యువర్ ఎక్స్‌లన్సి ప్రెసిడెంట్ శ్రీ గోతాబయ రాజపక్ష,
శ్రీ లంక కు మరియు భారతదేశాని కి చెందిన చిరకాల అనుభవం కలిగిన అధికారులు,
మిత్రులారా,
ఆయుబోవన్.
వణక్కమ్.
నమస్కారాలు.
అధ్యక్షుడు శ్రీ గోతాబయ రాజపక్ష ను మరియు వారి ప్రతినిధి వర్గాన్ని భారతదేశాని కి ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఎన్నికల లో నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించినందుకు గాను అధ్యక్షుని కి నేను నా హృదయపూర్వకం గా అభినందనల ను తెలియ జేస్తున్నాను. శ్రీ లంక లో ఎన్నిక ల ప్రక్రియ సాఫీ గా సాగిపోయినందుకు శ్రీ లంక ప్రజల కు ఇవే నా అభినందన లు. శ్రీ లంక లో ప్రజాస్వామ్యం పరిణతి కి మరియు శక్తి కి ఇది ఒక గొప్ప సంతోషాన్ని అందించేటటువంటి అంశం గా ఉంది. అధ్యక్షుడు శ్రీ రాజపక్ష తన ఒకటో విదేశీ సందర్శన కై భారతదేశాన్ని ఎంపిక చేసుకోవడం మాకు ఒక గౌరవం గా ఉంది. అంతేకాదు ఆయన తన పదవీ బాధ్యతల ను స్వీకరించిన రెండు వారాల లోపే ఆయన కు భారతదేశం లోకి ఆహ్వానించే అవకాశం కూడా మాకు దక్కింది. ఇది శ్రీ లంక కు మరియు భారతదేశాని కి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాల యొక్క బలాని కి సంకేతం గా నిలుస్తోంది. అంతేకాకుండా ఈ సంబంధాల కు ఇరు దేశాలు కట్టబెట్టిన ప్రాముఖ్యం ఎంతటిదో అనేది కూడా ఈ ఘట్టం ప్రతిబింబిస్తోంది. ఉభయ దేశాల పురోగతి కోసం మరియు మన యావత్తు ఉమ్మడి ప్రాంతం యొక్క సమృద్ధి, శాంతి, మరియు భద్రత ల కోసం అధ్యక్షుడు శ్రీ రాజపక్ష తో కలసి సన్నిహితం గా కృషి చేసేందుకు మేము ఎదురుచూస్తున్నాము.
ఎక్స్‌లన్సి,
ఒక వ్యవస్థీకృతమైనటు వంటి, బలమైనటువంటి మరియు సమృద్ధమైనటువంటి శ్రీ లంక ఆవిష్కారం కోసం శ్రీ లంక ప్రజలు పెట్టుకొన్న ఆకాంక్షల ను మీకు లభించిన ప్రజాతీర్పు వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భం లో శ్రీ లంక కు భారతదేశం యొక్క శుభాకాంక్షలు మరియు సహకారం ఎల్లప్పటి కి లభిస్తాయి. ఒక నిలుకడతనం కలిగినటువంటి, భద్రమైనటువంటి మరియు సౌభాగ్యవంతమైనటువంటి శ్రీ లంక ఆవిష్కారం ఒక్క భారతదేశం ప్రయోజనాల కే కాదు యావత్తు హిందూ మహాసముద్ర ప్రాంతం తాలూకు ప్రయోజనాల కు కూడాను ఎంతో మంచిది.
మిత్రులారా,
భారతదేశం, శ్రీ లంక కు అత్యంత చేరువ లో ఉన్నటువంటి సముద్ర సంబంధ పొరుగు దేశం మాత్రమే కాదు ఒక విశ్వసనీయ మిత్ర దేశం గా కూడా ఉంది. మన మధ్య నెలకొన్న చరిత్రాత్మకమైన, జాతుల పరమైన, భాషా పరమైన, సంస్కృతి పరమైన మరియు నాగరకత పరమైన సంబంధాలు రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల కు ఒక బలమైన పునాది గా నిలచాయి.
నా ప్రభుత్వం అమలు పరుస్తున్న ‘‘నైబర్ హుడ్ ఫస్ట్’’ పాలిసి మరియు ఎస్ఎజిఎఆర్ (‘సాగర్’) సిద్ధాంతాని కి అనుగుణం గా మేము శ్రీ లంక తో మా సంబంధాల ను ప్రాథమ్యీకరించుకొన్నాము. మన రెండు దేశాల భద్రత మరియు అభివృద్ధి ఒకదానితో ఒకటి విడదీయలేనివి గా ఉన్నాయి. ఈ కారణం గా మనం మన భద్రత మరియు సంవేదనశీలత్వాల పట్ల చేతన తో ఉండటం అనేది స్వాభావికం.
