ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 16వ లోక్ సభ చివరి సమావేశంలో ప్రసంగించారు.
సభా కార్యక్రమాల నిర్వహణలో స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్ పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు.16వ లోక్ సభ ప్రారంభం నుంచి చివరి వరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు పోషించిన పాత్రను కూడా ఆయన కొనియాడారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి స్వర్గీయ అనంత్ కుమార్ లోక్ సభకు చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సుమారు మూడు దశాబ్దాల తర్వాత పూర్తి మెజారిటీతో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఘట్టం ఇదేనని ప్రధానమంత్రి అన్నారు. 16వ లోక్ సభ సాధించిన ఉత్పాదకత గురించి ప్రస్తావిస్తూ ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన 17 సమావేశాల్లో 8 సమావేశాలకు నూరు శాతం హాజరు ఉన్నదని ఆయన అన్నారు. మొత్తం ఉత్పాదకత 85 శాతం ఉన్నట్టు ఆయన చెప్పారు.
లోక్ సభ కాలపరిమితి అంతటిలోనూ ప్రజల సంక్షేమం కోసం అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ తమ వంతుగా మంచి సేవలందించారని ప్రధానమంత్రి కొనియాడారు.
మహిళా ఎంపిల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్న లోక్ సభగా ఇది కలకాలం గుర్తుండిపోతుందని ప్రధానమంత్రి అన్నారు. మహిళా పార్లమెంటు సభ్యుల్లో 44 మంది తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన వారేనని ఆయన చెప్పారు. మహిళా ఎంపిల భాగస్వామ్యాన్ని కూడా కొనియాడుతూ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికసంఖ్యలో మహిళలు మంత్రిమండలిలో మంత్రులుగా ఉన్నారని తెలిపారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఇద్దరు మహిళా మంత్రులు సభ్యులుగా ఉన్నారని ఆయన చెప్పారు.
“భారతదేశం ఆత్మవిశ్వాసం చారిత్రక గరిష్ఠ స్థాయిల్లో ఉంది. విశ్వాసమే అభివృద్ధికి అవసరం అయిన ప్రేరణ అందిస్తుంది. ఆ రకంగా ఇది చాలా సానుకూల అంశంగా నేను భావిస్తున్నాను” అని ప్రధానమంత్రి అన్నారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అతి సమీపంలో ఉంది అని ప్రధానమంత్రి అన్నారు.
ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం, తయారీ వంటి విభిన్న రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. “ప్రపంచం అంతా భూతాపం గురించి మాట్లాడుతోంది. కాని భారతదేశం ఈ పరిస్థితిని నివారించేందుకు అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఏర్పాటుకు కృషి చేసింది” అని ప్రధానమంత్రి చెప్పారు.
పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం చేయగలిగిన పనులను గుర్తించిన ప్రపంచం ఈ రోజు ఆ అంశాన్ని ఎంతో సానుకూలమైనదిగా తీసుకుందని, అదంతా 2014 సంవత్సరంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితమేనని అంటూ ఆ ఘనత పౌరులదే అని ప్రధానమంత్రి చెప్పారు.
విదేశాంగ విధానం గురించి ప్రస్తావిస్తూ నేపాల్ లో భూకంపం ఏర్పడినప్పుడు అందించిన సహాయ చర్యలు కావచ్చు, మాల్దీవుల నీటి సంక్షోభం కావచ్చు, యెమెన్ లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడడంలో కావచ్చు ఏ రకమైన మానవతాపూర్వక పనుల్లో అయినా గత ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశం ఎంతో కీలక భూమిక పోషించిందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశానికి గల సాఫ్ట్ పవర్ గురించి ప్రస్తావిస్తూ ఈ రోజు ప్రపంచం యావత్తు యోగా ప్రక్రియను గుర్తించిందని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ రోజున బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని, మహాత్మాగాంధీ జయంతిని నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.
లోక్ సభలో జరిగిన కార్యకలాపాల వివరాలు అందచేస్తూ 16వ లోక్ సభలో 219 బిల్లులు ప్రతిపాదించగా 203 బిల్లులు ఆమోదం పొందాయని ప్రధానమంత్రి తెలిపారు. నల్లధనం, అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ దివాలా చట్టం, పరారీ నేరస్థుల చట్టం వంటి కఠినమైన చట్టాలు ఈ లోక్ సభ కాలపరిమితిలోనే ఆమోదం పొందాయని ఆయన అన్నారు.
“జిఎస్ టి బిల్లును కూడా ఈ లోక్ సభే ఆమోదించింది. సహకార, ఏకాభిప్రాయ శక్తికి జిఎస్ టి విధానమే సజీవ నిదర్శనం” అని ప్రధానమంత్రి అన్నారు.
ఆధార్, ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం రిజర్వేషన్, మాతృత్వపు సెలవులు వంటి అంశాల్లో కూడా ప్రభుత్ం తీసుకున్నచొరవను ఆయన ప్రస్తావించారు. కాలం చెల్లిపోయిన 1400 చట్టాలను రద్దు చేయడం 16 లోక్ సభ కాలంలో జరిగిన అతి పెద్ద చొరవ అని ప్రధానమంత్రి అన్నారు.
16వ లోక్ సభ కాలపరిమితి అంతా సభ సజావుగా నిర్వహించడానికి అందించిన మద్దతు, అందించిన తమ వంతు సహకారానికి ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి ప్రసంగం ముగించారు.
Several sessions in this Lok Sabha had good productivity. This is a very good sign.
— PMO India (@PMOIndia) February 13, 2019
I appreciate @MVenkaiahNaidu Ji, Late @AnanthKumar_BJP Ji for their service as Ministers for Parliamentary Affairs: PM @narendramodi in the Lok Sabha
India's self-confidence is at an all time high.
— PMO India (@PMOIndia) February 13, 2019
I consider this to be a very positive sign because such confidence gives an impetus to development: PM @narendramodi
The world is discussing global warming and India made an effort in the form of the International Solar Alliance to mitigate this menace: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 13, 2019
It is this Lok Sabha that has passed stringent laws against corruption and black money: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 13, 2019
It is this Lok Sabha that passed the GST.
— PMO India (@PMOIndia) February 13, 2019
The GST process revealed the spirit of cooperation and bipartisanship: PM @narendramodi