స‌భ లో ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని తిర‌స్క‌రించవ‌ల‌సిందని అన్ని ప‌క్షాల‌కు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

కొంత మంది స‌భ్యులు వ్య‌క్తం చేసినటువంటి వ్య‌తిరేక‌త‌ ను దేశ ప్ర‌జ‌లు ఈ రోజు గమనించారు. అభివృద్ధి పట్ల కొంత మంది ఎంతటి తీవ్రమైన వ్య‌తిరేకతతో ఉన్నదీ భార‌త‌దేశం చూసింది:

మీరు చ‌ర్చ‌కు సిద్ధంగా లేన‌ప్పుడు తీర్మానాన్ని ఎందుకు తీసుకు వ‌చ్చిన‌ట్లు ? తీర్మానాన్ని ఆల‌స్యం చేసేందుకు మీరు ఎందుకని య‌త్నిస్తున్నారు.

వారు చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది ఒకే ఒక్క‌టి- మోదీ ని తొల‌గించండి అనేదే

ప్ర‌తిప‌క్ష స‌భ్యుల లో మ‌నం గ‌మ‌నించింద‌ల్లా కేవ‌లం అహంకారం.

ఈ స‌భ్యుడి కి నన్నొకటి చెప్పనివ్వండి మమ్మల్ని ఎన్నుకొన్నది ప్ర‌జ‌లు. అలాగ మేము ఇక్క‌డ‌కు వ‌చ్చాము:

అధికారం లోకి రావాల‌ని ఆయ‌న కు ఏమిటి ఈ తొంద‌ర‌ ?

ఉద‌యం వేళ, ఓటింగు ఇంకా పూర్తి కాకుండానే, చ‌ర్చ ఇంకా ముగియ‌క మునుపే, ఒక స‌భ్యుడు ఉఠో ఉఠో ఉఠో (లేవండి లేవండి లేవండి) అంటూ నా వ‌ద్ద‌కు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చారు…

ఒక మోదీ ని తొల‌గించ‌డం కోసం, చూడండి వారు అంద‌రూ ఎలాగ ఏకం కావ‌డానికి య‌త్నిస్తున్నారో:

మేము స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం ఇక్క‌డ‌కు రాలేదు:

మేము ఇక్కడకు వచ్చామంటే అందుకు కారణం మాకు 125 కోట్ల మంది భార‌తీయుల ఆశీస్సులు ఉన్నాయి.

మేము ‘స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్’ అనే మంత్రం తో దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేశాము.

70 సంవ‌త్స‌రాల త‌ర‌బడి అంధ‌కారం లో మ‌గ్గిన 18,000 ప‌ల్లెల లో విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పించే దిశ‌గా పాటుప‌డే గౌర‌వం మా ప్ర‌భుత్వానికి ద‌క్కింది.

ఈ గ్రామాల‌న్నీ కూడాను చాలా వ‌ర‌కు తూర్పు భార‌తావ‌నిలో, ఇంకా ఈశాన్య భార‌తావ‌ని లో నెల‌కొన్న‌వే.

భార‌త‌దేశం అంత‌టా మ‌రుగుదొడ్ల ను రికార్డు వేగం తో నిర్మించ‌డ‌మైంది:

ఉజ్వల యోజ‌న వల్ల మ‌హిళ‌లు పొగ‌కు తావు లేన‌టువంటి జీవితాన్ని గ‌డుపుతున్నారు.

పేద‌ల కోసం బ్యాంకు ఖాతా ల‌ను మా ప్ర‌భుత్వం తెర‌చింది. ఇదివ‌ర‌కు, బ్యాంకుల త‌లుపులను పేద‌ల కోసం ఎన్న‌డూ తెర‌చి ఉంచడం జరుగలేదు.