పరస్పర హితం ముడివడ్డ ద్వైపాక్షిక సంబంధాలు మరియు అంతర్జాతీయ వ్యవహారాల పై ఈ రోజు న అధ్యక్షుడు మరియు నేను చాలా మంచిదైన మరియు ఫలప్రదమైన చర్చ ను జరిపాము. రెండు దేశాల మధ్య బహుముఖీన భాగస్వామ్యాన్ని మరియు సహకారాన్ని బలపరచాలని మేము ఇరువురమూ నిర్ణయించాము. శ్రీ లంక తో ఒక అభివృద్ధి ప్రధానమైనటువంటి భాగస్వామ్యాని కి భారతదేశం కట్టుబడి ఉంటుందని నేను అధ్యక్షుని కి భరోసా ను ఇచ్చాను. ఎప్పటి మాదిరి గానే ఈ సహకారం శ్రీ లంక ప్రజల ప్రాథమ్యాల కు అనుగుణం గా ఉంటుంది. 400 మిలియన్ డాలర్ విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ శ్రీ లంక లో మౌలిక సదుపాయాల కల్పన కు మరియు అభివృద్ధి కి ఒక ఉత్తేజాన్నిఇవ్వనుంది. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇరు దేశాల మధ్య పరస్పర హితం తో కూడిన పథకాల సంబంధిత సహకారాన్ని కూడా వేగవంతం చేయనున్న కారణం గా కూడాను శ్రీ లంక ఆర్థిక వ్యవస్థ లాభపడుతుందన్న విశ్వాసం నాలో ఉంది. శ్రీ లంక లోని ఉత్తర ప్రావిన్సు లో, తూర్పు ప్రావిన్సు లో నిరాశ్రయులైన వారి కి 46,000 గృహాల ను ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టు లో భాగం గా నిర్మించడం జరిగింది. అప్-కంట్రీ రీజియన్ లో భారతీయ మూలాలు కలిగిన తమిళుల కోసం 14,000 ఇళ్ళ నిర్మాణం లో చక్కని పురోగతి కనుపిస్తున్నది. శ్రీ లంక లో సౌర పథకాల కోసం ఇది వరకు ప్రకటించిన 100 మిలియన్ క్రెడిట్ లైన్ ను త్వరిత గతి న వినియోగించుకోవడాని కి మేము సమ్మతి ని వ్యక్తం చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. మౌలిక సదుపాయాల కల్పన కు మరియు విద్య కు గ్రాంటు ల ఆధారం గా శ్రీ లంక లో అంతర ప్రజా ప్రధానమైన పథకాలు మరియు 20 కమ్యూనిటీ డివెలప్‌మెంట్ ప్రాజెక్టు లకు సంబంధించి అధ్యక్షుని కి మరియు నాకు మధ్య ఒక చక్కని చర్చ చోటు చేసుకొంది.
మిత్రులారా,
భారతదేశం ఉగ్రవాదాన్ని దాని యొక్క అన్ని రూపాల లోను సదా వ్యతిరేకిస్తూ వచ్చింది. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదం సహా ఉగ్రవాదాని కి సంబంధించిన ఇతర రూపాలు అన్నిటి పైనా అంతర్జాతీయ సముదాయం చర్యలు తీసుకోవాలని కూడా భారతదేశం కోరుతున్నది. ఈ సంవత్సరం లో ఈస్టర్ సందర్భం లో శ్రీ లంక లో ఉగ్రవాదులు పూర్తి మానవ జాతి వివిధత్వం మరియు సహజీవనం యొక్క విలువైన వారసత్వం పై దారుణమైన దాడుల కు దిగారు. ఉగ్రవాద శక్తులు మరియు తీవ్రవాద శక్తుల కు వ్యతిరేకం గా శ్రీ లంక సలుపుతున్న పోరాటాని కి భారతదేశం అచంచలమైన మద్ధతు ను అందిస్తుందని తెలియ జేయడం కోసం – భారతదేశం లో ఎన్నికలు పూర్తి అయిన వెను వెంటనే- నేను శ్రీ లంక ను సందర్శించాను. ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు మరియు పరస్పర భద్రత కోసం అన్ని విషయాల ను అధ్యక్షుడు శ్రీ రాజపక్ష తో నేను కూలంకషం గా చర్చించాను. భారతదేశం లోని ప్రధాన సంస్థల లో శ్రీ లంక కు చెందిన పోలీసు అధికారులు ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ తాలూకు లబ్ధి ని ఈసరికే అందుకొంటున్నారు. ఉగ్రవాదం పై పోరాడటం కోసం శ్రీ లంక కు 50 మిలియన్ డాలర్ల తో ఒక ప్రత్యేకమైన లైన్ ఆఫ్ క్రెడిట్ ను ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషం గా ఉంది.
