QuotePM Modi, South Korean President inaugurate world’s largest mobile manufacturing unit in Noida
QuoteDigital technology is playing a key role in making the lives of the common man simpler: PM Modi
QuoteThe expansion of smartphones, broadband and data connectivity is a sign of digital revolution in India: PM Modi
QuoteIndia’s growing economy and rising neo middle class, creates immense investment possibilities: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు కొరియా గ‌ణ‌తంత్రం అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో శామ్‌సంగ్‌ ఇండియా ఎల‌క్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఒక భారీ మొబైల్ త‌యారీ యూనిట్ ను ఈ రోజు ప్రారంభించారు.   

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ,  భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ త‌యారీ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సాగుతున్న ప్ర‌యాణం లో ఇది ఒక ప్ర‌త్యేక సంద‌ర్భం అని పేర్కొన్నారు.  దాదాపు 5,000 కోట్ల రూపాయ‌ల  పెట్టుబ‌డి తో కూడిన ఈ సదుపాయం భార‌త‌దేశం తో శామ్‌సంగ్‌ యొక్క వ్యాపార బంధాన్ని ప‌టిష్టం చేయ‌డమే కాకుండా భార‌త‌దేశానికి మ‌రియు కొరియా కు మ‌ధ్య ఉన్న సంబంధాల లో ఒక చెప్పుకోదగ్గ ప‌రిణామం కూడా అని ఆయ‌న అన్నారు.

|

సామాన్యుడి జీవితాన్ని స‌ర‌ళ‌త‌రం చేయ‌డంలోను, వేగ‌వంతం చేయ‌డంలోను, మరియు పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తి లో సేవ‌ల‌ను అంద‌జేయ‌డంలోను డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం ఒక కీల‌క‌మైన పాత్ర‌ ను పోషిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  స్మార్ట్ ఫోన్ లు, బ్రాడ్ బ్యాండ్‌, ఇంకా స‌మాచార రాశి సంధానం.. వీటి విస్త‌ర‌ణ‌ ను భార‌త‌దేశం లో ఓ డిజిట‌ల్ విప్ల‌వ సంకేతాలు గా ఆయ‌న అభివ‌ర్ణించారు.  ఇదే సంద‌ర్భంలో గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్‌)ను గురించి, డిజిట‌ల్ లావాదేవీల వృద్ధి ని గురించి, భీమ్ యాప్, ఇంకా రూపే కార్డులను గురించి కూడా ఆయ‌న వివరించారు.

|

‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఒక ఆర్థిక విధాన ప‌ర‌మైన చ‌ర్య మాత్ర‌మే కాద‌ని, ద‌క్షిణ కొరియా వంటి మిత్ర దేశాల‌తో మెరుగైన సంబంధాల‌కు అది ఒక సంక‌ల్పం కూడా అని ఆయ‌న చెప్పుకొచ్చారు.  ‘న్యూ ఇండియా’ యొక్క పార‌దర్శ‌క‌మైనటువంటి వ్యాపార సంస్కృతి యొక్క ప్ర‌యోజ‌నాల‌ను అందుకోవాల‌నుకొంటున్న ప్ర‌పంచ‌వ్యాప్త వ్యాపార సంస్థ‌ల‌కు ఒక బ‌హిరంగ ఆహ్వానాన్ని పలుకుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  భార‌త‌దేశం లో వ‌ర్ధిల్లుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ తో పాటు, ఎదుగుతున్న న‌వ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం అపార‌మైన పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను అందిస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

|

 

భార‌త‌దేశం ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్ ల త‌యారీ లో ప్ర‌పంచ స్థాయి లో రెండో స్థానంలో నిల‌చింద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  మొబైల్ ఫోన్ త‌యారీ క‌ర్మాగారాలు దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల కాలంలోనే 2 నుండి 120 కి చేరుకొన్నాయ‌ని చెప్పారు.  ఇది ల‌క్ష‌లాది ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టించినట్లు ఆయ‌న తెలిపారు.

|
|

 

ఈ నూతన మొబైల్ త‌యారీ సదుపాయం ద్వారాను, కొరియా కు చెందిన సాంకేతిక విజ్ఞానం జతపడడం ద్వారాను మరియు భార‌త‌దేశపు త‌యారీ, ఇంకా సాఫ్ట్‌వేర్ ప‌ర‌మైన మ‌ద్ద‌తు.. ఇవ‌న్నీ ప్ర‌పంచానికి శ్రేష్ట‌మైన ఉత్ప‌త్తుల‌ను అందించగలవని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  దీనిని రెండు దేశాల యొక్క శ‌క్తి గా మ‌రియు ఉమ్మ‌డి దార్శ‌నిక‌త గా ఆయ‌న వ‌ర్ణించారు.

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12మార్చి 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise