రాష్ట్రీయ ఏక‌తా దివ‌స్ సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న కేవడియా లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వ‌ద్ద 430 మంది సివిల్ స‌ర్వీసు ప్రబేశన‌ర్ లు, అధికారులు మరియు ఇత‌రుల‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అంత‌క్రితం ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన ప్రబేశన‌ర్ లు వ్య‌వ‌సాయం, గ్రామీణసాధికార‌త‌; ఆరోగ్య సంరక్ష‌ణ‌ లో సంస్క‌ర‌ణ‌లు, విధాన రూప‌క‌ల్ప‌న‌; సుస్థిర గ్రామీణ యాజ‌మాన్య మెలకువ లు; స‌మ్మిళిత ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌; మరియు విద్య రంగం యొక్క భవిష్యత్తు ల వంటి అయిదు ఇతివృత్తాల‌ పై తమ తమ ప్ర‌జంటేశన్ ల ను ఇచ్చారు.

ప్ర‌ధాన‌ మంత్రి తన ప్రసంగం లో, దేశం లో వివిధ సివిల్ స‌ర్వీసుల‌ కు ఈ త‌ర‌హా ఫౌండేశన్ కోర్సు ఉండటం భార‌త‌దేశం లో సివిల్ స‌ర్వీసుల లో నూతన అధ్యాయాని కి శ్రీకారం చుట్టటం వంటిది అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు మసూరీ, హైద‌రాబాద్‌, ఇత‌ర ప్రాంతాల‌ లో మీరు శిక్ష‌ణ తీసుకున్నారు. నేను ఇంత‌కు ముందే చెప్పిన‌ట్టు, అధికార యంత్రాంగం ఎలా ప‌ని చేస్తుందో అటువంటి వ్య‌వ‌స్థ‌ లోకి మిమ్మ‌ల‌ను మీ శిక్ష‌ణ స‌మ‌యం లోనే ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రుగుతున్న‌ది.

ఈ కృషి ని అభినందిస్తూ ప్ర‌ధాన‌ మంత్రి, “ సివిల్ స‌ర్వీసు ల వాస్త‌వ స‌మైక్య‌త మీ అంద‌రి తో ఇప్పుడు ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రుగుతున్న‌ది. ఈ ఆరంభం దానిక‌దే ఒక సంస్క‌ర‌ణ‌. ఈ సంస్క‌ర‌ణ శిక్ష‌ణ‌ లో సమైక్య‌త‌ కు మాత్ర‌మే ప‌రిమితం కాదు; ఇది చూసే దృష్టి కోణాన్ని, వైఖ‌రి ని విస్తృతం చేసేది గా ఉండాలి. అలాగే ఎన్నో విష‌యాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉండాలి. ఇదీ సివిల్ స‌ర్వీసు ల స‌మైక్య‌త‌. ఈ ఆరంభం మీతో జ‌రుగుతోంది.” అన్నారు. అలాగే ఇందులో భాగం గా ఆఫీస‌ర్ ట్రైనీల ను ఆర్థిక‌, సామాజిక రంగాల‌ కు చెందిన ప్ర‌పంచ నాయ‌కుల‌ తో , నిపుణుల‌ తో చర్చించే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డం జ‌రిగింది.

జాతి నిర్మాణం లో సివిల్ స‌ర్వీసుల‌ ను ప్ర‌ధాన ఉప‌క‌ర‌ణం గా చేయాల‌న్న‌ది స‌ర్ దార్‌ వ‌ల్ల‌భ్ భాయి ప‌టేల్ యొక్క దార్శ‌నిక‌త అని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

“అన్ని సివిల్ స‌ర్వీసుల‌ ను దేశ నిర్మాణం లో, ప్ర‌గతి లో ప్ర‌ధాన భూమి క‌గా మ‌ల‌చాల‌న్న‌ది స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయి ప‌టేల్ గారి దార్శ‌నిక‌త గా ఉండేది. ఈ దార్శ‌నిక‌త‌ ను సాకారం చేయ‌డానికి స‌ర్దార్ ప‌టేల్ ఎన్నో స‌వాళ్ల‌ ను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది.

