పరివర్తనాత్మక సంస్కరణల ను తీసుకు రావడం జాతీయ విద్య విధానం యొక్క లక్ష్యం గా ఉంది; ఉద్యోగాన్ని అడిగే వారి కంటే ఉద్యోగాన్ని ఇచ్చే వారి ని తయారు చేయడంపైన జాతీయ విద్య విధానం దృష్టి పెడుతుందన్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మార్ట్ ఇండియా హాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలి ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రసంగించారు.
స్మార్ట్ ఇండియా హాకథన్ :
స్మార్ట్ ఇండియా హాకథన్ గ్రాండ్ ఫినాలి లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల కు అనేక పరిష్కారాల ను కనుగొనడం కోసం విద్యార్థులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సమస్యల కు పరిష్కారాలను అందించడమే కాకుండా డేటా, డిజిటైజేశన్, ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భవిష్యత్తు లకు సంబంధించి భారతదేశం యొక్క ఆకాంక్షల ను కూడా బలపరుస్తుందన్నారు. శరవేగం గా దూసుకుపోతున్న 21వ శతాబ్దం లో, సమర్థవంతమైన పాత్ర ను పోషిస్తూ ఉండడానికని భారతదేశం శీఘ్రం గా మారవలసినటువంటి అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అంగీకరిస్తూ, ఆవిష్కరణ, పరిశోధన, రూపురేఖల రచన, అభివృద్ధి మరియు నవ పారిశ్రామికత్వం
ల కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థ ను దేశం లో నిర్మించడం జరుగుతోందన్నారు. భారతదేశం లో విద్య ను మరింత ఆధునికంగా మార్చడం, అలాగే ప్రతిభ కు అవకాశాల ను కల్పించడమే లక్ష్యం అని ఆయన నొక్కి చెప్పారు.
జాతీయ విద్య విధానం :
జాతీయ విద్య విధానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 21 వ శతాబ్దపు యువత యొక్క ఆలోచనల ను, అవసరాల ను, ఆశలను మరియు ఆకాంక్షల ను దృష్టి లో పెట్టుకొని దీనిని రూపొందించడమైందన్నారు. ఇది కేవలం ఒక విధాన పత్రం కాదు, ఇది 130 కోట్ల మందికి పైగా భారతీయుల యొక్క ఆకాంక్షల ప్రతిబింబం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు కు కూడా చాలా మంది బాలలు వారికి ఆసక్తి అంటూ లేనటువంటి ఒక విషయం ప్రాతిపదిక న వారి యొక్క ప్రతిభ పై తీర్పు ను చెప్పడం జరుగుతున్నట్టు భావిస్తున్నారు. తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు మొదలైన వారి ఒత్తిడి కారణం గా పిల్లలు ఇతరులు ఎంచుకొన్న విషయాల ను అనుసరించవలసి వస్తున్నది. ఇది బాగా చదువుకున్నప్పటికీ, వాకె యదివిర దానిలో ఎక్కువ భాగం వారికి ఉపయోగపడకుండా పోతోంది’’ అని ఆయన అన్నారు. ఈ విధానాన్ని మార్చడానికి భారతదేశం యొక్క విద్య వ్యవస్థ లో ఒక క్రమబద్ధమైన సంస్కరణ ను తీసుకు రావడం కోసం నూతన విద్య విధానం ప్రయత్నిస్తుందని, ఇంకా విద్య యొక్క ఉద్దేశ్యాన్ని మరియు నేర్చుకొనే విషయాన్ని.. ఈ రెండిటిలో పరివర్తన ను తీసుకురావాలని నూతన విధానం తలుస్తున్నదని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల మరియు విశ్వవిద్యాలయ అనుభవాల ను పొందడం కోసం నేర్చుకోవడంపైన, పరిశోధనల పైన, ఇంకా ఆవిష్కరణల పైన దృష్టి పెట్టి, ఫలవంతమైన, విస్తృత ప్రాతిపదిక కలిగిన మరియు ఒకరి సహజ కోరికల కు మార్గనిర్దేశం చేసేది గా ఎన్ఇపి ఉంటుందని ఆయన వివరించారు.
విద్యార్థుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఈ హాకథన్ మీరు పరిష్కరించడానికి ప్రయత్నించిన మొదటి సమస్య ఏమీ కాదు, అలాగని ఇది చివరిది కూడా కాదు’’ అన్నారు. నేర్చుకోవడం, ప్రశ్నించడం, పరిష్కరించడం అనే మూడు పనుల ను యువత కొనసాగించాలి అని ఆయన ఆకాంక్షించారు. ఒకరు తెలుసుకొన్నప్పుడే వారికి ప్రశ్నించే జ్ఞానమంటూ అబ్బుతుందని, భారతదేశం యొక్క జాతీయ విద్య విధానం ఈ స్ఫూర్తి ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. పాఠశాల సంచి ని మోసే భారం పాఠశాల స్థాయి వరకే ఉండి ఆ తరువాత తప్పుతుందని, అయితే పాఠశాల కు సంచి ని తీసుకు పోవడం మీద ఉంటున్న దృష్టి ఇక జ్ఞానార్జన అనే వరం- ఏదయితే జీవితానికి తోడ్పడుతుందో- ఆ యొక్క కేవలం గుర్తు పెట్టుకోవడం నుండి లోతు గా ఆలోచించే దిశ గా మళ్లుతున్నదని కూడా ఆయన చెప్పారు.
ఇంటర్ డిసిప్లినరీ స్టడీ కి ప్రాధాన్యం
ఇంటర్ డిసిప్లినరీ స్టడీ కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం నూతన విద్య విధానం యొక్క ఉత్తేజదాయకమైన లక్షణాల లో ఒకటి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ భావన ప్రజాదరణ పొందుతున్నది, ఎందుకంటే ఒక పరిమాణం అందరికీ సరిపోదు కదా. విద్యార్థి ఏమి చేయాలని సమాజం ఊహిస్తోందీ అనే దాని కంటే విద్యార్థి ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు అనే దాని మీదనే దృష్టి ఉండేటట్టు ఇంటర్ డిసిప్లినరీ స్టడీ కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం సునిశ్చితపరచగలదు అని ఆయన అన్నారు.
అందుబాటులో విద్య :
విద్య అందరికీ అందుబాటు లో ఉండాలి అని చెప్పిన బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ ఆశయాన్ని ప్రధానమంత్రి ఉట్టంకిస్తూ, ఈ విద్య విధానం కూడా అందుబాటు లో విద్య అనే ఆయన ఆలోచన కు సమర్ఫణం అయింది అని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య నుండి మొదలుకొని విద్య ను అందరికీ అందుబాటు లో ఉంచడం వరకు జాతీయ విద్య విధానం చాలా పెద్దదని ఆయన అన్నారు. ఉన్నత విద్య లో స్థూల నమోదు నిష్పత్తి ని 2035 వ సంవత్సరానికల్లా 50 శాతాని కి పెంచాలని ఈ విధానం లక్షిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ విద్య విధానం ఉద్యోగాల అన్వేషకుల కంటే ఉద్యోగాల సృష్టికర్తల గురించి నొక్కిచెప్తున్నదన్నారు. అంటే, ఒక విధం గా మన మనస్తత్వం లోను, మన విధానం లో ను సంస్కరణ ను తీసుకు వచ్చే ప్రయత్నమే ఇది అని ఆయన వివరించారు.
స్థానిక భాష కు ప్రాధాన్యం
నూతన విద్య విధానం భారతీయ భాషలు పురోగమించడానికి మరియు మరింత గా అభివృద్ధి చెందేందుకు సహాయకారి అవుతుందని ప్రధాన మంత్రి అన్నారు. విద్యార్థులు వారి విద్యార్జన ఆరంభ సంవత్సరాలలో వారి యొక్క మాతృ భాష లో నేర్చుకోవడం ద్వారా ప్రయోజనాన్ని పొందగలుగుతారని ఆయన అన్నారు. నూతన విద్య విధానం ఉత్తమమైన భారతీయ భాష ల ను ప్రపంచాని కి పరిచయం చేయగలదు అని కూడా ఆయన అన్నారు.
అంతర్జాతీయ సమైక్యత కు ప్రాధాన్యం
ఈ విధానం లో స్థానికత పై దృష్టి ని సారిస్తూనే, అంతర్జాతీయ సమైక్యత కు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ప్రాంగణాల ను ప్రారంభించేటట్టు అగ్ర శ్రేణి అంతర్జాతీయ సంస్థల ను ప్రోత్సహించడమైంది అని ఆయన చెప్పారు. ఇది ప్రపంచ స్థాయి వాతావరణానికి భారతీయ యువత అలవాటుపడడం లో, అవకాశాల ను చేజిక్కించుకోవడం లో కూడాను సహాయపడుతుంది; దీనితో పాటు ప్రపంచం లో పోటీ పడటానికి భారతీయ యువత ను తయారు చేస్తుంది కూడా. దీనితో భారతదేశం లో ప్రపంచ స్థాయి సంస్థల ను నిర్మించడం లో సైతం తోడ్పాటు లభించగలదు, తద్ద్వారా భారతదేశం ప్రపంచం లో విద్య యొక్క కేంద్రం గా క్రొత్త గా బయల్పడుతుంది.