QuoteI am glad that Indo-Nepal cooperation is being expanded to a greater extent: PM Modi
QuoteThe launch of this pipeline as a first in South Asia is very satisfying and reaffirms our commitment to expand our relations with our neighbours even more: PM Modi
QuoteAs Mr Oli has said, the consumers on both sides are set to benefit from the reduction in costs once this pipeline becomes operational: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ కలసి ఒక సీమాంత‌ర పెట్రోలియ‌మ్ ఉత్ప‌త్తుల గొట్ట‌పు మార్గాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు.

|

భార‌త‌దేశం లోని మోతిహారీ నుండి నేపాల్ లోని అమ్‌ లేఖ్ గంజ్ కు పెట్రోలియమ్ ఉత్ప‌త్తుల ను చేర‌వేసేందుకు ఉద్దేశించిన‌టువంటి గొట్టపు మార్గం – ద‌క్షిణ ఆసియా లో ఈ కోవ కు చెందిన తొలి సీమాంత‌ర గొట్ట‌పు మార్గం ఇదే – ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో పాటు నేపాల్ ప్ర‌ధాని రైట్ ఆన‌రెబల్ శ్రీ కె.పి. శ‌ర్మ ఓలీ కలసి ఈ రోజు న ప్రారంభించారు.

|

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాని శ్రీ ఓలీ మాట్లాడుతూ, ముఖ్యమైనటువంటి ఈ సంధాన ప‌థ‌కం నిర్ణీత గ‌డువు క‌న్నా ఎంతో ముందుగానే పూర్తయి అమ‌లు లోకి రావ‌డం ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపించారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మాట్లాడుతూ, 69 కిలో మీట‌ర్ల పొడ‌వు న సాగే మోతిహారీ- అమ్‌లేఖ్ గంజ్ గొట్ట‌పు మార్గం సంవ‌త్స‌రం లో 2 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్ధ్యాన్ని క‌లిగివుంద‌ని, ఇది శుద్ధమైనటువంటి పెట్రోలియ‌మ్ ఉత్ప‌త్తుల ను త‌క్కువ ఖ‌ర్చు లో నేపాల్ ప్రజ‌ల కు అందిస్తుంద‌న్నారు. నేపాల్ లో పెట్రోలియ‌మ్ ఉత్ప‌త్తుల ధ‌ర‌ ను ప్రతి లీట‌రు కు 2 రూపాయ‌ల మేర‌ త‌గ్గిస్తున్నట్లు ప్ర‌ధాని శ్రీ ఓలీ ప్ర‌క‌టించడాన్ని ఆయ‌న స్వాగతించారు.

భార‌త‌దేశం-నేపాల్ భాగ‌స్వామ్యం విస్తృతం కావ‌డానికి ఒక పురోగామి దృక్ప‌థం క‌లిగిన కార్య‌క్ర‌మ ప‌ట్టిక ను అత్యున్న‌త రాజ‌కీయ స్థాయిల లో క్ర‌మం త‌ప్ప‌క చోటు చేసుకొంటున్న సంప్ర‌దింపులు ఆవిష్క‌రించాయని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. భార‌త‌దేశాని కి మ‌రియు నేపాల్ కు మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత గాఢ‌త‌రం కావ‌డం తో పాటు విభిన్న రంగాల కు విస్త‌రించ‌గ‌ల‌వ‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

నేపాల్ ను సంద‌ర్శించాలంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ని ప్ర‌ధాని శ్రీ ఓలీ ఆహ్వానించ గా, ఆ ఆహ్వానాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఆమోదం తెలిపారు.

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Media Coverage

"This kind of barbarism totally unacceptable": World leaders stand in solidarity with India after heinous Pahalgam Terror Attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఏప్రిల్ 2025
April 25, 2025

Appreciation From Citizens Farms to Factories: India’s Economic Rise Unveiled by PM Modi