స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేయ‌డం లో ప్ర‌ధానమైనటువంటి పాత్ర ను పోషించిన అధికారుల‌ ను దేశ అభివృద్ధి కి ఉప‌యోగించుకోవ‌డ‌ం ఎలాగ అన్న స‌హ‌జ‌మైన భావ‌న‌ అప్ప‌ట్లో చాలా మంది లో ఉండేది. అయితే స‌ర్ దార్ ప‌టేల్‌ ఒక దార్శ‌నిక‌త‌ తో వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం ఉంచి, ఈ వ్య‌వ‌స్థ‌ కు దేశాన్ని ముందుకు తీసుకుపోగ‌లిగిన సామ‌ర్ధ్యం ఉంద‌ని భావించారు”.

“అదే అధికారిగణం సంస్థానాల‌ ను దేశం లో విలీనం చేయ‌డానికి స‌హాయ‌ప‌డింది” అన్నారు.

సామాన్యుడి జీవితం లో మార్పు ను తీసుకు రావ‌డానికి స‌ర్ దా
ర్ ప‌టేల్ చాలా సంద‌ర్భాల‌ లో ఎటువంటి దృఢ దీక్ష‌ ను, ప‌ట్టుద‌ల ను ప్ర‌ద‌ర్శించారో ప్రబేశన‌ర్ లకు ప్ర‌ధాన మంత్రి తెలియ‌జేశారు.

స‌ర్ దార్ వ‌ల్ల‌భ్‌ భాయి ప‌టేల్ యొక్క సమ‌ర్థ‌త ను గురించి ఆయన ప్ర‌స్తావిస్తూ, “వంద సంవ‌త్స‌రాల క్రిత‌మే ఆయ‌న అహమదాబాద్ మ్యూనిసిపాలిటి లో సంస్క‌ర‌ణ‌ల ను తీసుకు వ‌చ్చారు. ప‌రిమిత వ‌న‌రుల‌ తో ప‌ది సంవత్సరాల లో ఆయ‌న త‌న స‌మ‌ర్ధ‌త ఏమిటన్నది రుజువు చేశారు అన్నారు. ఈ దార్శ‌నిక‌త‌ తోనే స‌ర్ దార్‌ పటేల్ స్వ‌తంత్ర భార‌త దేశం లో సివిల్ స‌ర్వీసుల‌ కు ఒక రూపం తెచ్చారు’’ అన్నారు.

నిష్ఫాక్షికం గా, నిజ‌మైన నిస్వార్థ స్ఫూర్తి తో త‌మ ప్ర‌తి ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగించాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రబేశన‌ర్ లను కోరారు.

నిష్ప‌క్ష‌పాతం గా, నిస్వార్థం గా సాగించే ప్ర‌తి ప్ర‌య‌త్న‌మూ నూతన భారతదేశాని కి బ‌ల‌మైన పునాది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

“నూతన భార‌తదేశ దార్శ‌నిక‌త‌ ను, స్వప్నాల ను సాకారం చేయ‌డానికి మ‌న అధికారి గణాని కి 21వ శ‌తాబ్ద‌పు ఆలోచ‌న , వైఖ‌రి ఉండాలి. మ‌న‌కు సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన నిర్మాణాత్మ‌క‌మైన, స‌రిక్రొత్తవైన ఆలోచ‌న‌లు క‌లిగిన అధికారి గణం అవ‌స‌రం. సానుకూల‌మైనటువంటి, విన‌మ్ర‌త‌ తో కూడిన‌టువంటి, వృత్తిప‌ర‌మైనటువంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన, ప్ర‌గ‌తిదాయ‌క‌మైన, ఉత్సాహ‌వంత‌మైన‌, స‌మ‌ర్ధ‌మైన‌, చురుకైన , పార‌ద‌ర్శ‌క‌మైన‌, సాంకేతిక నైపుణ్యాల‌ ను అంది పుచ్చుకొన్న బ్యూరోక్ర‌సి అవ‌స‌రం” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

రోడ్లు, వాహ‌నాలు, టెలిఫోన్ లు, రైల్వేలు, ఆసుపత్రులు, పాఠ‌శాల‌ లు, క‌ళాశాల‌ ల వంటి వాటి కొర‌త ఉన్న‌ప్ప‌టి కి చాలా మంది సీనియ‌ర్ బ్యూరోక్రట్ లు ఎంతో సాధించ‌గ‌ల‌రు అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

“కానీ ఇవాళ ప‌రిస్థితి అలా లేదు. భారతదేశం అద్భుత‌మైన అభివృద్ధి ని సాధిస్తున్న‌ది. మ‌న‌కు అపార‌మైన యువ శ‌క్తి ఉంది. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉంది; ఆహార వ‌న‌రుల‌ కొర‌త లేదు. ఇప్పుడు మీకు ఎన్నో అవ‌కాశాలు, బాధ్య‌త‌ లు ఉన్నాయి. మీరు భారతదేశం యొక్క సామ‌ర్ధ్యాన్ని పెంపొందించాలి. దాని సుస్థిర‌త‌ ను బ‌లోపేతం చేయాలి” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్రబేశనర్ లు దేశ సేవ‌ కు త‌మ‌ను తాము అంకితం చేసుకోవాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి పిలుపునిచ్చారు.

