QuoteThere is a new dynamism in India-Netherlands trade and investment ties: PM Modi
QuoteGlad that Netherlands joined the International Solar Alliance: PM Modi
QuoteIndia is the 5th largest recipient of FDI from Netherlands: PM Modi
QuoteI thank PM Rutte for Netherlands’ cooperation in successful evacuation of Indian citizens during the hurricane at Sint Maarten in September 2017: PM Modi

శ్రేష్ఠులైన ప్రధాని మరియు నా స్నేహితుడు 
శ్రీ మార్క్ రూట్‌,

ప్రముఖ ప్రతినిధులు,

ప్ర‌సార మాధ్య‌మాల స‌భ్యులు,

మిత్రులారా,

ప్ర‌ధాని శ్రీ మార్క్ మ‌రియు ఆయ‌న ప్ర‌తినిధి వ‌ర్గానికి భార‌త‌దేశం లోపలకు ఇదే హృద‌యపూర్వ‌క స్వాగ‌తం. ప్ర‌ధాని శ్రీ మార్క్, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు న‌లుగురు, హేగ్ మేయ‌ర్ తో పాటు 200 మందికి పైగా వ్యాపార ప్ర‌తినిధులు కూడా భార‌త‌దేశానికి త‌ర‌లి వ‌చ్చినందుకు మరీ ముఖ్యంగా నేను సంతోషిస్తున్నాను. నెద‌ర్లాండ్స్ నుండి భార‌త‌దేశానికి విచ్చేసిన అతి పెద్ద వ్యాపార ప్ర‌తినిధుల స‌మూహం ఇది. మ‌రి ఇది మ‌న వ్యాపార సంబంధాలు, ఇంకా పెట్టుబ‌డి సంబంధాలు ఎంత చురుకుగా ఉన్నాయో పట్టి చూపిస్తోంది. ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి ఇక్క‌డ‌. ప్ర‌ధాని శ్రీ రూట్ 2015 లో భార‌త‌దేశానికి ఒక‌టో సారి విచ్చేశారు. నేను 2017 లో నెద‌ర్లాండ్స్ లో ప‌ర్య‌టించాను. మ‌రి ఈ రోజు ఇది మా మూడో శిఖరాగ్ర స‌మావేశం. మా సంబంధాలలో ఈ విధమైన వేగాన్ని క‌లిగివున్నటువంటి అత్యున్న‌త స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చాలా త‌క్కువ దేశాల‌తో మాత్రమే మాకు ఉన్నాయి. ఈ వేగ గతి కి మ‌రియు భార‌త‌దేశం తో సంబంధాల‌కు వ్య‌క్తిగ‌తంగా ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు గాను నా స్నేహితుడు శ్రీ మార్క్ కు నా హృద‌యాంత‌రాళం నుండి నేను అభినంద‌న‌లను తెలియ‌జేసుకొంటున్నాను.

|

మిత్రులారా,

ఈ రోజున మ‌న ద్వైపాక్షిక సంబంధాల‌లో పురోగ‌తిని ఉభ‌యుల‌ము స‌మీక్షించాము. ప్రాంతీయ పరిణామాల పట్ల మ‌రియు ప్ర‌పంచ ప‌రిణామాల ప‌ట్ల మావైనటువంటి అంచ‌నాల‌ను వెల్ల‌డించుకొన్నాము. మ‌రి అలాగే, ఇరు దేశాల‌కు చెందిన ప్రముఖ సిఇఒ ల‌తో భేటీ అయ్యాము. గ‌త సంవ‌త్స‌రం నేను నెద‌ర్లాండ్స్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఇంట‌ర్‌నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ లో స‌భ్యత్వాన్ని తీసుకోవ‌డం గురించి సానుకూల‌మైన ఆలోచ‌న చేయవలసిందంటూ నా స్నేహితుడు శ్రీ మార్క్ కు విజ్ఞ‌ప్తి చేశాను. సౌర విద్యుత్తు రంగంలో నెద‌ర్లాండ్స్ కు ఉన్న అనుభ‌వం, సాంకేతిక‌త‌, ప్రావీణ్యం ల తాలూకు ప్ర‌యోజ‌నాల‌ను యావ‌త్తు ప్ర‌పంచం పొంద‌వ‌ల‌సి ఉంది. మ‌రి ఈ రోజు నెద‌ర్లాండ్స్ ఇంట‌ర్‌నేశన‌ల్ సోలర్ అల‌యెన్స్ లో ఒక స‌భ్యురాలు అయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ నిర్ణ‌యాన్ని తీసుకొన్నందుకు గాను ప్ర‌ధాని శ్రీ రూట్ కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఐరాస‌ భ‌ద్ర‌త మండ‌లి నుండి మల్టిలేటరల్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ రెఝీమ్ ల వ‌ర‌కు చూస్తే భార‌త‌దేశం మ‌రియు నెద‌ర్లాండ్స్ ఎంతో చ‌క్క‌ని స‌హ‌కారాన్ని, స‌మ‌న్వ‌యాన్ని నెల‌కొల్పుకొన్నాయి. మ‌రి మ‌న మ‌ధ్య అంత‌ర్జాతీయ వేదిక‌ల‌లో ప‌టిష్ట‌మైన స‌హ‌కారానికి ఒక కొత్త పార్శ్వాన్ని ఇప్పుడు ఇంట‌ర్‌నేశన‌ల్ సోలర్ అల‌యెన్స్ జత చేయ‌నుంది.

