యువర్ ఎక్స్‌లెన్సీ,
ప్రధాని శేఖ్ హసీనా గారు,
ఎక్స్‌లెన్సీస్,
మిత్రులారా,
నమస్కారాలు,
Sabaaike Sharodeeyo Shubhechha!
మరో మూడు ద్వైపాక్షిక పథకాల ను ప్రధాని శేఖ్ హసీనా గారి తో కలసి ప్రారంభించే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. గడచిన సంవత్సరం కాలం గా మేము వీడియో లింక్ ల ద్వారా 9 పథకాల ను ప్రారంభించాము. ఈ నాటి మూడు పథకాల ను కూడా కలుపుకొంటే, ఒక సంవత్సర కాలం లో మేము డజను పథకాల ను కలసి ప్రారంభించినట్లు అయింది. ఈ కార్య సాధన కు గాను ఉభయ దేశాల పౌరుల ను మరియు అధికారుల ను నేను అభినందిస్తున్నాను.
నేటి మూడు పథకాలు మూడు విభిన్న రంగాల కు- ఎల్‌పిజి దిగుమతి కి , వృత్తి విద్య లో శిక్షణ కు , సామాజిక సదుపాయానికి- చెందినవి. అయితే, ఈ మూడిటి ప్రయోజనం ఒకటే. అది మన పౌరుల జీవితాల ను మెరుగు పరచడం. భారతదేశం-బాంగ్లాదేశ్ సంబంధాల కు ప్రధాన సూత్రం గా ఉన్నది కూడా ఇదే. భారతదేశం-బాంగ్లాదేశ్ భాగస్వామ్యాని కి ప్రాతిపదిక గా ఉన్నది మన మైత్రి. ఇది మన దేశాల లోని ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధి కి ఇది పూచీ పడుతోంది.
బాంగ్లాదేశ్ నుండి పెద్ద ఎత్తున ఎల్‌పిజి ని సరఫరా చేసుకోవడం ఇరు దేశాల కు లాభదాయకం అవుతుంది. ఇది బాంగ్లాదేశ్ లో ఉపాధి ని, ఆదాయాన్ని మరియు ఎగుమతుల ను పెంపొందింప చేస్తుంది. 1500 కిలో మీటర్ల మేరకు రవాణా దూరం తగ్గిపోవడం వల్ల కూడా ఆర్థిక ప్రయోజనాలు సమకూరడమే కాకుండా పర్యావరణాని కి వాటిల్లే నష్టం కూడా తగ్గుతుంది. రెండో పథకం బాంగ్లాదేశ్- ఇండియా ప్రొఫెశనల్ స్కిల్ డివెలప్‌మెంట్ ఇన్స్ టిట్యూట్. ఇది బాంగ్లాదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధి కి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల ను మరియు సాంకేతిక నిపుణుల ను తయారు చేస్తుంది.
ఎక్స్‌లెన్సీస్,
ఢాకా లో గల రామకృష్ణ మఠం లో వివేకానంద భవన్ ప్రోజెక్టు మన సమాజాల పై మరియు విలువల పై చెరిగిపోనటువంటి ప్రభావాన్ని ప్రసరించిన ఇద్దరు మహనీయులు- స్వామి రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానందుడు- జీవితాల నుండి స్ఫూర్తి ని పొందినటువంటిది.
బాంగ్లా సంస్కృతి తాలూకు బాహాటమైన ప్రేరణ మరియు ఔదార్యం ల మాదిరిగానే ఈ మఠం కూడాను అన్ని తెగల కు చెందిన అనుయాయుల లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మఠం ప్రతి తెగ లోని ఉత్సవాన్ని సమానమైనటువంటి ఆనందోల్లాసాల తో వేడుక గా జరుపుతూ ఉంటుంది. విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు పరిశోధక విద్యార్థుల కు 100 మంది కి పైగా వసతి ఏర్పాట్లు ఈ భవనం లో లభిస్తాయి.
ఎక్స్‌లెన్సీ,
భారతదేశం బాంగ్లాదేశ్ తో భాగస్వామ్యాని కి ప్రాధాన్యాన్ని ఇస్తోంది. రెండు స్నేహపూర్వకమైన ఇరుగు పొరుగు దేశాల మధ్య గొప్ప సహకారాని కి ఉదాహరణ గా ఇండియా-బాంగ్లాదేశ్ సంబంధం కొనసాగుతున్నందుకు మేము గర్విస్తున్నాము. ఈ నాటి మా సంభాషణ మన సంబంధాల కు మరింత శక్తి ని ప్రసాదిస్తుందని నేను సంతోషిస్తున్నాను.
జయ్ హింద్, జయ్ బాంగ్లా, జయ్ భారత్-బాంగ్లా బంధుత్వ,
మీకు ఇవే ధన్యవాదాలు.
అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు. ఇది ఆయన ప్రసంగాని కి స్థూల అనువాదం.
Remarks by PM @narendramodi at the joint remote inauguration of 3 bilateral projects in Bangladesh- “मुझे खुशी है कि Prime Minister शेख हसीना जी के साथ तीन और bilateral projects का उद्घाटन करने का मौका मुझे मिला है”
— PMO India (@PMOIndia) October 5, 2019
पिछले एक साल में, हमने वीडियो लिंक से 9 projects को लान्च किया।आज के तीन projects को जोड़कर एक साल में हमने एक दर्जन joint projects लांच किए हैं।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
आज की ये तीन परियोजनाएं तीन अलग-अलग क्षेत्रों में हैं:— LPG import, vocational training और social facility: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
लेकिन इन तीनों का उद्देश्य एक ही है। और वो है - हमारे नागरिकों के जीवन को बेहतर बनाना। यही भारत-बांग्लादेश संबंधों का मूल-मंत्र भी है।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
बांग्लादेश से bulk LPG की supply दोनों देशों को फायदा पहुंचाएगी। इससे बांग्लादेश में exports, income और employment भी बढ़ेगा। ट्रॉन्सपोर्टेशन दूरी पंद्रह सौ किमी. कम हो जाने से आर्थिक लाभ भी होगा और पर्यावरण को भी नुकसान कम होगा।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
दूसरा project- Bangladesh-India Professional Skill Development Institute, बांग्लादेश के औद्योगिक विकास के लिए कुशल मैनपावर और टेक्निशियन तैयार करेगा।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
ढाका के रामकृष्ण मिशन में विवेकानंद भवन का project, जो दो महामानवों के ज़ीवन से प्ररेणा लेता है।हमारे समाजों और मूल्यों पर स्वामी रामकृष्ण और स्वामी विवेकानंद का अमिट प्रभाव है।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
बांग्ला संस्कृति की उदारता और खुली भावना की तरह ही इस मिशन में भी सभी पन्थों को मानने वालों के लिए स्थान है। और यह मिशन हर सम्प्रदाय के उत्सव को समान रूप से मनाता है।भवन में 100 से अधिक यूनिवर्सिटी छात्रों और research scholars के रहने की व्यवस्था की गई है: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
भारत बांग्लादेश के साथ अपनी साझेदारी को प्राथमिकता देता है।हमें गर्व है कि भारत-बांग्लादेश संबंध दो मित्र पड़ौसी देशों के बीच सहयोग का पूरी दुनिया के लिए एक बेहतरीन उदाहरण है।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019
मुझे खुशी है कि हमारी आज की बातचीत से हमारे संबंधों को और भी ऊर्जा मिलेगी।: PM
— PMO India (@PMOIndia) October 5, 2019