మిత్రులారా,
మత్స్యకారుల జీవనోపాధి పై ప్రభావం చూపుతున్న అంశాలు కూడా చర్చించడమైంది. ఈ అంశం లో మేము మానవీయమైనటువంటి మరియు నిర్మాణాత్మకమైనటువంటి దృష్టికోణాన్ని అనుసరించడాన్ని కొనసాగిస్తామని మా యొక్క అంగీకారాన్ని తెలిపాము.
మిత్రులారా,
శ్రీ లంక లో రాజీ పై మేము ఎటువంటి దాపరికానికి తావు ఇవ్వకుండా మా అభిప్రాయాల ను ఒకరి కి మరొకరం వెల్లడించుకొన్నాము. అధ్యక్షుడు శ్రీ రాజపక్ష జాతుల సామరస్యం పట్ల తన సమ్మిళిత రాజకీయ దృష్టికోణాన్ని గురించి నాతో చెప్పారు. సమానత్వం, న్యాయం, శాంతి, ఇంకా గౌరవాల కోసం తమిళులు పెట్టుకొన్న ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం శ్రీ లంక ప్రభుత్వం రాజీ ప్రక్రియ ను ముందుకు తీసుకు పోతుందన్న విశ్వాసం నాలో ఉంది. దీని లో 13వ సవరణ ను అమలు లోకి తీసుకు రావడం కూడా ఒక భాగం గా ఉంది. ఉత్తర ప్రాంతాలు మరియు తూర్పు ప్రాంతాలు సహా శ్రీ లంక అంతటా అభివృద్ధి చోటు చేసుకోవడం లో భారతదేశం ఒక విశ్వసనీయ భాగస్వామి గా ఉంటుంది.
మిత్రులారా,
అధ్యక్షుడు శ్రీ రాజపక్ష కు నేను మరొక్క మారు భారతదేశం లోకి స్వాగతం పలుకుతున్నాను. ఆయన యాత్ర తో మన పరస్పర సంబంధాల కు మరింత బలం అందగలదు. మరి మన సహకారం రెండు దేశాల లో అభివృద్ధి తో పాటు ఈ ప్రాంతం లో సమృద్ధి కి, శాంతి కి మరియు స్థిరత్వాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వగలదు.
బొహొమా-స్థుతి.
నండ్రి.
మీకు ధన్యవాదాలు.
चुनाव में निर्णायक जीत के लिए मैं राष्ट्रपति गोठाभय राजपक्ष को हार्दिक बधाई देता हूं। चुनाव प्रक्रिया सुचारु रूप से संपन्न हुई, इसके लिए मैं श्रीलंका की जनता को बधाई देता हूँ। श्रीलंका में लोकतंत्र की मजबूती और परिपक्वता बहुत गर्व और खुशी का विषय है: PM @narendramodi pic.twitter.com/SpaTrgVOLU
— PMO India (@PMOIndia) November 29, 2019
यह हमारे लिए सम्मान की बात है कि राष्ट्रपति राजपक्ष ने अपनी पहली विदेश यात्रा के लिए भारत को चुना और पद संभालने के दो हफ्ते के भीतर भारत में हमें उनका सम्मान करने का मौका दिया: PM @narendramodi pic.twitter.com/6LsaUWxZ5f
— PMO India (@PMOIndia) November 29, 2019
आपको प्राप्त जनादेश एक संगठित, मजबूत और समृद्ध श्रीलंका के लिए श्रीलंका के लोगों की आकांक्षाओं को अभिव्यक्त करता है। इस संबंध में भारत की शुभेच्छा और सहयोग हमेशा श्रीलंका के साथ है: PM @narendramodi pic.twitter.com/FcxArH7NUJ
— PMO India (@PMOIndia) November 29, 2019
आपसी सुरक्षा के लिए और आतंकवाद के विरुद्ध आपसी सहयोग को और मजबूत करने पर मैंने राष्ट्रपति राजपक्ष के साथ विस्तार से चर्चा की है। प्रमुख भारतीय संस्थानों में श्रीलंका के पुलिस अधिकारी counter terrorist training प्राप्त कर रहे हैं: PM @narendramodi pic.twitter.com/PdoaC9LR8F
— PMO India (@PMOIndia) November 29, 2019
मछुवारों की आजीविका को प्रभावित करने वाले मुद्दों पर भी चर्चा की। हमारे बीच सहमति है कि हम इस मामले में रचनात्मक और मानवीय दृष्टिकोण जारी रखेंगे: PM @narendramodi pic.twitter.com/v1SlH3yjn7
— PMO India (@PMOIndia) November 29, 2019
मुझे विश्वास है कि श्रीलंका सरकार तमिलों की समानता, न्याय, शांति और सम्मान की आकांक्षाओं को पूरा करने के लिए, reconciliation की प्रक्रिया को आगे बढ़ाएगी: PM @narendramodi pic.twitter.com/186Whcav0H
— PMO India (@PMOIndia) November 29, 2019