మిత్రులారా,

డ‌చ్ కంపెనీల‌కు భార‌త‌దేశం కొత్త‌ది ఏమీ కాదు. వంద‌లాది డ‌చ్ కంపెనీలు భార‌త‌దేశంలో ఎన్నో సంవ‌త్స‌రాల నుండి ప‌ని చేస్తున్నాయి. ఇంత‌వ‌ర‌కు భార‌త‌దేశం లోకి వ‌చ్చిన మొత్తం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల‌లో ఐదో అతి పెద్ద వ‌న‌రుగా ఉంది. అంతేకాకుండా, గ‌త కొన్ని సంవ‌త్స‌రాల‌లో అది మూడో అతి పెద్ద వ‌న‌రుగా కూడా నెద‌ర్లాండ్స్ నిలచింది. ఇదే విధంగా నెద‌ర్లాండ్స్ కూడా భార‌తీయ కంపెనీల‌కు పెట్టుబ‌డి పరంగా ఎంతో ఆక‌ర్ష‌ణీయ‌మైన గ‌మ్య స్థానంగా ఉంది. ఈ కార‌ణంగా ఇరు దేశాల‌కు చెందిన సిఇఒ ల స‌మావేశం ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. నెద‌ర్లాండ్స్ లోని వ్యాపార స‌ముదాయం భార‌త‌దేశం లో అందివ‌స్తున్న అవ‌కాశాల ప‌ట్ల ఎంతో ఉత్సాహంతో ఉండ‌డం నాకు సంతోషాన్నిస్తోంది. భార‌త‌దేశం లో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ప‌ట్ల నాలో బ‌ల‌మైన వ‌చ‌నబ‌ద్ధ‌త ఉంద‌న్న విష‌యంలో వారికి నేను భ‌రోసా ను ఇస్తున్నాను. వ్య‌వ‌సాయం, ఇంకా ఫూడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన రంగాలు భార‌త‌దేశానికి ఎంతో ముఖ్య‌మైన‌వి. ఈ అంశాల‌కు మా ఆహార భ‌ద్ర‌త‌ తో లంకె ఉన్నది. అదే స‌మ‌యంలో, భార‌తదేశం లో వ్య‌వ‌సాయ‌దారుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాల‌న్న మా ల‌క్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కూడా ఇది ముఖ్యమైందే. ఈ రంగాల‌లో నెద‌ర్లాండ్స్ కు ప్రావీణ్యం ఉంది. గ‌త సంవ‌త్స‌రం వ‌ర‌ల్డ్ ఫూడ్ ఇండియా స‌మిట్ లో నెద‌ర్లాండ్స్ ఫోక‌స్ కంట్రీ గా పాలుపంచుకొంది. మ‌రి ఈ సమిట్ యొక్క త‌దుప‌రి సంచిక 2019 లో జ‌రుగ‌నుంది. ఆ సంద‌ర్భంలో నెద‌ర్లాండ్స్ ప్రాతినిధ్యం మ‌రింత అధికంగా ఉంటుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఒకటో ‘ఇండో-డ‌చ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ఫ‌ర్ వెజిట‌బుల్స్’ ను బారామ‌తి లో పనిచేయడం మొదలైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఇదే విధ‌మైన ఇత‌ర కేంద్రాల విష‌యంలోనూ మేము కలసికట్టుగా కృషి చేస్తున్నాము. ఇలాగే ప‌ట్ట‌ణాభివృద్ధిలో మ‌న స‌హ‌కారం ఎంతో చైత‌న్యశీలంగా ఉంది. వ‌డోద‌రా లో, ఢిల్లీ లో వ్య‌ర్ధ జ‌లాల నిర్వ‌హ‌ణ ప‌థ‌కాలు చ‌క్క‌ని పురోగ‌తి ని సాధిస్తున్నాయి. మ‌నం శాస్త్ర విజ్ఞ‌ానం & సాంకేతిక విజ్ఞ‌ానం లో సహకరించుకోవడంలో 10 సంవ‌త్స‌రాలను పూర్తి చేసుకొంటున్నాము. ఈ విజ‌య‌వంత‌మైన భాగ‌స్వామ్యం.. 2019 లో భార‌త‌దేశం లో జ‌రిగే టెక్ స‌మిట్ లో నెద‌ర్లాండ్స్ ఒక భాగ‌స్వామ్య దేశంగా పాలుపంచుకోనుండ‌టం..తో మ‌రింతగా బ‌ల‌ప‌డ‌నుంది.

|

మిత్రులారా,

విదేశాల‌లో నివ‌సిస్తున్న భార‌తీయ స‌మాజానికి సంబంధించిన అంశాల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను వ‌హించ‌డం అనేది మా ప్ర‌భుత్వ విదేశ వ్యవహారాల విధానంలో ఒక ప్ర‌ధాన‌మైన ప్రాథమ్యంగా ఉంటూ వ‌చ్చింది. 2017 సెప్టెంబ‌ర్ లో సింట్ మార్టెన్ ను చక్రవాతం కమ్ముకొన్న వేళ భార‌త జాతీయుల‌ను సురక్షితంగా త‌ర‌లించ‌డంలో స‌హాయాన్ని అందించినందుకు గాను నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వానికి మ‌రియు ప్ర‌ధాని శ్రీ రూట్ కు నేను ప్ర‌త్యేకించి ధ‌న్య‌వాదాలను తెలియ‌జేసుకొంటున్నాను.

|

ఎక్స్‌లెన్సీ,

మీకు మ‌రియు మీ ప్ర‌తినిధి వ‌ర్గానికి భార‌త‌దేశం లోపలకు నేను మ‌రో మారు అత్యంత సాద‌రంగా స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

మీకు ధ‌న్య‌వాదాలు,

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Why ‘Operation Sindoor’ Surpasses Nomenclature And Establishes Trust

Media Coverage

Why ‘Operation Sindoor’ Surpasses Nomenclature And Establishes Trust
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2025
May 09, 2025

India’s Strength and Confidence Continues to Grow Unabated with PM Modi at the Helm