“మీరు కేవ‌లం ఒక ఉద్యోగం కోసం ఈ బాట‌ లోకి రాలేదు. . సేవా ప‌ర‌మో ధ‌ర్మ అన్న‌ది మీ మంత్రం కావాలి. సేవ చేయ‌డం కోసం మీరు ఈ మార్గం లోకి వ‌చ్చారు” అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

“మీ ప్ర‌తి చ‌ర్య‌, మీ యొక్క సంత‌కం ల‌క్ష‌లాది మంది యొక్క జీవితాల‌ ను ప్ర‌భావితం చేస్తుంది. మీ యొక్క నిర్ణ‌యం స్థానికం గాని లేదా ప్రాంతీయం గాని కావ‌చ్చు; కానీ, దాని దృష్టి కోణం మాత్రం జాతీయ‌ స్థాయి ని క‌లిగి వుండాలి. ఎల్ల‌ప్పుడూ మీరు, మీ నిర్ణ‌యం దేశాన్ని ఎలా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది ఆలోచించాలి..”

“మీ నిర్ణ‌యం సదా రెండు మౌలిక సూత్రాల‌ పైన ఆధార‌ప‌డి వుండాలి. అందులో ఒక‌టోది గాంధీ మహాత్ముడు ప్ర‌వ‌చించిన సూత్రం. అందులో వారు అంటారు.. మీ నిర్ణ‌యం స‌మాజం లో అట్ట‌డుగున ఉన్న చిట్ట‌చివ‌రి వ్య‌క్తి కి ఏ ప్ర‌యోజ‌నాన్నైనా క‌లిగించేది గా ఉండాలి అని. ఇక రెండోది, మ‌న నిర్ణ‌యాలు దేశ స‌మైక్య‌త‌ ను, దేశ సుస్థిర‌త‌ ను బ‌లోపేతం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డాలి” అని ప్ర‌ధాన‌ మంత్రి సూచించారు. దేశం లో 100కు పైగా గ‌ల ఆకాంక్షభరిత జిల్లాలు అన్ని రంగాల‌ లో ఎంతో కాలం నిర్ల‌క్ష్యాని కి గురి కావ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ, అవి ఏ ర‌కం గా గ‌తం లో నిరాశ లోకి జారిపోయిందీ ప్ర‌స్తావించారు.

“వంద‌ కు పైగా జిల్లాలు అభివృద్ధి ప‌రుగు లో వెనుక‌బ‌డి పోయాయి. ఇప్పుడు అవి ఆకాంక్షభరిత జిల్లాలు గా ఉన్నాయి. అన్నిద‌శ‌ల‌ లో అవి నిర్ల‌క్ష్యానికి గురి అయ్యాయి. దీని తో గ‌తం లో దేశం లో నిరాశమయ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇప్పుడు వాటి అభివృద్ధి కష్టం తో కూడుకొన్న‌ది. మేము ప్ర‌స్తుతం మాన‌వ అభివృద్ధి సూచిక‌ కు సంబంధించిన ప్ర‌తి అంశం లో పైకి తీసుకు రావ‌డానికి కృషి చేస్తున్నాము. సాంకేతికత స‌హాయం తో ప్ర‌తి విధాన నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాము. ఇప్పుడు మీరు దీని పై క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. మ‌నం ఈ ఆకాంక్షభరిత జిల్లాల‌ ను అభివృద్ది చేయాలి.’’

