ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు అండ‌మాన్ మ‌రియు నికోబార్ దీవుల లోని పోర్ట్ బ్లేయ‌ర్ ను సంద‌ర్శించారు.

పోర్ట్ బ్లేయ‌ర్ లో గ‌ల సెల్యుల‌ర్ జైలు ను ఆయ‌న సంద‌ర్శించారు. అమ‌ర‌వీరుల స్తంభం వ‌ద్ద పూల‌మాల‌ ను స‌మ‌ర్పించారు. వీర్ సావ‌ర్క‌ర్, ఇంకా ఇత‌ర స్వాతంత్య్ర యోధుల‌ను ఉంచిన జైలు గ‌దుల‌ ను ఆయ‌న సంద‌ర్శించారు. ఒక ఎత్తయిన స్తంభాని కి అమ‌ర్చిన జెండా ను ఆయ‌న ఆవిష్క‌రించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్ర‌హం వ‌ద్ద పుష్పాంజ‌లి ని ఘ‌టించారు.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భార‌త భూమి మీద మువ్వ‌న్నెల జెండా ను ఎగుర‌వేసిన ఘ‌ట‌న తాలూకు 75 వ వార్షికోత్స‌వ సూచ‌కం గా ఏర్పాటైన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకొని ఒక స్మార‌క త‌పాలా బిళ్ళ‌ ను, నాణేన్ని, అలాగే ఫ‌స్ట్ డే క‌వ‌ర్ ను విడుదల చేశారు.

శ‌క్తి రంగం, సంధాన రంగం, ఆరోగ్య రంగాల‌కు సంబంధించిన అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌ను కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భం గా ఆయ‌న ప్ర‌సంగిస్తూ, అండ‌మాన్ మ‌రియు నికోబార్ దీవులు భార‌త‌దేశం యొక్క ప్రాకృతిక శోభ‌ కు ఒక సంకేతంగా మాత్రమే కాకుండా భార‌తీయుల‌ కు ఒక యాత్రా స్థ‌లం గా కూడా అలరారుతున్నాయ‌న్నారు. మ‌న స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల స‌మ‌ష్టి సంక‌ల్పాన్ని అండ‌మాన్ మ‌రియు నికోబార్ దీవులు గుర్తు కు తెస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఈ దీవులను అభివృద్ధిప‌ర‌చి వీటికి సాధికారిత ను క‌ల్పించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డివుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజున ఆవిష్క‌రించిన అభివృద్ధి ప‌థ‌కాలు విద్య‌, ఆరోగ్యం, సంధానం, ప‌ర్య‌ట‌న, ఇంకా ఉపాధి రంగాల లో ఈ ల‌క్ష్యాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాయని ఆయ‌న వివ‌రించారు.

సెల్యుల‌ర్ జైలు ను, నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ 75 సంవ‌త్స‌రాల క్రితం త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన చోటు ను తాను సంద‌ర్శించిన సంగ‌తి ని ఆయ‌న ప్ర‌స్తావించారు. వేలాది స్వాతంత్య్ర యోధులు శిక్ష‌ల‌ ను అనుభ‌వించిన సెల్యుల‌ర్ జైలు త‌న‌కు ఒక ప్రార్థ‌న స్థ‌లం క‌న్నా త‌క్కువది కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్వాతంత్య్ర యోధుల త్యాగాల‌ ను దేశ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌రువ‌బోర‌ని ఆయ‌న చెప్పారు.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటూ, నేతాజీ ఇచ్చిన పిలుపు ను అందుకొని అండ‌మాన్ దీవుల‌కు చెందిన ఎంతో మంది యువ‌తీ యువ‌కులు భార‌త‌దేశ స్వాతంత్య్రం కోసం త‌మ‌ను తాము అంకితం చేసుకొన్నార‌న్నారు. 150 అడుగుల ఎత్తున్న స్తంభాని కి అలంక‌రించిన ప‌తాకం 1943వ సంవ‌త్సరం లో ఇదే రోజు న నేతాజీ ఆవిష్క‌రించిన త్రివ‌ర్ణ ప‌తాకం యొక్క స్మృతి ని ప‌దిలప‌ర‌చే ఒక ప్ర‌య‌త్న‌ం అని ఆయ‌న వివ‌రించారు.

