Swami Vivekananda said that only rituals will not connect an individual to divinity. He said Jan Seva is Prabhu Seva: PM
More than being in search of a Guru, Swami Vivekananda was in search of truth: PM Modi
Swami Vivekananda had given the concept of 'One Asia.' He said that the solutions to the world's problems would come from Asia: PM
There is no life without creativity. Let our creativity strengthen our nation and fulfil the aspirations of our people: PM
India is changing. India's standing at the global stage is rising and this is due to Jan Shakti: PM

స్వామి వివేకానంద శికాగో లో చేసిన ప్ర‌సంగం 125వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వం.. ఈ రెండు ఘట్టాల సంద‌ర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు నిర్వ‌హించిన విద్యార్థుల స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని ప్ర‌సంగించారు.

125 సంవ‌త్స‌రాల క్రితం ఇదే రోజు, ఇటీవలే 9/11 గా ప్ర‌సిద్ధమైంది. భార‌త‌దేశానికి చెందిన ఓ యువ‌కుడు కేవ‌లం కొన్ని మాట‌ల‌తో ప్ర‌పంచాన్ని గెలుచుకొన్నాడు; ఏకత్వం యొక్క శ‌క్తిని సైతం ప్ర‌పంచానికి చాటి చెప్పాడు. 1893వ సంవ‌త్స‌రం, సెప్టెంబ‌ర్ 11వ తేదీ ప్రేమ‌, ఏకస్వరం మ‌రియు సోద‌ర‌త్వాల ప్ర‌తీక‌గా నిలిచింది అని ప్రధాన మంత్రి అన్నారు.  

మ‌న స‌మాజంలోకి చొర‌బ‌డిన సామాజిక చెడులకు విరుద్ధంగా స్వామి వివేకానంద గ‌ళ‌మెత్తార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. కేవ‌లం మ‌తప‌ర‌మైన ఆచారాలు ఒక వ్య‌క్తిని దివ్య‌త్వంతో జ‌త ప‌ర‌చ‌జాలవు; ‘జ‌న సేవ’ యే ‘ప్ర‌భు సేవ’ అవుతుంది అని స్వామి వివేకానంద ప్ర‌వ‌చించినట్లు ఆయన గుర్తుకు తెచ్చారు.

ధర్మోపదేశాలను స్వామి వివేకానంద‌కు న‌మ్మ‌ేవారు కాదని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆయ‌న ఆలోచ‌న‌లు, భావ‌జాలం ‘రామ‌కృష్ణ మ‌ఠం’ స్థాపన ద్వారా సంస్థాగ‌త సేవ‌కు బాట వేసినట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

భార‌త‌దేశాన్ని ప‌రిశుభ్రంగా ఉంచ‌డం కోసం అలుపెర‌గ‌క ప‌ని చేస్తున్న వారంద‌రి గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. వారు ‘వందే మాత‌రమ్’ స్ఫూర్తిని సంపూర్ణంగా అత్యున్న‌త స్థాయిలో ఇముడ్చుకున్న‌ారని ఆయ‌న చెప్పారు. విద్యార్థి సంఘాలు విశ్వ విద్యాల‌య ఎన్నిక‌ల‌లో ప్ర‌చారం చేసేట‌ప్పుడు స్వ‌చ్ఛ‌త‌కు మ‌రింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. స్వామి వివేకానందుని ప్ర‌సంగంలోని తొలి ప‌లుకులు అయినటువంటి ‘‘అమెరికా సోద‌రులు, సోద‌రీమ‌ణులారా’’ అనే మాట‌ల‌ లోని స‌హేతుక అతిశయాన్ని మ‌హిళ‌ల‌ను గౌర‌వించేవారు మాత్ర‌మే గ్ర‌హించగలుగుతార‌ని ఆయ‌న చెప్పారు.”  

స్వామి వివేకానంద‌ కు, జమ్ షెద్ జీ టాటా కు మ‌ధ్య జ‌రిగిన ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు భార‌త‌దేశం స్వయం ససమృద్ధి ప‌ట్ల స్వామి గారికి ఉన్న సంబంధాన్ని సూచిస్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. విజ్ఞానం, నైపుణ్యాలు.. ఈ రెండూ కూడా స‌మాన ప్రాధాన్యం క‌లిగినవేనని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

21వ శ‌తాబ్ధం ఆసియా శ‌తాబ్ధం అని ప్ర‌జ‌లు ఇప్పుడు అంటున్నార‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. కానీ, చాలా కాలం క్రిత‌మే స్వామి వివేకానంద ‘ఒకే ఆసియా’ భావ‌న‌ను వ్యక్తం చేశార‌ని, ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు ఆసియా నుండే వ‌స్తాయ‌ని చెప్పార‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

సృజ‌నాత్మ‌క‌త‌కు మ‌రియు న‌వ‌క‌ల్ప‌న‌కు విశ్వ విద్యాల‌య ఆవరణలకు మించిన ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం ఏదీ లేద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ‘‘ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ భార‌త్‌’’ స్ఫూర్తిని బ‌ల‌ప‌ర‌చ‌డం కోసం వేరు వేరు రాష్ట్రాల భాష‌ల‌ను, సంస్కృతిని ఒక పండుగ లాగా జ‌రుపుకోవ‌డం కోసం విశ్వ విద్యాల‌య ఆవ‌ర‌ణ‌లు ప్ర‌త్యేక దినాల‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు.

భార‌తదేశం మారుతోంది, ప్ర‌పంచ రంగ‌స్థ‌లంలో భార‌త‌దేశానికి ఉన్న స్థానం పెరుగుతోంది. దీనికి కార‌ణం జ‌న శ‌క్తే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘నియ‌మాల‌ను అనుస‌రించండి, ఇక భార‌త‌దేశ‌మే రాజ్య‌మేలుతుంది’’ అని విద్యార్థి లోకానికి ఆయ‌న ఉద్బోధించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"