్ పరిసరాలలో 500 గ్రామాలకు ఇంకా విద్యుత్ సరఫరా లేదు. ఇప్పటివరకూ గత ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? వారు జవాబివ్వాలి.” అని కూడా అన్నారు.

రాష్ట్రంలోని ఎస్పి ప్రభుత్వం నేరస్తుల నుండి ఉత్తరప్రదేశ్ ప్రజలను రక్షించలేకపోయిందని ప్రధాని ఆరోపించారు. “ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ నేరస్తులుకు అండగా ఎందుకు నిలుస్తుంది?” అని ఆయన అన్నారు.

యుపిలో 3 ఎమ్మెల్సీ స్థానాలలో బిజెపి విజయం సాధించేలా మద్దతిచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “బిజెపికి మద్దతిచ్చి. మా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేలా చేసినందుకు ఉత్తర ప్రదేశ్ లోని ప్రతి వారికి ధన్యవాదాలు మరియు అభినందనలు.", అని ఆయన అన్నారు.

అవినీతి తగ్గించేందుకు ప్రభుత్వంలోని గ్రేడ్ 3 మరియు 4 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ తొలగించడానికి తన ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారుడు, "మేము III & IV తరగతి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియలు తొలగించాము. ఇది అవినీతిని తగ్గించింది." అని అన్నారు. " రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో యువత ఆకాంక్షలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆడుకుంది." అని వ్యాఖ్యానించారు.

ఎన్డిఎ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం అత్యంత ప్రాముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ. “మేము అనేకమందికి ఉపయోగపడేలా ఫసల్ బీమా యోజన తీసుకోచ్చాము అయితే ఎస్పీ ప్రభుత్వం ఈ పధకంను ఎందుకు అమలు చేయలేదు?”

ఈ కార్యక్రమంలో అనేకమంది బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays homage to Dr Harekrushna Mahatab on his 125th birth anniversary
November 22, 2024

The Prime Minister Shri Narendra Modi today hailed Dr. Harekrushna Mahatab Ji as a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. Paying homage on his 125th birth anniversary, Shri Modi reiterated the Government’s commitment to fulfilling Dr. Mahtab’s ideals.

Responding to a post on X by the President of India, he wrote:

“Dr. Harekrushna Mahatab Ji was a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. His contribution towards Odisha's development is particularly noteworthy. He was also a prolific thinker and intellectual. I pay homage to him on his 125th birth anniversary and reiterate our commitment to fulfilling his ideals.”