ఈ సంద‌ర్భం గా రాస్ దీవి ని ఇక మీద‌ట నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీపం గాను; నీల్ దీవి ని శహీద్ ద్వీపం గాను; హావ్‌లాక్ దీవి ని స్వ‌రాజ్ ద్వీపం గాను కొత్త పేరు లతో వ్య‌వ‌హారం లోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

నేతాజీ స్వ‌ప్నానికి అనుగుణంగా ఒక బ‌ల‌మైన భార‌త‌దేశాన్ని నిర్మించే దిశ‌ గా భార‌తీయులు ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

దేశవ్యాప్తం గా సంధానాన్ని పటిష్ట‌ప‌ర‌చే దిశ‌ గా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. మ‌న వీరుల‌ను గుర్తుకు తెచ్చుకోవ‌డం, మ‌రి వారిని గౌర‌వించుకోవ‌డం వ‌ల్ల మ‌న‌లో స‌మైక్య భావం బ‌ల‌ప‌డ‌టానికి తోడ్పాటు ల‌భిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. మ‌న చ‌రిత్ర లోని ప్ర‌తి ఒక్క భ‌వ్య‌మైన అధ్యాయాన్ని ప్ర‌ముఖం గా చాట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తున్నట్లు ఆయ‌న వెల్లడించారు. ఈ సంద‌ర్భం లో బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ కు సంబంధించిన పంచ‌తీర్థ్, జాతీయ పోలీసు స్మార‌కం, ఇంకా ఏకత విగ్ర‌హం లను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ , స‌ర్ దార్ ప‌టేల్ ల పేరు లతో జాతీయ పుర‌స్కారాల‌ ను కూడా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు.

ఈ మ‌హా నాయ‌కుల నుండి ప్రేర‌ణ‌ ను పొంది రూపుదిద్దుతున్న ‘న్యూ ఇండియా’ కు అభివృద్ధి కేంద్ర స్థానం లో ఉన్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ప‌ర్యావ‌ర‌ణం ఆవ‌శ్య‌క‌త‌ ల‌కు త‌గిన‌ట్లుగా ఈ దీవుల‌ను అభివృద్ధిచేయడానికి ప్ర‌భుత్వం సంక‌ల్పబ‌ద్ధురాలై ఉంద‌ని ఆయ‌న చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి లో భాగంగా ప‌ర్య‌ట‌న, ఫూడ్ ప్రాసెసింగ్, ఇంకా ఇన్ఫర్మేశన్ టెక్నాల‌జీ త‌దిత‌ర రంగాల‌ పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

అండ‌మాన్ మ‌రియు నికోబార్ దీవుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు స్వ‌యంస‌మృద్ధం గా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పోర్ట్ బ్లేయ‌ర్ డాక్ యార్డు విస్త‌ర‌ణ ను గురించి ఆయ‌న చెప్తూ ఇది పెద్ద నౌక‌ల నిర్వ‌హ‌ణ‌ కు తోడ్పడగలద‌న్నారు. దీవుల లోని గ్రామీణ ప్రాంత ర‌హ‌దారుల స్థితిగ‌తుల‌పై రెండు వారాల లోప‌ల ఒక నివేదిక‌ ను ఇవ్వవలసిందని ఆయ‌న సూచించారు. నివేదిక ను ప‌రిశీలించిన అనంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం చేత‌నైనంతవరకు స‌హాయాన్ని అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

వీర్ సావ‌ర్క‌ర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం లో ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ ట‌ర్మిన‌ల్ బిల్డింగ్ సిద్ధ‌ం అవుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. చెన్నై నుండి స‌ముద్రం లోపలి భాగం లో వేస్తున్న ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ ప‌నులు ఒకసారి పూర్తి అయ్యాయంటే గనక చ‌క్క‌ని ఇంట‌ర్ నెట్ సంధానం అంది వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. జలం, విద్యుత్తు, ప‌రిశుభ్ర‌మైన శ‌క్తి, ఇంకా ఆరోగ్యం వంటి రంగాల‌లో అమ‌ల‌వుతున్న అభివృద్ధి ప‌నుల‌ను గురించి కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగం లో వివ‌రించారు.

Click here to read full text of speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi