QuoteThere is something very special about the land of Rajasthan. This is a land of courage: PM
QuoteBe it living in harmony with nature or defending our nation, Rajasthan has shown the way: PM Modi
QuoteThe Central Government and the State Government are working together for the progress of Rajasthan: PM Modi in Jaipur
QuotePM Modi highlights historic increase of 1.5 times in MSP, says Government is working for welfare of our hardworking farmers
QuoteOur aim is inclusive and all-round development: PM: PM Modi
QuoteThere is no tolerance towards corruption. All our efforts are aimed at building a New India: Prime Minister

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌య్ పుర్ లో ఈ రోజు జ‌రిగిన ఒక జ‌న స‌భ ను ఉద్దేశించి ప్ర‌సంగిచారు.

రాజ‌స్థాన్ రాష్ట్రం లో 13 ప‌ట్ట‌ణ అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న సూచ‌కంగా ఏర్పాటైన ఒక ఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.

|

భార‌త ప్ర‌భుత్వం మ‌రియు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు చెందిన ఎంపిక చేసిన ల‌బ్దిదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల తాలూకు దృశ్య‌, శ్ర‌వ‌ణ నివేదిక ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వీక్షించారు. ఈ నివేదిక స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మానికి రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి వ‌సుంధ‌ర రాజె స‌మ‌న్వ‌య‌క‌ర్త గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌థ‌కాల‌లో.. ప్ర‌ధాన మంత్రి ఉజ్జ్వ‌ల యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న, ఇంకా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ల‌తో పాటు అనేక ఇత‌ర ప‌థ‌కాలు.. భాగంగా ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన ఒక జన స‌భ‌ కు ఎంతో ఉత్సాహం తో పెద్ద సంఖ్య‌ లో త‌ర‌లి వ‌చ్చిన స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, సంద‌ర్శ‌కుల‌ను రాజ‌స్థాన్ ఏ విధంగా స్వాగ‌తిస్తుందీ తాను ప్ర‌త్యక్షంగా తిల‌కించిన‌ట్లు చెప్పారు. రాష్ట్రం గ‌త కొన్ని సంవ‌త్స‌రాల‌లో సాధించిన పురోగ‌తి యొక్క వాస్త‌విక చిత్రాన్ని సంద‌ర్శ‌కులు చూడ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. రాజ‌స్థాన్ ను సాహ‌స భూమి గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ప్ర‌కృతి తో సామ‌రస్య భావ‌న‌ తో మ‌న‌గ‌ల‌గ‌డం గాని లేదా మ‌న దేశాన్ని దాడుల బారి నుండి కాపాడుకోవ‌డం లో గాని రాజ‌స్థాన్ మార్గ‌ద‌ర్శి గా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న వివ‌రించారు.

|
|

రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి వ‌సుంధ‌ర రాజె ను ప్ర‌ధాన మంత్రి పొగడుతూ, ఆమె రాష్ట్రం లో ప‌ని సంస్కృతి ని మార్చివేశార‌ని తెలిపారు. రాజ‌స్థాన్ పురోగ‌తికై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల‌సిక‌ట్టుగా కృషి చేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు ఏర్పాటైన నివేదిక స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్న ల‌బ్దిదారులలో వెల్లివిరుస్తున్న సంతోషం ఇక్క‌డ‌కు హాజ‌రైన జ‌న సందోహం లో ప్ర‌తి ఒక్క‌రి లో స్ప‌ష్టమవుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

|

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా పాటుపడుతున్న‌దీ ప్ర‌ధాన మంత్రి సుదీర్ఘంగా వివ‌రించారు. వివిధ పంట‌ల‌కు ప్ర‌స్తుత ఖ‌రీఫ్ కాలానికిగాను ప్ర‌క‌టించిన‌టువంటి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ లో పెంపుద‌ల‌ ను గురించి ఆయ‌న చెప్పుకొచ్చారు.

స్బ‌చ్ఛ్ భారత్ మిశన్‌, జ‌న్ ధ‌న్ యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, ముద్ర యోజ‌న‌, ఉజ్జ్వ‌ల యోజ‌న మ‌రియు సౌభాగ్య యోజ‌న ల‌తో స‌హా కేంద్ర ప్ర‌భుత్వం యొక్క వివిధ ప‌థ‌కాలు సాధించిన పురోగ‌తి ని గురించి కూడా ప్ర‌ధాన మంత్రి తన ప్రసంగంలో ప్ర‌స్తావించారు.

వ‌చ్చే సంవ‌త్స‌రం లో రాజ‌స్థాన్ 70 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకొంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెబుతూ ఒక అభివృద్ధియుత రాజ‌స్థాన్.. ఏదైతే ‘న్యూ ఇండియా’ నిర్మాణం లో ఒక ప్ర‌ముఖ పాత్ర ను పోషించ‌గ‌లుగుతుందో.. అటువంటి రాజ‌స్థాన్ ను ఆవిష్క‌రించేందుకు వ‌చ‌న‌బ‌ద్ధ‌త‌ను పున‌రుద్ఘాటిద్దామ‌ంటూ పిలుపునిచ్చారు.

|

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond