We are developing North East India as the gateway to South East Asia: PM
We are working towards achieving goals that used to appear impossible to achieve: PM
India is the world's biggest democracy and this year, during the elections, people blessed even more than last time: PM

   థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ‘‘సవదీ ప్రధాని మోదీ’’ పేరిట ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సమాజ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. థాయ్‌లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

భారత- థాయ్‌లాండ్‌ సంబంధాలు చరిత్రాత్మకం

  థాయ్‌లాండ్‌లో భారతీయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ భారతీయ భాషలు, రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకులకు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముందుగా స్వాగతం పలికారు. భారత-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన తాను, ఈ దేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. ఆగ్నేయాసియాతో వేలాది ఏళ్లుగా సాగుతూ వచ్చిన భారత తీరప్రాంత రాజ్యాల వాణిజ్య బంధాలు భారత-థాయ్‌లాండ్‌ల మధ్య అనాదిగాగల స్నేహసంబంధాలకు పునాది వేశాయని ఆయన గుర్తుచేశారు. కాలక్రమంలో ఈ బంధం మరింత బలం పుంజుకుని రెండు దేశాల మధ్య సాంస్కృతిక, జీవనశైలి పరమైన సారూప్యతలకు దారితీశాయని వివరించారు. తాను ఏ దేశానికి వెళ్లినా, అక్కడి ప్రవాస భారతీయులను కలుసుకునేందుకు సదా ప్రయత్నిస్తుంటానని ప్రధానమంత్రి అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు భారతీయ సంస్కృతి-సంప్రదాయాలకు పరిపూర్ణ దూతలని ఆయన ప్రశంసించారు.

‘తిరుక్కురళ్’ థాయ్ భాషానువాద ప్రతి ఆవిష్కరణ,

గురునానక్ 550వ జయంతి స్మారక నాణాల విడుదల

  తమిళ ప్రాచీన కావ్యం ‘తిరుక్కురళ్’ థాయ్‌ భాషానువాద ప్రతిని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రాచీన గ్రంథాన్ని ప్రతి ఒక్కరి జీవన మార్గదర్శక కరదీపికగా ఆయన అభివర్ణించారు. దీంతోపాటు గురునానక్ 550వ జయంతి సందర్భంగా ముద్రించిన స్మారక నాణాలను ఆయన విడుదల చేశారు. గురునానక్ బోధనలు మానవాళి మొత్తానికీ వారసత్వంగా సంక్రమించాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. క‌ర్తార్‌పూర్ రహదారి మార్గంలో క‌ర్తార్‌పూర్ సాహిబ్‌ సందర్శన సదుపాయం నవంబరు 9వ తేదీనుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పర్యాటకానికి ఉత్తేజం – తూర్పు కార్యాచరణ విధానానికి కట్టుబాటు

  పర్యాటక రంగానికి ప్రోత్సాహం దిశగా బౌద్ధ సందర్శన ప్రాంతాల వలయం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి వివరించారు. అంతర్జాతీయ ప్రయాణ-పర్యాటక సూచీపరంగా భారతదేశం గడచిన నాలుగేళ్లలో 18 స్థానాల ఎగువకు దూసుకెళ్లిందని ఆయన నొక్కిచెప్పారు. పర్యాటక రంగానికి నూతనోత్తేజం దిశగా మౌలిక అనుసంధాన వసతుల అభివృద్ధితోపాటు వారసత్వ, ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. భారత్ అనుసరిస్తున్న తూర్పూ కార్యాచరణ విధానం స్వరూప-స్వభావాలను వివరిస్తూ- థాయ్‌లాండ్‌తో ఈశాన్యభారత సంధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై భారత్ దృష్టి సారించిందని ఆయన వివరించారు. ఈ ప్రాంతాన్ని ఆగ్నేయాసియా ముఖద్వారంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. భారత-మయన్మార్-థాయ్‌లాండ్‌ల మధ్య త్రైపాక్షిక రహదారి ద్వారా అవరోధరహిత అనుసంధానం ఏర్పడుతుందని, దీంతో ఈ ప్రాంతం మొత్తంలో ప్రగతికి మరింత ఉత్తేజం లభిస్తుందని  ప్రధానమంత్రి చెప్పారు.

ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి

  ప్రజాస్వామ్యానికి భారత కట్టుబాటుతోపాటు ఇటీవల దేశంలో చరిత్రాత్మకంగా నిర్వహించిన 2019 సార్వత్రిక ఎన్నికలద్వారా మరింత ఆధిక్యంతో తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం గురించి ప్రధానమంత్రి వివరించారు. రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దుసహా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాలు, సాధించిన విజయాలను ప్రధానమంత్రి విశదీకరించారు. గడచిన మూడేళ్లలో 8 కోట్ల కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఈ లబ్ధిదారుల సంఖ్య థాయ్‌లాండ్‌ మొత్తం జనాభాకన్నా అధికమని పేర్కొన్నారు. అలాగే 50 కోట్లమందికిపైగా భారతీయులకు ఆరోగ్య సంరక్షణ లబ్ధినందిస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇవేకాకుండా 2022కల్లా ప్రతి కుటుంబానికీ ఇల్లు, ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన వెల్లడించారు.

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi