This is the strength of the farmers of our country that the production of pulses has increased from almost 17 million tonnes to 23 million tonnes in just one year: PM
100% neem coating of urea has led to its effective utilisation: PM
Due to Soil health Cards lesser fertilizers are being used and farm productivity has gone up by 5 to 6 per cent: PM Modi
We have announced ‘Operation Greens’ in this year’s budget, we are according TOP priority to Tomato, Onion, Potato: PM Modi
Promoting use of solar energy will lead to increase in the income of farmers: PM Modi

 

  • ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై ఢిల్లీ లోని పూసా లో ఉన్న ఎన్ఎఎస్‌సి కాంప్లెక్స్ లో నేడు నిర్వ‌హించిన జాతీయ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

    దిగువ‌న పేర్కొన్న విష‌యాల‌పై ఏడు ప్రాతిప‌దికాపూర్వ‌క బృందాలు వాటి వివరణల‌ను స‌మ‌ర్పించాయి:

    * విధానం మ‌రియు ప‌రిపాల‌న సంబంధ‌ సంస్క‌ర‌ణ‌లు

    * వ్య‌వ‌సాయ వాణిజ్య విధానం మ‌రియు ఎగుమ‌తుల ప్రోత్సాహం; మార్కెట్ స్వ‌రూపం మరియు మార్కెటింగ్ సామ‌ర్ధ్యం

    * విలువ శ్రేణి మ‌రియు స‌ర‌ఫ‌రా శ్రేణుల నిర్వ‌హ‌ణ‌

    * వ్య‌వ‌సాయంలో శాస్త్ర విజ్ఞానం మ‌రియు సాంకేతిక విజ్ఞానం, ఇంకా స్టార్ట్‌-అప్ లు

    * స్థిర‌మైన మ‌రియు ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన అభివృద్ధి, ఇంకా స‌మ‌ర్ధ‌మైన సేవ‌ల అంద‌జేత‌

    * కేపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్రెడిట్ ఫ‌ర్ ఫార్మ‌ర్స్‌

    * వృద్ధి చోద‌క శ‌క్తులుగా ప‌శుగ‌ణం పెంపకం, పాడి కేంద్రం నిర్వహణ, కోళ్ళ పెంప‌కం మ‌రియు చేప‌ల పెంప‌కాన్ని చేపట్టడం

ఈ వివరణ ల‌ను ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొన్నారు. భార‌తదేశంలో వ్య‌వ‌సాయ‌దారుల‌ను- ప్ర‌త్యేకించి కాయ‌ధాన్యాల ఉత్ప‌త్తిలో పెద్ద వృద్ధిని సాధించినందుకు గాను- ఆయ‌న అభినందించారు.

వ్య‌వ‌సాయ‌దారుల ఆదాయాన్ని మెరుగుప‌ర‌చేందుకు ప్ర‌భుత్వం ప‌లు స‌మ‌న్వ‌య పూరిత చ‌ర్య‌ల‌ను తీసుకొంటోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా నాలుగు అంశాల‌ను .. ఇన్‌పుట్ కాస్ట్స్ ను త‌గ్గించ‌డం; దిగుబ‌డికి న్యాయ‌మైన ధ‌ర ప‌లికేట‌ట్లు చూడ‌టం; వ్య‌ర్థాల‌ను త‌గ్గించ‌డంతో పాటు ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రుల క‌ల్ప‌న.. గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

యూరియాకు 100 శాతం వేప పూతను అమ‌లుపరచడంతో యూరియా యొక్క స్వీయ సామ‌ర్ధ్యం పెరిగిన‌ట్లు, దిగుబ‌డులు కూడా వృద్ధి చెందిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. భూమి స్వ‌స్థ‌త కార్డుల‌ ఉప‌యోగం ర‌సాయ‌నిక ఎరువుల వాడ‌కాన్ని త‌గ్గించ‌డ‌మే కాక ఉత్ప‌త్తిని కూడా పెంచింద‌ని ఒక అధ్య‌య‌నం సూచించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

కేంద్ర ప్ర‌భుత్వం అసంపూర్తిగా ఉన్న 99 సేద్య‌పు నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే దిశ‌గా కృషి చేస్తోంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. వీటిలో 50 ప్రాజెక్టులు ఈ సంవ‌త్స‌రంలో పూర్తి అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. నిర్మాణం పూర్తి అయ్యే ప్ర‌తి సేద్య‌పు నీటిపారుద‌ల ప్రాజెక్టు వ్య‌వ‌సాయ‌దారుల ఇన్‌పుట్ కాస్ట్ ను త‌గ్గిస్తుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ‘ప్ర‌ధాన మంత్రి కృషి సించాయీ యోజ‌న‌’ ద్వారా ఇంత‌వ‌ర‌కు 20 ల‌క్ష‌ల హెక్టార్ల వ్య‌వ‌సాయ భూమిని సూక్ష్మ సేద్య‌పు నీటిపారుద‌ల ప‌రిధిలోనికి తీసుకు రావ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ సంవ‌త్స‌రపు బ‌డ్జెట్ లో ప్ర‌క‌టించిన ‘ఆప‌రేష‌న్ గ్రీన్స్’ టొమాటో, ఉల్లిగ‌డ్డ‌లు, ఇంకా బంగాళా దుంప‌ల‌ను పండించే రైతుల‌కు లబ్ధిని చేకూర్చ‌నుంద‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు. 22,000 గ్రామీణ హాత్ ల‌ను త‌గిన మౌలిక స‌దుపాయాల‌తో మెరుగుప‌ర‌చి, ఇ- నామ్ (e-NAM) వేదిక‌తో మిళితం చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు. వ్య‌వ‌సాయ‌దారులు వారి పొలానికి 5 నుండి 15 కిలో మీట‌ర్ల లోప‌ల విపణుల‌తో అనుసంధానం అయ్యే ఓ సౌక‌ర్యాన్ని అందుకోగ‌ల‌ర‌ని ఆయ‌న వెల్లడించారు.

వ్య‌వ‌సాయ‌దారుల‌కు రుణాలు స‌ర‌ళంగా అందుబాటులోకి వచ్చేటట్లు చూసేందుకుగాను వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తికి మంజూరు చేసిన మొత్తాన్ని పెంచడ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

వ్య‌వ‌సాయ సంబంధ వ్య‌ర్థాల‌ను సంప‌ద రూపం లోకి మార్పిడి చేసేందుకు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న‌ట్లు కూడా ఆయ‌న పేర్కొన్నారు. 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."