పేద‌లకు ఉన్న‌తమైన నాణ్య‌త క‌లిగినటువంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ ను అందించే ఆయుష్మాన్ భార‌త్ వంటి ఒక కార్య‌క్ర‌మాన్ని ఈ ప్రభుత్వం తీసుకు వ‌స్తోంది: ప‌్ర‌ధాన మంత్రి

యూరియా కు వేప పూత‌ ను పూయాల‌న్న నిర్ణ‌యం భార‌త‌దేశ రైతుల కు స‌హాయ‌కారి గా నిలచింది:

స్టార్ట్‌-అప్ ల పర్యావరణ వ్య‌వ‌స్థ లో భార‌త‌దేశం త‌న‌కంటూ ఒక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకొంటోంది.

ముద్ర యోజ‌న ఎంతో మంది యువ‌జ‌నుల స్వ‌ప్నాల‌ను సాకారం చేస్తోంది.

భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేత‌ం అవుతోంది. మ‌రి అలాగే భార‌త‌దేశం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ను సైతం ప‌టిష్టప‌రుస్తోంది.

న‌ల్ల‌ధ‌నం పైన జరుగుతున్నటువంటి పోరాటం కొన‌సాగుతుంది. దీని ద్వారా నేను ఎంతో మంది శ‌త్రువుల‌ను త‌యారు చేసుకున్నాన‌న్న సంగ‌తి నాకు ఎరుకే. అయితే, ఇది మంచిదే.

కాంగ్రెసు కు ఇసిఐ ప‌ట్ల‌, న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల, ఆర్‌బిఐ ప‌ట్ల‌, అంత‌ర్జాతీయ సంస్థ‌ల ప‌ట్ల న‌మ్మ‌కం లేదు. వారికి దేని పట్లా విశ్వాసం లేదు.

మ‌నం ఎక్క‌డ‌కు వ‌చ్చాము ? ప్ర‌తిదీ ఒక చిన్న పిల్ల‌వాడి ప్ర‌వ‌ర్త‌నకు తగినదని అనిపించుకోదు:

నాయ‌కుల‌లో ఒక‌రు డోక్లామ్ గురించి మాట్లాడారు. అదే నాయ‌కుడు మ‌న బ‌ల‌గాల క‌న్నా చైనా రాయ‌బారి ప‌ట్ల విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.

స‌భ లో రాఫెల్ ను గురించి ఒక లక్ష్యం లేనటువంటి ఆరోప‌ణ చేసిన కార‌ణంగా రెండు దేశాలూ ప్ర‌క‌ట‌న‌ల‌ను విడుద‌ల చేయ‌వ‌ల‌సి వ‌చ్చింది:

కాంగ్రెసు కు నా విన్న‌పం ఇది- ద‌య‌చేసి జాతీయ భ‌ద్ర‌త లోకి రాజ‌కీయాల‌ను తీసుకు రావ‌ద్దు:

మ‌న సాయుధ ద‌ళాల‌ పట్ల ఈ విధ‌మైనటువంటి అవ‌మానాన్ని నేను స‌హించ‌ను.

మీరు న‌న్ను ఎంతైనా దూషించవచ్చును. భార‌త‌దేశ‌పు జ‌వానులను అవ‌మానించ‌డం ఆపివేయండి.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ను మీరు ఒక సంఖ్యాత్మ‌క దాడి గా పోల్చారు.

1999 లో ఆమె రాష్ట్రప‌తి భ‌వ‌న్ బ‌య‌ట నిల్చొని మ‌న‌తో 272 మంది ఉన్నారు మరి ఇంకా ఎక్కువ మంది వచ్చి మ‌న‌తో చేరబోతున్నారు అంటూ ప‌లికినటువంటి మాట‌లు నాకు గుర్తుకు వ‌స్తున్నాయి. ఆవిడ అట‌ల్ గారి ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చారు. మ‌రి ఒక ప్ర‌భుత్వాన్ని స్వయంగా ఎన్న‌డూ స్థాపించనే లేదు.