ప్రబేశనర్ లు ఒక స‌మ‌స్య‌ పైనే దృష్టి సారించి దానికి సంబంధించిన పూర్తి ప‌రిష్కారాల ను క‌నుగొనాల‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌ లో విశ్వాసం పెరిగి వారి భాగ‌స్వామ్యం అధికం అవుతుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

“మ‌న ఉత్సాహం, ఆత్రుత కొద్దీ మ‌నం చాలా విష‌యాల‌ పై ప‌ని చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తాము. దీని వ‌ల్ల మ‌న వ‌న‌రులు బ‌ల‌హీన‌ప‌డ‌తాయి. దీనికి బ‌దులు గా ఒక అంశం పై శ్ర‌ద్ధ‌ వహించి, దానికి ప‌రిష్కారాన్ని క‌నుగొనండి. ఒక జిల్లా, ఒక‌ స‌మ‌స్య- దానికి సంపూర్ణ ప‌రిష్కారం. దీనితో ఒక స‌మ‌స్య‌ కు పూర్తి ప‌రిష్కారం దొరుకుతుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. ప్ర‌జ‌ల విశ్వాస‌మూ పెరుగుతుంది. ఫ‌లితం గా వివిధ కార్య‌క్ర‌మాల‌ లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం వృద్ధి చెందడానికి దోహ‌ద‌ప‌డుతుంది.”

యువ ప్రబేశన‌ర్ లు మంచి ఉద్దేశం తో ప‌ని చేయాల‌ని, ప్ర‌జ‌ల‌ కు అందుబాటు లో ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి వారి ని కోరారు.

“మీరు క‌ఠిన వైఖ‌రి కి బ‌దులు సానుకూల వైఖ‌రి ని ప్ర‌ద‌ర్శించాలి. మీరు ప్ర‌జ‌ల‌ కు అందుబాటు లో ఉండాలి. మీరు మంచి ఉద్దేశం తో ప‌నిచేయాలి. అన్ని స‌మ‌స్య‌ల‌ కు మీ వ‌ద్ద ప‌రిష్కారాలు ఉండ‌క‌పోవ‌చ్చు; కానీ, క‌నీసం ప్ర‌జ‌లు చెప్పేది విన‌గ‌లిగివుండాలి. ఈ దేశం లో సామాన్యుడు చాలా సంద‌ర్భాల‌ లో త‌న స‌మ‌స్య‌ ను సానుకూలంగా వింటే చాలు, సంతృప్తి చెందుతున్నాడు. వారు గౌర‌వాన్ని , మ‌ర్యాద‌ ను, త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డానికి స‌రైన వేదిక‌ ను కోరుకొంటున్నారు” అని ఆయ‌న ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌జ‌ల‌ నుండి ప్ర‌తిస్పంద‌న‌ ను తెలుసుకొనేందుకు స‌రైన విధానాల‌ ను ఏర్పాటు చేసుకోవాల‌ని, అది స‌రైన నిర్ణ‌యాల ను తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి వారికి సూచించారు. “ఏ వ్య‌వ‌స్థ‌ లో అయినా, ఏ పాల‌నా యంత్రాంగ‌ం లో అయినా స‌మ‌ర్ధం గా ప‌నిచేయాలంటే అందుకు స‌రైన రీతి లో ప్ర‌తిస్పంద‌న ను తెలుసుకొనేందుకు ఏర్పాటు ఉండాలి. మీ ప్ర‌త్య‌ర్థుల‌ నుండి కూడా ప్ర‌తిస్పంద‌న ను తెలుసుకొనే ఏర్పాటు ఉండాలి. ఇది మీ దృష్టికోణాన్ని మ‌రింత విస్తృతం చేస్తుంది. ఆ ర‌కం గా సంస్క‌ర‌ణ‌ల‌ కు స‌హాయ‌ప‌డుతుంద‌”ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

సివిల్ స‌ర్వీస్ ప్రబేశన‌ర్ లు, సాంకేతిక ప‌రిష్కారాల ను క‌నుగొంటూ ప‌నిచేయాల‌ని, ఆ ర‌కం గా దేశం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా మారేందుకు కృషి చేయాల‌ని వారికి పిలుపునిచ్చారు.

సివిల్ స‌ర్వీసు ప్రబేశనర్ లు అంత‌కుముందు విడి గా ప్ర‌ధాన‌ మంత్రి తో భేటీ అయ్యి, వ్య‌వ‌సాయం, గ్రామీణ సాధికారిత‌, ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు, విధాన రూప‌క‌ల్ప‌న‌, సుస్థిర గ్రామీణ యాజ‌మాన్య‌ మెలకువ లు, స‌మీకృత ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, విద్య రంగం యొక్క భవిష్యత్తు త‌దిత‌ర అంశాల‌ పైన ప్రజెంటేశన్ ను ఇచ్చారు.

पूरा भाषण पढ़ने के लिए यहां क्लिक कीजिए

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
2024: A Landmark Year for India’s Defence Sector

Media Coverage

2024: A Landmark Year for India’s Defence Sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Maharashtra meets PM Modi
December 27, 2024

The Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met Prime Minister Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met PM @narendramodi.”