PM Narendra Modi address public meeting in Meerut
Our Government is trying everything possible for progress of Uttar Pradesh: PM Modi
Shri Modi attacks Congress for allying with Samajwadi party
This election is about UP’s fight against SCAM - Samajwadi Party, Congress, Akhilesh Yadav and Mayawati, says Shri Modi

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో భారీ బహిరంగ సభలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో శ్రీ మోదీ “1857 లో, బ్రిటిష్ తో పోరాడటానికి మొదటి స్వాతంత్ర్య పోరాటం మీరట్ నుండే మొదలైంది మరియు ఇప్పుడు పేదరికానికి వ్యతిరేక యుద్ధం ఇక్కడ నుండే ప్రారంభమౌతుంది.” ఉత్తరప్రదేశ్ అదృష్టాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని శ్రీ మోదీ ప్రజలను కోరారు.

రాష్ట్రంలోని యువత గురించి బిజెపి ఆందోళన చెందుతుంది మరియు వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి కోరుకుంటుందాని ప్రధాని మోదీ అన్నారు. “ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి సాధ్యం ప్రతిదీ మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే చాలా చేశాము కానీ నేను పురోగతి కొత్త ఎత్తులు తాకే రాష్ట్రంకోసం మరింత పనిచేయాలనుకుంటున్నాను.”

ఉత్తరప్రదేశ్లో నేరస్థులకు చట్టం అంటే భయం లేదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “అమాయక పౌరులు ఎందుకు హత్య చేయబడుతున్నారు? అమాయక వ్యాపారులు ఎందుకు హత్య చేయబడుతున్నారు?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ శ్రీ మోదీ, " కాంగ్రెస్ ప్రతి గ్రామానికి వెళ్లి, ఉత్తరప్రదేశ్ లూటీ ఎంత చేయబడిందో చెబుతుండేవారని, వారు సమాజ్వాది పార్టీనీ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా చేశారని, కాని ఒక్కసారిగా ఏమైందో తెలియదు అకస్మాత్తుగా కాంగ్రెస్ ఎస్పిలు మిత్రపక్షాలుగా మారిపోయాయని” అన్నారు.

స్కాంపై ఉత్తరప్రదేశ్ పోరాడే సమయం వచ్చిందని శ్రీ మోదీ అన్నారు. స్కాం అంటే సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్ మరియు మాయావతి. “ఇది స్కాంకు వ్యతిరేకంగా పోరాటం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలు స్కాం కావాలో లేదా అభివృద్ధికి కట్టుబడిన బీజేపి కావాలో తేల్చుకోవాలి. ఉత్తర ప్రదేశ్ కోసం సాధ్యం అయ్యే ప్రతిదీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.” అని  కూడా అన్నారు.

ప్రజల ఆరోగ్య బద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించడంలేదని కూడా ప్రధాని ఆరోపించారు. “కేంద్రం ఆరోగ్య నిధులు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకోసం అది ఖర్చు చేయలేదు. అభివృద్ధి పనులు మరియు ఆరోగ్యనిధులు ప్రజలకు అందకుండా చేసేలా మీకు ఏ రాజకీయాలు మార్గనిర్దేశం చేశాయి?” అని ప్రధాని అన్నారు.

చెరుకు రైతుల సంక్షేమ చర్యలు మరియు మాజీ సైనికులకు ఒక రాంక్ వన్ పెన్షన్ పథకం అమలు గురించి కూడా ప్రధాని మాట్లాడారు. నోట్ల చలామణి రద్దు గురించి దాని తరువాత ప్రజలు పడుతున్న ఇక్కట్లు గురించి శ్రీ మోదీ మాట్లాడారు. “నవంబర్ 8న నేను తీసుకున్న నిర్ణయం, దోపిడిదారులను నచ్చదని మరియు ననకు వ్యతిరేకంగా చేతులు కలుపుతారని నాకు తెలుసు. కానీ నేను అవినీతి, నల్లధనం వంటి దుశ్చర్యలపై పోరాటంచేస్తూనే వుంటాను.” అని కూడా అన్నారు.

ఈ కార్యక్రమంలో అనేకమంది బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.