నేను ఒక ప్ర‌క‌ట‌న‌ను చ‌దువుతాను – ‘‘ఎవ‌రు మ‌న ద‌గ్గ‌ర సంఖ్య‌లు లేవు అని అంటున్నది.’’

కాంగ్రెస్ చ‌ర‌ణ్ సింహ్ గారి కి చేసింది ఏమిటి ? వారు చంద్ర‌శేఖ‌ర్ గారికి చేసిందేమిటి ? వారు దేవ‌ గౌడ‌ గారికి చేసింది ఏమిటి ? వారు ఐ.కె. గుజ్రాల్ గారికి చేసింది ఏమిటి ? రెండు సార్లు నోట్ల శ‌క్తి తో వోట్ల ను కొనుగోలు చేయ‌డంలో కాంగ్రెసుకు ప్రమేయం ఉంది:

ఈ రోజున కళ్లు ఏం చేశాయో యావ‌త్తు దేశ ప్రజలు చూశారు. ప్ర‌తి ఒక్క‌రి ఎదుటా జరిగిన విషయం స్ప‌ష్టంగా ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ ను విభ‌జించింది కాంగ్రెస్‌. మ‌రి అప్పటి వారి ప్ర‌వ‌ర్త‌న సిగ్గుచేటుగా ఉండింది.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ మ‌రియు తెలంగాణ ల అభివృద్ధి కోసం ఎన్‌డిఎ ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొంది.

వైఎస్ఆర్‌సిపి తో మీకు ఉన్న అంత‌ర్గ‌త రాజ‌కీయాలు కార‌ణంగానే మీరు ఈ పనిని చేస్తున్నారు అని ఎపి సిఎమ్ కు నేను చెప్పాను.

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది ఏమిటంటే, మేము వారి కోసం పాటుప‌డుతూనే ఉంటాము అని. ఎపి అభివృద్ధి కోసం మేము చేయ‌గ‌లిగిన ప్ర‌తి ఒక్క‌ పనిని చేస్తాము:

ఒక ఫోన్ కాల్ వారి యొక్క ఆశ్రితుల‌కు రుణాలు తెచ్చిపెడుతుంది. మ‌రొక పక్కన న‌ష్టపోయేది దేశ ప్ర‌జ‌లు.

ఎన్‌పిఎ స‌మ‌స్య‌ ను గురించి నేను మీకు చెప్ప‌ద‌లచాను. ఇంట‌ర్ నెట్ బ్యాంకింగ్ కన్నా చాలా మునుపే ఫోన్ బ్యాంకింగ్ ను కాంగ్రెస్ పార్టీ క‌నుగొంది. మరి ఇదే ఎన్‌పిఎ సంక్షోభానికి కార‌ణ‌మైంది.

ఈ ప్ర‌భుత్వం ముస్లిమ్ మ‌హిళ‌ల‌కు న్యాయం కోసం వారు జరుపుతున్నటువంటి అన్వేష‌ణ లో అండ‌గా నిలబడుతుంది.

హింస జ‌రిగే ఏ సంద‌ర్భ‌మైనా సరే, దేశ ప్ర‌జ‌ల‌కు ల‌జ్జాకార‌కం అవుతుంది. హింస‌ కు ఒడిగ‌ట్టే వారిని శిక్షించవలసిందంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నేను మ‌రోమారు విన్న‌విస్తాను.

ర‌హ‌దారులు ఎంత‌ రికార్డు వేగంతో నిర్మాణమవుతున్నదీ, ప‌ల్లెలు ఎంత‌ రికార్డు వేగంతో సంధానం అవుతున్నదీ, ఐ-వే లు ఎంత‌ రికార్డు వేగంతో నిర్మితం అవుతున్నదీ, రైల్వేల అభివృద్ధి ఎంత‌ రికార్డు వేగంతో జ‌రుగుతున్నదీ భార‌త‌దేశం చూస్తోంది. 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage