మంచి చెడులలో, భారతదేశం ఉంది, మరియు ఎల్లప్పుడూ శ్రీలంకకు మొదటిగా స్పందిస్తుంది: ప్రధాని మోదీ

నేను శ్రీలంకను చూసినప్పుడు, నేను పొరుగుదేశంగా మాత్రమే కాకుండా, దక్షిణ ఆసియాలో మరియు భారత మహా సముద్ర కుటుంబంలో భారతదేశం యొక్క ప్రత్యేకమైన, విశ్వసనీయ భాగస్వామిగా చూస్తాను: ప్రధాని

శ్రీలంకతో మన సహకారం భాగస్వామ్య పురోగతిని వాస్తవంలోకి అనువదించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది: ప్రధానమంత్రి

భార‌త‌దేశం స‌హాయం తో శ్రీ‌ లంక లో ఎమ‌ర్జెన్సి ఆంబులెన్స్ స‌ర్వీస్ యొక్క విస్త‌ర‌ణ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.

శ్రీ ‌లంక ప్ర‌ధాన మంత్రి శ్రేష్ఠులు శ్రీ రానిల్ విక్ర‌మ్ సింఘే జాఫ్నా నుండి ఈ కార్యక్ర‌మం లో పాలుపంచుకోనున్నారు.

ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం ఈ కింది విధంగా ఉంది:

గౌర‌వ‌నీయులైన శ్రీ‌ లంక ప్ర‌ధాని మ‌రియు నా స్నేహితుడు శ్రేష్ఠులు శ్రీ రానిల్ విక్ర‌మ్ సింఘే,

ప్రొఫెస‌ర్ శ్రీ మైత్రి విక్ర‌మ‌ సింఘే,

శ్రీ‌ లంక‌కు చెందిన గౌర‌వ‌నీయులైన మంత్రులు,

శ్రీ ‌లంక లో భార‌త‌దేశం యొక్క హై క‌మిష‌న‌ర్‌,

నార్దన్ ప్రావిన్స్ యొక్క మాన్య ముఖ్య‌మంత్రి,

శ్రీ‌ లంక పార్ల‌మెంటు కు చెందిన మాన‌నీయ స‌భ్యులు,

గౌర‌వాన్వితులైన మ‌త నాయ‌కులు,

ప్ర‌ముఖ అతిథులు మ‌రియు మిత్రులారా,

న‌మ‌స్కారం

Ayubowan

వ‌ణ‌క్కమ్

జాఫ్నా లోని మీ అంద‌రితో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు సంభాషిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.

జాతీయ అత్య‌వ‌స‌ర ఆంబులెన్స్ సేవ ను యావ‌త్తు శ్రీ‌ లంక లో విస్త‌రిస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను చాలా సంతోషంతో ఉన్నాను.

భార‌త‌దేశం మ‌రియు శ్రీ లంక ల అభివృద్ధిపూర్వకమైన భాగ‌స్వామ్యం లో మ‌రొక ప్ర‌ధాన‌మైన కార్య సాధ‌న‌ ను ఈ ఘ‌ట్టం సూచిస్తోంది.

ఈ త‌ర‌హా వ్య‌వ‌స్థ‌ను శ్రీ లంక లో ఏర్పాటు చేయాల‌ని వుంద‌ని 2015వ సంవ‌త్స‌రం లో నేను శ్రీ లంక లో ప‌ర్య‌టించిన‌ప్పుడు నా మిత్రుడు ప్ర‌ధాని శ్రీ విక్ర‌మ సింఘే నాతో చెప్పారు.

ఈ సేవ లో ఒకటో దశ 2016వ సంవ‌త్స‌రం జులై నెల‌లో వెస్టర్న్ ప్రావిన్స్ లోను, సదరన్ ప్రావిన్సు లోను ప్రారంభం అయిన సంగతిని తెలుసుకొని నేను చాలా సంతోషించాను.

గ‌త సంవ‌త్స‌రం నేను శ్రీ లంక లో ప‌ర్య‌టించిన వేళ ప్రి-హాస్పిట‌ల్ ఎమర్జన్సి ఆంబులెన్స్ స‌ర్వీసు ను శ్రీ లంక అంత‌టా విస్త‌రించేందుకు భార‌త‌దేశం కృషి చేస్తుంద‌ని శ్రీ లంక లోని స్నేహ‌శీలురైన ప్ర‌జ‌ల‌కు నేను వాగ్దానం చేశాను.

భార‌త‌దేశం త‌న వాగ్దానాన్ని కాలబద్దమైనటువంటి రీతి లో నెర‌వేర్చడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ సేవ యొక్క రెండో ద‌శ ఆరంభాన్ని మనం ఈ రోజున గమనించుకొంటున్నాము.

ఈ ద‌శ యొక్క విస్త‌ర‌ణ నార్దన్ ప్రావిన్స్ తో మొద‌లు పెట్టుకోవడం నాకు ఆనందంగా ఉంది. గ‌త కాల‌పు క‌న్నీటిని తుడిచి ప్ర‌కాశ‌వంత‌మైన భ‌విష్య‌త్తు ను ఆహ్వానించ‌డం లో మీతో క‌ల‌సి పని చేస్తున్నందుకు భార‌త‌దేశం సంతోషిస్తోంది.

ఈ సేవ తో ముడిప‌డి ఉన్న వారు భార‌త‌దేశం లో శిక్ష‌ణను పొందిన‌ట్లు నేను గ్ర‌హించాను. కావలసిన ప్రావీణ్యాలు మరియు స్థానిక ఉద్యోగకల్పన సైతం ఒక ఉత్తేజాన్ని అందుకోగలుగుతాయి.

మిత్రులారా,

శ్రీ లంక త‌న తొలి ప్ర‌తిస్పంద‌న పూర్వ‌క సేవ‌ను నెల‌కొల్పుకోవ‌డం లోను మ‌రి ఆ సేవ‌ ను విస్త‌రించుకోవ‌డం లోను భాగ‌స్వామ్యాన్ని అందించే ప్ర‌త్యేక అధికారం భార‌త‌దేశానికి ద‌క్క‌డం కేవ‌లం కాకతాళీయం ఏమీ కాదు.

మంచి రోజుల‌లోను, కష్ట కాలం లోను శ్రీ లంక కు తొలి ప్ర‌తిస్పంద‌నను అందించే దేశం గా భార‌త‌దేశం ఎల్ల‌ప్ప‌టికీ నిలుస్తూ వుంటుంది.

భిన్నత్వంతో కూడుకొన్నటువంటి రెండు ప్ర‌జాస్వామ్య దేశాల నేత‌లు గా ప్ర‌ధాని శ్రీ విక్ర‌మ సింఘే మ‌రియు నేను అభివృద్ధి తాలూకు ప్ర‌యోజ‌నాలను స‌మాజంలో అన్ని వ‌ర్గాల వారికి అందించాల‌ని న‌మ్ముతున్నాము.

శ్రీ లంక పౌరులంద‌రి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చుతున్నందుకు అధ్య‌క్షుల వారు శ్రేష్ఠులు శ్రీ సిరిసేన మ‌రియు ప్ర‌ధాని శ్రీ విక్ర‌మ సింఘే ల యొక్క ప్ర‌య‌త్నాల‌ను నేను ప్ర‌శంసిస్తున్నాను.

మిత్రులారా,

ప్ర‌ధాన మంత్రి గా శ్రీ లంక లో నేను జ‌రిపిన రెండు ప‌ర్య‌ట‌నల తాలూకు ప్రేమాస్ప‌ద మైన జ్ఞాప‌కాలు నా లోపల ఉన్నాయి. నా పై వ‌ర్షించినటువంటి ప్రేమానురాగాల‌ తో నేను ఉబ్బిత‌బ్బిబ్బు అయ్యాను.

జాఫ్నా ను సంద‌ర్శించిన ప్ర‌థ‌మ భార‌త‌దేశ ప్ర‌ధానిని కావ‌డం నా అదృష్టం. కిందటి సంవ‌త్స‌రంలో జ‌రిగిన యుఎన్ వేసాక్ డే ఉత్స‌వాలలో కూడా నేను పాలుపంచుకొన్నాను. ఇవ‌న్నీ మ‌ర‌పురానటువంటి అనుభూతులు.

మిత్రులారా,

అన్ని దేశాల అస్తిత్వం వాటి యొక్క ఇరుపొరుగు దేశాల‌తో స‌న్నిహితంగా పెన‌వేసుకొని ఉంటుంది.

