Time has come for the whole world to take concrete steps and stand united against all forms of terrorism and its perpetrators: PM
India and Argentina have decided to elevate our ties to a strategic partnership and to promote peace, stability, economic progress and prosperity: PM
India and Argentina are complementary to each other in many ways and both the countries must take advantage of the shared ties: PM

నా మిత్రుడు , అర్జెంటీనా అధ్య‌క్షుడు మాక్రి, అర్జెంటీనా నుంచి వ‌చ్చిన అతిథుల‌కు 
శుభాకాంక్ష‌లు,( న‌మ‌స్కార్‌)

అర్జెంటీనా అధ్య‌క్షుడు, ఆయ‌న కుటుంబం, ప్ర‌తినిధి వ‌ర్గానికి నేను సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నాను. బ్యూన‌స్ ఏర్స్‌లో మ‌నం స‌మావేశమైన‌ రెండు నెల‌ల అనంత‌రం ఇప్పుడు ఇండియాలో ఇక్క‌డ మీకు స్వాగ‌తం ప‌లికే అవ‌కాశం రావ‌డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంద‌ర్భంగా నేను మ‌రోసారి అధ్య‌క్షుడు మాక్రిని, ఆయ‌న బృందాన్ని జి-20 , 2018 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించినందుకు అభినందిస్తున్నాను.జి20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం విజ‌య‌వంతంగా జ‌ర‌గ‌డానికి అధ్య‌క్షుడు మాక్రి నాయ‌క‌త్వం ఎంతో కార‌ణం. బ్యూన‌స్ ఏర్స్‌లో జి 20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా అధ్య‌క్షుడు మాక్రి ఒక సంతోష‌క‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. అదేమంటే, భార‌త దేశ 75 వ స్వాతంత్ర్య‌దినోత్స‌వాల సంద‌ర్భంగా 2022లో జి-20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నానికి భార‌త దేశం ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ద‌ని .ఇందుకు నేను వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను.

మిత్రులారా,
అధ్య‌క్షుడు మాక్రితో నా ఐద‌వ స‌మావేశం ఇరు దేశాల మ‌ధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాల‌ను ప్ర‌తిఫ‌లింప‌చేస్తోంది.
రెండు దేశాల మ‌ధ్య దూరం 15,000 కిలోమీట‌ర్లు అనేది కేవ‌లం అంకెలకు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌ద‌ని మేం రుజువు చేశాం.అధ్య‌క్షుడు మాక్రి భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న ఒక ప్ర‌త్యేక సంవ‌త్స‌రంలో జ‌రుగుతున్న‌ది. ఈ ఏడాది ఉభ‌య దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు ఏర్ప‌డిన‌ 70 వ సంవ‌త్స‌రం ఇది. అయితే రెండు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాలు ఎంతో ప్రాచీన‌మైన‌వి. గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ 1924లోనే అర్జెంటీనా సంద‌ర్శించారు. ఆ ప‌ర్య‌ట‌న ప్ర‌భావం ఆయ‌న‌పై శాశ్వ‌తంగా ఉండి పోయింది. మ‌న ఉమ్మ‌డి విలువ‌లు, శాంతి, సుస్థిర‌త‌, ఆర్థిక ప్ర‌గ‌తి, సుసంప‌న్న‌త‌ను పెంపొందించ‌డానికి మ‌నం చేస్తున్న‌కృషి కార‌ణంగా ఉభ‌య దేశాలు త‌మ మ‌ధ్య సంబంధాల‌కు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య స్థాయి క‌ల్పించాయి.
ఉగ్ర‌వాదం అంత‌ర్జాతీయ శాంతి , సుస్థిర‌త‌కు తీవ్ర‌ముప్పును క‌లిగిస్తాయ‌ని నేను, అధ్య‌క్షుడు మాక్రి భావిస్తాం. పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి, ఇక ఇప్పుడు చ‌ర్చ‌ల‌కు స‌మ‌యం అయిపోయింద‌ని నిరూపిస్తున్న‌ది.ఇక ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం ఉగ్ర‌వాదానికి దానికి మ‌ద్ద‌తునిస్తున్న వారికి వ్య‌తిరేకంగా ఐక్యంగా నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిన స‌మ‌యం. ఉగ్ర‌వాదులు, మాన‌వ‌తా వ్య‌తిరేక వారి మ‌ద్ద‌తుదారులపై చ‌ర్య‌లు తీసుకోకుండా ఉ పేక్షించ‌డ‌మంటే అది కూడా ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే అవుతుంది. జి-20 దేశాలుగా మ‌నం, ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు 11 సూత్రాల హామ్‌బ‌ర్గ్ నాయ‌క‌త్వ ప్ర‌క‌ట‌న అజెండాను మ‌నం అమ‌లు చేయ‌వ‌ల‌సి ఉంది. ఇందుకు సంబంధించి మేం ఉభ‌య దేశాలం ఈరోజు ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా, మా చ‌ర్చ‌ల అనంత‌రం ఒక డిక్ల‌రేష‌న్‌ను విడుద‌ల చేస్తున్నాం. అంత‌రిక్ష రంగం, శాంతియుత ప్ర‌యోజ‌నాల‌కు అణు ఇంధ‌న రంగాల‌లో మా స‌హ‌కారం నానాటికీ పెరుగుతున్న‌ది. ర‌క్ష‌ణ స‌హ‌కార రంగంలో ఈరోజు ఉభ‌య‌దేశాల మ‌ధ్య సంత‌కాలు జ‌రిగిన అవ‌గాహ‌నా ఒప్పందం ర‌క్ష‌ణ రంగంలో మా మ‌ధ్య స‌హ‌కారానికి కొత్త కోణాన్ని జోడిస్తుంది.

 మిత్రులారా,
ఇండియా, అర్జెంటీనాలు ఎన్నో విధాలుగా ప‌రిపూర‌క‌మైన‌వి. ఉభ‌య దేశాల ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల కోసం దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మేం కృషి చేస్తాం.అర్జెంటీనా వ్య‌వ‌సాయానికి ప‌వ‌ర్‌హౌస్ వంటిది. భార‌త‌దేశం త‌న ఆహార భ‌ద్ర‌త‌విష‌యంలో అర్జెంటీనాను ప్ర‌ధాన భాగ‌స్వామిగా చూస్తున్న‌ది. వ్య‌వ‌సాయ‌-పారిశ్రామిక స‌హ‌కారానికి సంబంధించి ఉభ‌య దేశాల మ‌ధ్య గ‌ల వ‌ర్క్‌ప్లాన్ ఈ దిశ‌గా ఒక ముఖ్య‌మైన ముంద‌డుగు. ఐసిటి రంగంలో ఇండియా విజ‌యం సాధించింది. ముఖ్యంగా జెఇఎం అంటే జ‌న్‌ధ‌న్‌-ఆధార్‌-మొబైల్ ఈ మూడూ, అలాగే డిజిట‌ల్ చెల్లింపుల మౌలిక స‌దుపాయాలు ఈ అనుభ‌వాల‌ను అర్జెంటీనాతో పంచుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాం. 2030 నాటికి క‌నీసం 30 శాతం వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక‌ల్ బ్యాట‌రీతో న‌డిచేట్టు చేయాల‌ని భార‌త్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అర్జెంటీనా లిథుయం ట్ర‌యాంగిల్లో భాగం. దీనికి ప్ర‌పంచంలోని లిథుయం నిల్వ‌ల‌లో 54 శాతం ఉ న్నాయి. మా సంయుక్త సంస్త క‌బిల్ మైనింగ్ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి అర్జెంటీనాతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ది.

మిత్రులారా,
గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో , మా ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కంటే ఎక్కువ అయింది. ఇది 3 బిలియ‌న్ అమెరిక‌న్ డాలర్ల‌కు మించి పోయింది. వ్య‌వ‌సాయం, మెట‌ల్స్‌, మిన‌ర‌ల్స్‌, చ‌మురు, గ్యాస్,ఫార్మాసూటిక‌ల్‌, కెమిక‌ల్స్‌, మోటారు వాహ‌నాలు, సేవ‌ల రంగంతో స‌హా ప‌లు రంగాల‌లో చెప్పుకోద‌గిన వృద్ధికి అవ‌కాశాలు ఉన్నాయి. మా వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను మ‌రింత పెంచేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల‌ను మేం ఈరోజు గుర్తించాం. ఎన్నో ప్ర‌ముఖ అర్జెంటీనా కంపెనీల ప్ర‌తినిధులు అధ్య‌క్షుడు మాక్రితోపాటుగా వ‌చ్చార‌ని తెలిసి సంతోషంగా ఉంది. ఢిల్లీ , ముంబాయిల‌లో బిజినెస్ లీడ‌ర్ల‌తో వారి చ‌ర్చ‌లు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌గ‌ల‌వ‌న్న‌ది నా విశ్వాసం. మెర్‌కోస‌ర్‌తో 2004లో ప్రిఫ‌రెన్షియ‌ల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న తొలి దేశం ఇండియా. ప్ర‌స్తుత అర్జెంటీనా అధ్య‌క్షుడి స‌మ‌క్షంలో మేం ఈరోజు ఇండియా -మెర్‌కొస‌ర్ వాణిజ్యవిస్త‌ర‌ణ‌కు సంబంధించి మేం ప‌లు చ‌ర్య‌ల‌ను చ‌ర్చించాం.
మిత్రులారా, 
భార‌త క‌ళ‌లు, సంస్కృతి, ఆధ్యాత్మిక‌త‌కు సంబంధించి ల‌క్ష‌లాదిమంది అభిమానులు అర్జెంటీనాలో ఉనా్న‌రు. అర్జెంటీనావారి టాంగో నృద్యం, ఫుట్‌బాల్ భార‌త‌దేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇరు దేశాల మ‌ధ్య ప్ర‌జ‌ల‌ను మ‌రింత స‌న్నిహితం చేసేందుకు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల మార్పిడికి వీలుగా ప‌ర్యాట‌క‌, ప‌బ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీల మ‌ధ్య ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం జ‌రిగింది.
మిత్రులారా,
అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఇండియా ,అర్జెంటీనాల మ‌ధ్య మంచి స‌హ‌కారం ఉంది. ప్ర‌జ‌లంద‌రి సామాజిక ప్ర‌గ‌తి, అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త‌, ఆర్థిక‌, సామాజిక ప్ర‌గ‌తికి సంబంధించి సంస్క‌రింప‌బ‌డిన బ‌హుళ‌ప‌క్ష‌వేదిక‌ల అవ‌స‌రాన్ని మేం అంగీక‌రిస్తున్నాం.మిసైల్ టెక్నాల‌జీ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌,వాస‌నార్ ఏర్పాటు, అస్ట్రేలియా గ్రూప్‌, న్యూక్లియ‌ర్ స‌ప్ల‌య‌ర్స్ గ్రూప్ వంటి వాటిలో ఇండియా స‌భ్య‌త్వానికి అర్జెంటీనా గ‌ట్టి మ‌ద్ద‌తుప‌లికింది. వ‌ర్థ‌మాన దేశాల మ‌ధ్య స‌హ‌కారం మాకు ఎంతో ముఖ్య‌మైద‌ని. 2019లో బ్యూన‌స్ ఏర్స్‌లో ఐక్య‌రాజ్య‌స‌మితి నిర్వ‌హించ‌నున్న వ‌ర్ధ‌మాన దేశాల రెండ‌వ స‌హ‌కార స‌ద‌స్సు (సౌత్‌-సౌత్ కో ఆప‌రేష‌న్‌)లో భార‌త‌దేశం చురుకుగా పాల్గొంటుంద‌ని తెలియ‌జేయ‌డానికి నేను సంతోషం వ్య‌క్తం చేస్తున్నాను. వాతావ‌ర‌ణ మార్పుల‌కు వ్య‌తిరేకంగా పోరాటంలో మా అభిప్రాయాలూ ఒకే రీతిలో ఉన్నాయి. అంత‌ర్జాతీయ సౌర కూటమి ( ఇంట‌ర్నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్‌-ఐఎస్ఎ)లో కొత్త స‌భ్య దేశంగా అర్జెంటీనాకు స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకు సంతోషంగా ఉంది.
ఎక్స‌లెన్సీ,
భార‌త‌దేశాన్ని సంద‌ర్శించాలన్న నా ఆహ్వానాన్ని మ‌న్నించి ఇక్క‌డుకు విచ్చేసినందుకు నేను మ‌రోసారి నా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి ఈ ప‌ర్య‌ట‌న ఆనంద‌క‌రంగా ఉండ‌గ‌ల‌ద‌ని ఆశిస్తున్నాను.
ధ‌న్య‌వాదాలు..

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 నవంబర్ 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South