శ్రీ లంక కేసి నేను దృష్టి సారించిన‌ప్పుడు, ఒక పొరుగు దేశం గానే కాక ద‌క్షిణ ఆసియా లోను, హిందూ మ‌హాస‌ముద్ర ప‌రివారం లోను ఒక అత్యంత ప్ర‌త్యేక‌మైనటువంటి మ‌రియు విశ్వ‌స‌నీయ‌మైన‌టు వంటి భాగ‌స్వామి గా కూడా శ్రీ లంక ను చూస్తాను.

శ్రీ లంక తో మా అభివృద్ధియుత స‌హ‌కారం ఉభయ పక్షాల పురోగ‌తి తాలూకు దార్శ‌నిక‌త‌ ను ఆచ‌ర‌ణ లోకి తీసుకొని వ‌చ్చే ఒక ముఖ్య‌మైన మార్గం అని నేను న‌మ్ముతున్నాను.

మూడు సంవ‌త్స‌రాల క్రితం శ్రీ లంక లో పార్ల‌మెంటు ను ఉద్దేశించి ప్ర‌సంగించే గౌర‌వం నాకు ద‌క్కిన‌ప్పుడు సామీప్యాన్ని స‌న్నిహిత సంబంధం గా మార్చుకోవ‌డానికి వీలైన‌న్ని చ‌ర్య‌ల‌ను తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ ను గురించి నేను మాట్లాడాను.

మ‌హాత్మ గాంధీ 1927వ సంవ‌త్స‌రం లో జాఫ్నా స్ట్యూడెంట్ కాంగ్రెస్ యొక్క ఆహ్వానం పై శ్రీ లంక ను సంద‌ర్శించిన‌ప్ప‌టి సంగ‌తిని నేను జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాను. అప్ప‌ట్లో ఆయ‌న ద‌క్షిణాదిన ఉన్న మాత‌ర నుండి ఉత్త‌రాదిన ఉన్న పాయింట్ పెడ్రో వ‌ర‌కు యాత్ర చేశారు. త‌లైమ‌న్నార్ గుండా తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యే క‌న్నా కొద్ది సేపు ముందు జాఫ్నా లోని స్వాగ‌త సంఘం తో ఆయ‌న చెప్పిన మాట‌లు: ‘‘జాఫ్నా కు నేను ఇచ్చే సందేశం యావ‌త్తు సింహ‌ళీయుల‌ కు కూడా వ‌ర్తిస్తుంది. అది ఏమిటంటే, ‘‘కంటి చూపు నుండి ఆవ‌ల‌కు వెళ్ళ‌డాన్ని మ‌స్తిష్కం లో నుండి బ‌య‌ట‌కు పోవ‌డంగా ఎంచకండి’’ అని.

మ‌రి ఈ రోజు నేను ఇచ్చే సందేశం కూడా అదే. మ‌న ప్ర‌జ‌లు ఒక‌రితో మ‌రొక‌రు నిరంత‌రం అనుబంధితులై ఉండాలి. అలా ఉన్నప్పుడు మ‌నం ఒక‌రిని మ‌రొక‌రం మ‌రింత‌గా తెలుసుకో గ‌లుగుతాము. అంతేకాదు, మ‌రింత స‌న్నిహితమైనటువంటి స్నేహితులుగా కూడాను మార‌గలుగుతాము.

భార‌త‌దేశానికి త‌ర‌లివ‌చ్చి రూపుదాలుస్తున్న న్యూ ఇండియా ను గురించి తెలుసుకోవ‌ల‌సిందిగా మిమ్మ‌ల్ని నేను ఉత్సాహపరచదలుస్తున్నాను.

శ్రేష్ఠులు ప్ర‌ధాని శ్రీ విక్ర‌మ సింఘే ఆగ‌స్టు నెల మొద‌ట్లో భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌నున్నార‌ని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. భార‌త‌దేశంలో మీ యాత్ర సౌక‌ర్య‌వంతంగా సాగాల‌ని, భార‌త‌దేశం లో మీరు ఆనందదాయకమైన బ‌సను పొందాలని నేను కోరుకుంటున్నాను.

మీకు ధ‌న్య‌వాదాలు. మీకంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India